Politics

భువనేశ్వరిపై నిందలా ప్రభుత్వ ఉద్యోగానికి మహిళ రాజీనామా

భువనేశ్వరిపై నిందలా ప్రభుత్వ ఉద్యోగానికి మహిళ రాజీనామా

కడపజిల్లాలో ఒక దళిత మహిళ అసెంబ్లీలో వైసిపి నాయకుల వ్యాఖ్యలకు నిరసనగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామ

నెలకు దాదాపు 40 వేల రూపాయల జీతాన్ని తృణపాయంగా చంద్రబాబునాయుడు గారి మరియు భువనేశ్వరి అమ్మకోసం వదిలేసి వారికి మద్దుతుగా నిలిచిన ఒక దళిత మహిళ

కడపజిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం, ఎర్రగుంట కోట గ్రామానికి చేసిన అనిత దీప్తి దుద్యాల అనే ఒక దళిత మహిళ ఉన్నత చదువులు చదువుకొని గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది.

అయితే అసెంబ్లీలో చంద్రబాబు గారిని, వారి సతీమణి భువనేశ్వరి గారిపై వైసిపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజు నుంచి, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు చూసిన రోజు నుంచి బాధతో మనసు చలించి, ఆయనకు మద్దతుగా ఈ వైసిపి ప్రభుత్వం నాకు ఉద్యోగం అవసరం లేదూ అంటూ… రైల్వేకోడూరు ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా తన ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది.

మళ్ళీ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకూ తన వంతు ఆయన కోసం నిత్యం చేస్తానని, ముఖ్యమంత్రి అయ్యాకే మళ్ళీ ఎదో ఒక ఉద్యోగం చేసుకుంటాని తెలియజేజారు.?