DailyDose

TNI నేర వార్తలు

నూజివీడు IIITలో ఆత్మహత్య

* తహసీల్దార్ కార్యాలయాన్ని నివాసంగా మార్చుకుంటాం అని హెచ్చరించిన గిరిజనులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట లో మూషిడిపల్లి పంచాయతీ లో గల కిల్లివాని కల్లలులో గల గిరిజనులు గత 30 సంవత్సరులుగా అక్కడే నివసిస్తున్నరూ అని అదే స్థలంలో ప్రభుత్వ మరుగుదొడ్లు, కరెంట్, ఇంటిపన్నులు, త్రాగునీరు బోరు ఉన్నాయని సదరు స్థలం 1987 వ సంవత్సరం నుండి కిల్లి కొండప్ప భార్య రాములమ్మ పెరు మీద D ఫారం పట్టా ఇచ్చియున్నారు అని కానీ ప్రస్తుతం ఆ స్థలన్నీ కరిపి నాగేశ్వరరావు కొన్నాను అని మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేయాలి అని బెదిరిస్తున్నారు అని గిరిజనులు తెలిపారు, కరిపి నాగేశ్వరరావు ఆ స్థలంలో వేస్తున్న రోడ్డుని నివరించాలని సదరు స్థలాన్ని సర్వే చేయించి పట్టా హద్దులు నిర్ణయించి వారి నివాస గృహాలకు పొజిషన్ పట్టాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ స్థానిక శృంగవరపుకోట తహశీల్ధార్ కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయికులు ఒబ్బిన సన్యాసినాయుడు గారితో కలసి ధర్నా కి దిగారు, శిథిలావస్థలో వర్షాలు పడితే కారిపోయే విధంగా ఉన్న వాళ్ళ గ్రహాల స్థానాల్లో ప్రభుత్వ పక్క గృహాలు ఏర్పాటు చేయాలని స్థానిక డిప్యూటీ తహసీల్దార్ హరి గారికి వినతిపత్రాన్ని అందజేశారు , మా యొక్క గొడుని పట్టించుకోలేని యెడల తమ గ్రుహాలను తహశీల్ధార్ కార్యాలయంలోకి మార్చుకుంటాం అని హెచ్చరించారు.

* వరంగల్ నగరంలో నేరాల పరంపర కొనసాగుతుంది. నిన్న హనుమకొండ రెడ్డి కాలనీ హత్య ఉదంతం మరువక ముందే నగరంలో మరో హత్య వెలుగు చూసింది. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం దూపకుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాల సమీపం వద్ద వడ్డీ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతుడు రంగశాయిపేట వాసిగా పోలీసులు గుర్తించారు. వ్యవసాయ కూలీల సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. పత్తి చేనులో వడ్డీ వ్యాపారి కోక వెంకన్నను గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలిని డి సి పి పుష్ప పరిశీలించగా.. క్లూస్ టీం ఆధారాలలో సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. విచారణ అనంతరం వివరాలను తెలియజేస్తామని డి సి పి తెలిపారు. అక్రమ సంబంధం హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు

* రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు పై నియంత్రణ ను ఎత్తి వేయాలని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుండి మూడు కోట్ల సెంటర్ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన ను నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరి పై మరోకరు ఆరోపణలు చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ,రాష్ట్ర ప్రభుత్వం యసంగిలో వరి వెయ్యొద్దని ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ,లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి నీటి వసతి ఉన్న చోట వరి సాగు అవుతుందని ఇతర పంటల పై రైతులకు అవగాహన ప్రభుత్వం కల్పించాలని ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన ప్రతి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు..
బైట్; మండలి.వెంకన్న…రైతు కూలి సంఘం నాయకులు.

* ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన కిలాడీ ఫ్యామిలీ అరెస్టు

* వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగు వద్ద డబ్బులు వసూళ్ళకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు సొమవారం అరెస్టు చేయగా మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు.

* పోలీసులు అరెస్టు చేసిన నిందితుల నుండి 21 లక్షల 70వేల రూపాయల నగదు, రెండు ఖరీదైన కార్లతో పాటు రెండు సెల్‌ఫోన్లు, నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర నకిలీ పత్రాలు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి సంబంధించిన బెల్ట్, టోపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* నంద్యాల పట్టణ నాయకులకు అధికారులకు పట్టని ప్రజాసమస్యలు . నంద్యాల ప్రధాన రహదారులు కొన్ని పూర్తిగా గుంతల మయం కావడం విశేషం కొంతకాలంగా పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు గుంతలు పడటంతో అకాల వర్షాల వల్ల రోడ్లపై నీరు నిండి ఉండటంతో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక కొంతమంది మోటార్ సైకిల్ వాహనదారులు గుంతలలో పడుతున్నారు వాహన దారులు పట్టణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ శాఖ అధికారులు ఏమాత్రంపట్టణ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సంఘాలు లు విద్యార్థి సంఘాలు కొన్ని నెలల క్రితం రోడ్లుల మరమ్మతులు చేపట్టాలని సమస్యను అధికారుల దృష్టికి తీసుక పోయిన ప్రయోజనం లేదు అనే విమర్శలు లేకపోలేదు కొంతమంది మోటార్ సైకిల్ వాహనదారులు గుంతలో పడుతున్నారు. వాహనదారులు ఎన్ని ఇబ్బందులను పడుతున్న అధికారులు మాత్రం చోద్యం చూడటమే తప్ప మరమ్మతులు చేపట్టడం లేదని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సమస్యలు లేవనెత్తి నప్పుడు తూతూమంత్రంగా మట్టిని తెచ్చి గుంతలకు వేసి చేతులు దులుపుకోవడం ఆనవాయితీగా మారింది . నాయకులు అధికారులు ఇదే ప్రధాన రహదారి లో తిరుగుతున్న ఏమాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరించటం ఎంత వరకు సమంజసమని ప్రజల్లో గుసగుసలు లేకపోలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన రహదారి అయినా పద్మావతి నగర్ గుంతల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని వాహన దారులు ప్రజలు కోరారు……… గత రెండు నెలల క్రితం నంద్యాల సరస్వతి నగర్ లో ఉన్న తులసి వనానికి 10 లక్షల రూపాయల వ్యయంతో ఆగమేఘాలతో వర్షాలకు బురదలో తిరుగుతున్నారు అన్న నేపథ్యంతో అప్పటికప్పుడు ఆగ మేఘాలతో రోడ్ల మరమ్మతులు చేపట్టి అధికారులకు గత సంవత్సర కాలం నుండి పద్మావతి నగర్ మెయిల్ రోడ్డుల గుంతలు ఎందుకు కనపడటం లేదో అర్థం కావడం లేదని ప్రజలు అన్నారు గత కొంత కాలంగా రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరిన పట్టించుకోని అధికారులు తులసి వనానికి ఆగమేఘాలపై 10లక్షల వ్యాయామంతో మరమ్మతులు చేపట్టటానికి ఆంతర్యం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మున్సిపల్ శాఖ అధికారులకు ప్రధాన రహదారుల గుంతలు మరమ్మతులు చేపట్టేందుకు బడ్జెట్ లేదా బడ్జెట్ లేక మరమ్మతులు చేపట్టలేదు అనుకుందాం అలాంటప్పుడు కొత్తగా వచ్చిన వెంచర్ కు రోడ్లు మెసేజ్ ఎందుకు బడ్జెట్ ఎక్కడిది అన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు ప్రజలు కోరారు

* గుంటూరు కొత్తపేట నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన నల్లగుంట్ల వెంకట విష్ణు కుమార్ అలియాస్ మాస్టారు అక్రమాల దందా బాధితుల ఫిర్యాదుల తో వెలుగుచూస్తున్నాయి. వీడియో గేమ్ షాప్ నిర్వహిస్తూ బతుకుతున్నాం అని నలుగురికి చెప్పుకుంటూ తెరచాటున లెక్కలేనన్ని అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుని రూ.పది వడ్డీని వసూలు చేస్తున్నారు. మోటార్ బైక్ లు సెల్ ఫోన్లు పది రూపాయల వడ్డీ కి మించి ఎలాంటి లైసెన్సులు లేకుండానే కుదువ పెట్టుకుంటున్నారు. కొత్తపేట పరిధిలో బెట్టింగ్ ఆడే యువకులు నగదును తన వద్ద పెట్టి మ్యాచ్ ముగిసిన తరువాత ఆ నగదు లో 20 శాతం కమిషన్ పొందుతున్నాడు. ఫైనాన్స్లో ఉన్న బైక్ లు సైతం కుదువ పెట్టుకొని గోరంట్ల లో తన గూడెం లో పెట్టుకుంటున్నాడు. కొత్తపేటలోని తన కార్యాలయంలో గుట్కా అక్రమ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నాడు. అక్రమ వడ్డీ వ్యాపారి వెంకట విష్ణు కుమార్ @మాస్టారు ఆగడాలు తట్టుకోలేక కొంత మంది బాధితులు పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ వాసు గారు కేసు నమోదు చేసి విచారిస్తుండగా వెంకట విష్ణు కుమార్ అక్రమ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూసినట్లు తెలుస్తుంది దీంతో పోలీసులు వెంకట విష్ణు కుమార్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

* గుడివాడ టూ టౌన్ సీఐ దుర్గారావు అనుచిత వ్యాఖ్యలతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబానికి సంబంధించిన విషయంపై దంపతులు మురళి, రాణి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
వారితో సీఐ అనుచితంగా మాట్లాడారు. తమ కుమారుడు మరణించడంతో, ఇరవై రోజుల క్రితం జన్మించిన మనుమడని చూపించాలంటు కోడలిని కోరగా ఆమె పట్టించుకోలేదని, తమ మనుమడిని చూపించాలంటూ పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులుగా ఫిర్యాదు చేసేందుకు ఆ దంపతులు తిరుగుతున్నారు.
దంపతులు మురళి, రాణి మాట్లాడుతూ కోడలి కుటుంబసభ్యులతో సీఐ దుర్గారావు మంతనాలు జరిపారని, ఇదేమిటని ప్రశ్నించిన తమను, చస్తే చావండి.. కేసు నమోదు చేయనని అగ్రహం వ్యక్తం చేశారని వాపోయారు. సీఐ వ్యాఖ్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించామన్నారు. కుమారుడు మరణించిన బాధలో ఉన్న తమకు, మనుమడిని చూపించాలంటూ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..

* గుంటూరుజిల్లా నగరం మండలం నగరం గ్రామానికి చెందిన పియూసి 1 విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య.