Devotional

జగన్‌ను కలిసిన అదానీ ఫ్యామిలీ. తితిదేకు ₹4కోట్ల నష్టం-తాజావార్తలు

జగన్‌ను కలిసిన అదానీ ఫ్యామిలీ. తితిదేకు ₹4కోట్ల నష్టం-తాజావార్తలు

* నవంబరు 17 నుంచి 19 వ తేదీ వరకు తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయని ఆయన తెలిపారు. వర్షాల వల్ల తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగింప చేసి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారని ఆయన చెప్పారు.రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయని తెలిపారు. ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు. టీటీడీ అధికారులు, సిబ్బంది ఈ ఘాట్ రోడ్డులో కూడా కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారని చెప్పారు.తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయన్నారు. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారని చైర్మన్ వివరించారు.శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడ తో పాటు, రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నట్లు ఆయన తెలిపారు.కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారన్నారు.వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారని ఆయన చెప్పారు.స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామన్నారు.టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.తిరుమల ,తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

* కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.ప్రస్తుతం కొండపల్లి మునిసిపాలిటీ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ ఇదే.కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ రేస్ లో వైసిపి లో ముగ్గురు, టిడిపి లో ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన కొందరు వైసిపి, టిడిపి కౌన్సిలర్లు అదే రోజు సాయంత్రం నుంచి అజ్ఞాతంవాసం లోకి వెళ్ళారు.వైసిపి, టిడిపి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు.కొండపల్లి మునిసిపాలిటీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన అధికార పార్టీ నేతల్లో ఫలితాలు నిరుత్సాహాన్ని నింపాయి.

* సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన త్రిదండి చినజీయర్‌ స్వామి.రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను ఆహ్వనించిన త్రిదండి చినజీయర్‌ స్వామి.చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు.చినజీయర్‌ స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు.

* తాడేపల్లి లో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ బయలుదేరిన ఆదాని గ్రూప్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదాని, కుటుంబ సభ్యులు.

* చంద్రబాబు లాంటి సీనియర్ నేత ఏడుస్తే నేను తట్టుకోలేకపోయాను….ఆయన్ను కన్నీళ్లు పెట్టించేలా చేయకండి – నాగబాబు

* అసెంబ్లీలో పరిణామాలపై బాలకృష్ణ స్పందన.ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకోవడం సరికాదు.మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేదీ ప్రభుత్వం.మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం.మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు.చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు.ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు.ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు.రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.

* ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఉలుకూపలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. శనివారం రాత్రి ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టంచేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం.. మాట్లాడతామని కేంద్రం చెప్పిందన్నారు. సీఎస్‌తో కలిసి అంతా దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, ఎఫ్‌సీఐని కలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదని కేంద్రం చెప్పినట్టు వార్తలొచ్చాయని.. కానీ అది ఎంతవరకు నిజమో తెలియదన్నారు. మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో రైతులు అద్భుత విజయం సాధించారని కేసీఆర్‌ ప్రశంసించారు. రైతు ఉద్యమాల సందర్భంగా పెట్టిన వేలాది కేసులన్నీ ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశం ద్రోహం కేసులు కూడా పెట్టారన్నారు. అమాయకులపై పెట్టిన కేసులన్నీ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.

* గత కొన్ని రోజులుగా ఏపీలో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. రాష్ట్రంలో జరిగిన నష్టంపై ప్రభుత్వం వివరాలను వెల్లడించింది. నాలుగు జిల్లాల్లో 172 మండలాలపై వర్షాల ప్రభావం పడిందని తెలిపింది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్ర ఆస్తి నష్టం సంభవించినట్టు వెల్లడించింది. వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు 24 మంది మృతిచెందగా.. 17మంది గల్లంతైనట్టు ప్రకటించింది. నాలుగు జిల్లాల్లో కలిపి 23,345 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు తెలిపింది. 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ₹7కోట్లు విడుదల చేసింది.

* భువనేశ్వరిపై వైకాపా నేతల వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఖండించారు. వ్యక్తిత్వహననం సహేతుకం కాదన్నారు. తను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగామని, విలువల్లో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని నందమూరి సుహాసిని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు. తెలుగు ప్రజలందరూ చంద్రబాబు వెంటే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.