Business

దివీస్ ల్యాబ్స్ భారీ లాభాలు-వాణిజ్యం

దివీస్ ల్యాబ్స్ భారీ లాభాలు-వాణిజ్యం

* పెట్రోల్‌, డీజిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుడిమాండ్ చేశారు.

* రుణగ్రహీతల సమ్మతి లేకుండా ఈ ఏడాది మే నెలలో తమ అనుబంధ సంస్థ భారత్‌ ఫినాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌(బీఎఫ్‌ఐఎల్‌) 84 వేల రుణాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. సాంకేతిక సమస్యల వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించింది. ‘ఎవర్‌గ్రీనింగ్‌’(శాశ్వత పునరుద్ధరణ)లో భాగంగానే బ్యాంకు ఈ అక్రమ పద్ధతులను అవలంబించిందని వస్తున్న ఆరోపణలను ఖండించింది. ఎవరైనా రుణం తీసుకొని తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోతే.. బ్యాంకులు మరోసారి వారికి అదనపు రుణం ఇచ్చి పాత రుణం ఖాతాలో జమచేసుకుంటాయి. రుణ కాలపరిమితి ముగిసిన ప్రతిసారీ ఇలాగే పునరుద్ధరిస్తూ వెళ్తాయి. దీని వల్ల రుణగ్రహీతకు రుణం పొందే అర్హత పెరుగుతుంది. అలాగే బ్యాంకుల పద్దు పుస్తకాల్లో మొండి బకాయిల మొత్తం తగ్గుతుంది. బ్యాంకు మంజూరు చేసిన రుణం మాత్రం ఎప్పటికీ వసూలు కాదు. దీన్నే ఎవర్‌గ్రీనింగ్‌ అంటారు. ఇది భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో తరచూ జరుగుతుంటుంది! నియంత్రణ సంస్థలు మాత్రం ఈ విధానాన్ని అస్సలు అనుమతించవు. తాజాగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ మంజూరు చేసిన 84 వేల రుణాలు కూడా ఎవగ్రీనింగ్‌లో భాగమేనని ఓ ప్రజావేగు ఆరోపించారు.

* హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ దివీస్‌ లేబొరేటరీస్‌.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. త్రైమాసిక ఆదాయం రూ.2,006.62 కోట్లు ఉండగా, దీనిపై రూ.606.46 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.1,762.94 కోట్లు, నికరలాభం రూ.519.59 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే ఈసారి ఆదాయంలో 11.38 శాతం, నికరలాభంలో 16.71 శాతం వృద్ధి నమోదైంది. కొవిడ్‌-19 మూలంగా సమీక్షా త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని దివీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

* కేంద్ర ప్ర‌భుత్వం గ‌త బుధ‌వారం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించ‌డంతో దేశ‌వ్యాప్తంగా పెట్రో ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.6.29 త‌గ్గుద‌ల న‌మోదైంది. డీజిల్‌పై రూ.12.78 త‌గ్గింది. శుక్ర‌వారం న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.108.18గా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.94.62గా ఉన్న‌ది. కాగా, ఈ మ‌ధ్య కాలంలో పెట్రో స‌రైన ప‌ద్ధ‌తిలో పెరుగ‌లేద‌ని పెట్రో డీల‌ర్‌లు ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ప్ర‌స్తుతం పెట్రో ధ‌రలు స్వ‌ల్పంగా త‌గ్గినా త్వ‌ర‌లోనే మ‌ళ్లీ పెరుగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

* ఆన్‌లైన్ క్యాబ్ అగ్రిగేట‌ర్‌, బెంగ‌ళూరు కేంద్రంగా సేవ‌లందిస్తున్న ఓలా.. గ్రాస‌రీ డెలివ‌రీ స‌ర్వీసులోకి అడుగు పెట్టింది. ఒక ఈ-కామ‌ర్స్ సంస్థ నిర్వ‌హిస్తున్న స్టోర్ నుంచి స‌ద‌రు గ్రాస‌రీ వ‌స్తువుల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు డెలివ‌రీ చేయ‌నున్న‌ది. ఇప్ప‌టికే ఈ రంగంలో డామినేట్ పొజిష‌న్‌లో ఉన్న టెక్ స్టార్ట‌ప్స్ డుంజో, స్విగ్గీల‌తోపాటు సంప్ర‌దాయ సూప‌ర్‌మార్కెట్ చైన్ క‌ల బిగ్ బ‌జార్ వంటి సంస్థ‌లు కూడా ఈ-కామ‌ర్స్‌లో గ్రాస‌రీ డెలివ‌రీ సేవ‌ల్లోకి ఎంట‌ర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెంద‌డంతోపాటు తీవ్ర పోటీనెదుర్కొంటున్న‌ ఈ-కామ‌ర్స్ బిజినెస్‌లో అడుగు పెట్టేందుకు ఓలా చేస్తున్న రెండో ప్ర‌య‌త్నం ఇది.