NRI-NRT

డా.ఎల్లా కృష్ణ దంపతులకు రామినేని పురస్కారాల ప్రదానం

డా.ఎల్లా కృష్ణకు రామినేని పురస్కారాల ప్రదానం

డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021 పురస్కారాల ప్రకటన

డాక్టర్ కృష్ణా ఎం. ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎం. ఎల్లా, బ్రహ్మానందం, ప్రొఫెసర్ దుర్గాపద్మజ, ఎసి. రామారావులకు పురస్కారాలు

డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021 పురస్కారాలు ప్రకటించింది. విశిష్ట పురస్కారం ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు భారత్ బయోటక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణా ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లాలకు లభించింది. హాస్యనటుడు పద్మశ్రీ కె. బ్రహ్మానందం, నిమ్స్ ఆసుపత్రి ఆనస్తీషియా విభాగం ఉపన్యాసకులు ప్రొఫెసర్ దుర్గాపద్మజ, తెలుగు చలనచిత్ర చరిత్రకారులు, రచయిత ఎస్.వి. రామారావుకు విశేష పురస్కారం లభించింది.

డాక్టర్ రామినేని ఫౌండేషన్ నగరంలోని ఒక హెూటల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మప్రచారక్ ఈ అవార్డులను ప్రకటించారు. ఫౌండేషన్ కన్వీనర్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ రామినేని అయ్యన్నచౌదరి అమెరికాలో ఉన్నతోద్యోగం చేసి అక్కడే స్థిరపడి తమ జన్మస్థలం అయిన బ్రాహ్మణకోడూరు గ్రామ అభివృద్ధికి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. అయ్యన్న చౌదరి స్ఫూర్తితో ఆయన కుమారులు ధర్మప్రచారక్, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర, కుమార్తె శారద తమ సొంత నిధులతో స్థాపించిన ఈ ఫౌండేషన్ ద్వారా గుంటూరు జిల్లాలో ప్రతిభ చూపిన 500 మంది విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున ఉపకారవేతనాలు, అవార్డులు, ప్రధానోపాధ్యాయులకు అవార్డులు ఇస్తున్నారన్నారు. ఈ ప్రోత్సాహకాల కారణంగా గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ప్రతిభ చూపిస్తున్నారని వివరించారు. అలాగే 32 విభిన్న రంగాలకు చెందిన విశిష్ట ప్రతిభ చూపిన వ్యక్తులకు కూడా రామినేని ఫౌండేషన్ అవార్డులు ఏటా ప్రదానం చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది అయిదుగురు డాక్టర్ కృష్ణా ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా, బ్రహ్మానందం, ఎస్.వి.రామారావులకు పురస్కారాలు ప్రకటించామన్నారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వివరాలు త్వరలో ప్రకటిస్తామని పాతూరి నాగభూషణం చెప్పారు.