Movies

స్వీటి నుండి…స్వీట్ న్యూస్

స్వీటి నుండి…స్వీట్ న్యూస్

అనుష్కశెట్టి.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ పేరు చూడడం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ గతేడాది ఓటీటీ వేదికగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌లను అనుష్క ఎప్పుడు ప్రకటిస్తుందా? అని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తన పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులకు అనుష్క చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన తదుపరి ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తన 48వ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా సిద్ధం కానుంది. మరోవైపు యూవీ క్రియేషన్స్-అనుష్క కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఆ బ్యానర్‌లో వచ్చిన ‘మిర్చి’, ‘భాగమతి’ అనుష్కకు మంచి హిట్స్‌ అందించాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.