అసెంబ్లీలో చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలకు నిరసనగా బోస్టన్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, సమాజ సేవలో ముందుండే భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు తగవని వీరు పేర్కొన్నారు. విశ్వసనీయతతో కూడిన పాలన చేయాలని జగన్‌కు సూచించారు. చంద్రబాబుకు ఎన్నారై తెదేపా మద్దతు సంపూర్ణంగా ఉందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అంకినీడు, కోటేశ్వరరావు, శ్రీనివాస్, అరుణ, సూర్య, త్రిభువన్, శ్రీనివాస్, అనిల్, చంద్ర, కిషోర్, సురేష్, తేజ, నాగేంద్ర, సురేష్, శివ, విక్రమ్, అప్పారావు, పవన్ తదితరులు పాల్గొన్నారు. “సిద్ధం సిద్ధం మేమంతా సిద్ధం, మేమంతా ఉన్నాం…మీ వెంటే ఉంటాం” అని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.
వైకాపా అరాచక పాలనపై బోస్టన్ ఎన్నారై తెదేపా నిరసన
Related tags :