NRI-NRT

ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు?

ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు?

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు తాతా మధు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఖమ్మంకు చెందిన తాతా మధు 20 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అట్లాంటా నగరంలో స్థిరపడ్డారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో పాటు హోటల్ వ్యాపారంలో స్థిరపడ్డారు. అమెరికాలో ప్రముఖ తెలుగు సంస్థ తానాలో చురుకైన పాత్ర పోషించారు. ఆ సంస్థ కార్యదర్శిగా పనిచేశారు. రాజకీయాల్లో ఆసక్తి ఉన్న తాత మధు నాలుగేళ్ల క్రితం ఖమ్మంకు తిరిగి వచ్చి టిఆర్ఎస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తాతా మధు ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ రాజకీయాల్లో గత కొద్ది సంవత్సరాల నుండి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. కెసిఆర్ ఢిల్లీ వెళ్లే ముందు ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. అధికారికంగా సోమవారం నాడు తాతా మధు అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశం ఉంది.