NRI-NRT

విజయవంతంగా నాట్స్ చిన్నారుల కోవిద్ టీకా కార్యక్రమం

విజయవంతంగా నాట్స్ చిన్నారుల కోవిద్ టీకా కార్యక్రమం

నాట్స్ ఆధ్వర్యంలో శనివారం నాడు డాలస్‌లో ఏర్పాటు చెసిన చిన్నారుల కోవిద్ టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. 5-11 ఏళ్ల చిన్నారులకు, ఇప్పటికే టీకా వేయించుకున్న పెద్దలకు బూస్టర్ డోసులను DFW-NATS బృందం అందించింది. గ్రేట్ ఫార్మసీ, ఇండిపెండెన్స్ ఫార్మసీ ఈ కార్యక్రమానికి సహకరించింది. నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే పర్యవేక్షించారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్ కిషోర్ వీరగంధం, ఆది గెల్లి, కిషోర్ కంచర్ల, ప్రేమ్ కుమార్, జోనల్ వైస్ ప్రెసిడెంట్ భాను లంక, చాప్టర్ కోఆర్డినేటర్స్, రాజేంద్ర కాట్రగడ్డ, రాజేంద్ర యనమల తదితరులు సహకరించారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని DFW-NATS బృందాన్ని అభినందించారు.