Politics

శ్రీకాకుళంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

శ్రీకాకుళంలో తేదేపా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‎ను పోలీసులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. టూటౌన్ సీఐ ప్రసాదరావు పట్ల దుర్భాషలాడారంటూ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టి రవిని అరెస్ట్ చేశారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‎కు తరలించారు. అర్ధరాత్రి, అది కూడా తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేయడమేంటి..? అని పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, జిల్లా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.