NRI-NRT

ఫ్రిస్కోలో ఘనంగా టాంటెక్స్ దీపావళి

ఫ్రిస్కోలో ఘనంగా టాంటెక్స్ దీపావళి

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) దీపావళి వేడుకలు ఫ్రిస్కోలో ఘనంగా నిర్వహించారు. టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు అందజేసారు. ఫ్రిస్కో సిటీ మేయరు జెఫ్ చెనీ, ప్రొటెం మేయరు బిల్ వుడ్ వర్డ్, కౌన్సిల్ మెంబరు జాన్ కీటింగ్, కౌన్సిల్ ఉమన్ ఎంజెలీయా పెహ్లాము, బోర్డు ఆఫ్ ట్రస్టీ గోపాల్ పోణంగి, పార్కులు మరియు రిక్రియేషన్ బోర్డు మెంబర్ వేణు భాగ్యనగర్, అర్బన్ ఫారెస్ట్రీ బోర్డు మెంబరు పవన్ రాజ్ నెల్లుట్ల, ఇంక్లూషన్ కమిటి చెయిర్ సునీత చెరువులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్రవంతి ఎర్రమనేని సంధానకర్తగా, మధు నెక్కంటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గాయకులు అర్జున్ అడపల్లి, శృతి నండూరి, శ్రీకాంత్ లంకా గీతాలు అలరించాయి. ట్రెజరర్ చంద్ర పొట్టిపాటి, కల్చరల్ చెయిర్ సురేష్ పతనేని, మెంబర్ షిప్ చెయిర్ సుబ్బా రెడ్డి కొండు, ఫుడ్ కమిటీ చెయిర్ ఉదయ్ కిరణ్ నిడిగంటి వేడుకల విజయవంతానికి కృషి చేశారు.
ఫ్రిస్కోలో ఘనంగా టాంటెక్స్ దీపావళి