Food

మిష్టి దోయి…మధుమేహులకు ఇష్టమైన స్వీటు

మిష్టి దోయి…మధుమేహులకు ఇష్టమైన స్వీటు

మిష్టి దోయి బెంగాలీ పండుగలలో ప్రధానమైన డెజర్ట్. దాని రుచి దేశమంతటా ప్రాచుర్యం పొందింది. స్వీట్లపై మక్కువ ఉన్నవారికి ఇష్టమైన స్వీట్లు, డెసర్ట్‌లకు దూరంగా ఉండటం ఎంత కష్టమో తెలుసు. పైపైన తిన్నా సరే, తీపి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. అతిగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగడానికి దారితీస్తుంది. పైగా డయాబెటిస్ కు దారితీయవచ్చు. కానీ స్వీట్స్ తినాలి అనే కోరిక కలిగినప్పుడు ఏమి చెయ్యాలి? షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు, తప్పకుండా డాక్టర్ తీసుకోవాల్సివుంటుంది. మిగతావారు స్వీట్లకి బదులుగా వేరేవాటితో మీ తీపిపై మక్కువను ఆస్వాదించండి. అలాంటి ఒక ఆరోగ్యకరమైన పదార్ధం ‘మిష్టి దోయి’. తియ్యటి పెరుగులోని బెల్లం వల్ల గోధుమ రంగులో ఉంటుంది. దీనిలో చక్కెరకు బదులుగా బెల్లం వాడతారు. బెల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాహార నిపుణురాలు ఒకరు ఈ రుచికరమైన డెసర్ట్ ఆరోగ్య ప్రయోజనాల గురించి వ్రాస్తూ, ఇది “గొప్ప ప్రోబయోటిక్, మీ ప్రేగులకు మంచిది, అద్భుతమైన తీపి పదార్థం..ఎవరైనా భయపడకుండా తినొచ్చు” అని చెప్పారు. మీరు బెంగాలీ ఆహారాన్ని ఆస్వాదించే వారైతే, మీరు మిష్టి దోయిని కూడా ఇష్టపడతారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. చాలా మృదువైన మిష్టి దోయి, బెంగాలీ తీపి వంటకాల్లో ఒకటి. పాలను చిక్కగా అయ్యేలా వేడిచెయ్యాలి, ఆపై బెల్లం వేసి తీపిగా తయారు చేస్తే,మీరు ఈ డెజర్ట్ రుచిని సరిగా పొందలేరు. ఈ రుచికరమైన డెజర్ట్ చేయడానికి ఈ సులభమైన మార్గాన్నిచూడండి! మిష్టి దోయిని తయారుచేసే విధానం సాధారణ పెరుగు లేదా కర్డ్ తయారు చేయడం కంటే భిన్నంగా ఉంటుంది. ముందుగా పాలు చిక్కగా చేసి తాటి బెల్లం కలుపుతారు. పాలు వెచ్చగా మారినప్పుడు, పెరుగు కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొన్ని గంటలపాటు సెట్ అవడానికి అలాగే వదిలేస్తారు. మిష్టి దోయి తయారీకి, మట్టి గిన్నెలు ఉపయోగించడం మంచిది. మట్టి గిన్నెలు దోయి నుండి తేమను గ్రహిస్తాయి, ఈ పద్దతి మిష్టి దోయిని చక్కగా మందంగా చేస్తుంది. పెరుగు తయారీతో పోలిస్తే మిష్టి దోయిని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. రూమ్ టెంపరేచర్ వల్ల ఇది తయారీకీ పట్టే సమయం కూడా మారుతుంది. దీనిని మీ ఇంట్లో వెచ్చని ప్రదేశంలో ఉంచవల్సి ఉంటుంది.