DailyDose

TNI నేర వార్తలు

TNI నేర వార్తలు

* వైసీపీ చరమగీతం పాడేందుకు మహిళా లోకం సిద్దమైంది .

మహిళలను అగౌరవపరిస్తే ఎదురయ్యే పరిణామాలను వైసీపీ నేతలు చూడబోతున్నారు .

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కడప జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దీప్తి

ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరికి జరిగిన అవమానం, నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగాన్ని తట్టుకోలేక వైసీపీ ఎమ్మెల్యేలు,
మంత్రుల తీరుకు నిరసనగా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన దీప్తి

సోమిరెడ్డి కామెంట్స్

దీప్తి రాజీనామా వైసీపీ నాయకుల తీరుకు చెంపదెబ్బ

నెలకు రూ.40వేలకు పైగా జీతం, కుటుంబ భవిష్యత్తును కూడా ఖాతరు చేయకుండా సాటి మహిళకు జరిగిన అవమానానికి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు

దీప్తికి మంచి భవిష్యత్ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను

అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు ప్రతీ మహిళ కన్నీరు పెట్టుకుంటోంది

అయినా మంత్రులు ఇంకా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు.

అమరావతి కోసం పోరాడే మహిళలను కించపరిచేలా కామెంట్స్ చేయడం దుర్మార్గం

వైసీపీ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడింది.

* నెల్లూరు జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, కలెక్టర్ చక్రధర్ లను తరిమి తరిమి కొట్టిన నెల్లూరు జిల్లా వరద బాధితులు

మేమంతా నష్టపోయిన తర్వాత సినిమా చూడటానికి వచ్చారా అంటూ మంత్రి పైనా, ఎమ్మెల్యే పైనా, కలెక్టర్ పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగిన వరద బాధితులు

పోలీసుల సాయంతో అక్కడినుంచి జారుకున్న మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్.

* అమరావతి

కొండపల్లి మున్సిపల్ కమిషనర్ ఎన్నిక పై హైకోర్టులో వడీవేడిగా వాదనలు

లంచ్ మోషన్ పిటిషన్ పై వాడివేడి వాదనలు

మున్సిపల్ కమిషనర్ ఎన్నిక వాయిదా అంశంపై సీరియస్ గా స్పందించిన హైకోర్టు

నిన్న, ఈరోజు వైసిపి నాయకులు విధ్వంసం సృష్టించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన లాయర్ అశ్విని కుమార్

మధ్యాహ్నం 2.15 నిమిషాలకు హైకోర్టు ముందు హాజరు కావాలని విజయవాడ సిపి, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశం

మధ్యాహ్నం హాజరై వివరణ ఇవ్వాలన్న ధర్మాసనం.

* ఆదోని ఏరియా ఆసుపత్రిలో వైద్యం గాలికి

కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజ్ గౌడ్ ఆరోపించారు. ఏరియా ఆస్పత్రి లో పర్యటించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై జాతీయ హెల్త్ మిషన్ కు నివేదికను పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రిలో కేవలం పేరుకు మాత్రమే కాన్పులు చేస్తున్నట్లు బోర్డు తగిలించారే తప్ప ఒకటి అంటే ఒక్కటి కాన్పు కూడా చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ ఆస్పత్రికి ప్రభుత్వం ఇద్దరూ గైనకాలజిస్టులను కేటాయిస్తే, ఒకరిని ఆదోని ఎంసిహెచ్ ఆసుపత్రికి డిప్యూటేషన్ మీద పంపారన్నారు. ఉన్న ఒక గైనకాలజిస్ట్ కూడా గర్భిణీలకు నెలవారి చెకప్ లు కూడా చేయకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం గర్భిణీల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎన్నో అధునాతన చర్యలు చేపడుతూ ఉంటే మరోవైపు వైద్యులు ప్రభుత్వం యొక్క లక్షాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాన్పుల కోసం గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇన్ డైరెక్ట్ గా ప్రభుత్వ వైద్యులే ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పైన దృష్టి సారించాల్సినటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు జిల్లా యంత్రాంగం స్పందించకపోతే, ఏరియా ఆస్పత్రిలో కాన్పుల వైద్యం ప్రారంభించే అంతవరకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

* కళ్లలలో వడ్లు రైతుల కండ్లలలో కన్నీరు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలి వెంకటా పూర్ మండల కేంద్రము లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి అని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి రోడ్డు పై బైఠాయించి ఎమ్మెల్యే సీతక్క గారు.

ఈ రోజు వెంకటా పూర్ మండల కేంద్రము లో ఏఐసీసీ పిలుపు మేరకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కళ్ళలోకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమములో భాగంగా వెంకటా పూర్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.

ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ రైతన్న తీరిక లేకుండా ఆరుగాలం అప్పులు తీసుకువచ్చి పంటకు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కొనేనాథుడు లేడని, ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు బాయిల్డ్ రైస్, రా రైస్ అంటూ ఒకరి మీద ఒకరు నెట్టివేసుకుంటూ రైతన్నను అగాధంలోకి నెడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ గారు ఆరోజున నల్ల వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికి, ఇప్పుడేమో నేను ధర్నా చేస్తేనే నల్ల చట్టాలు బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వాపోయారు. అసలు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారంలో తెరాస నాయకులు ధర్నాలు చేశారు కానీ నల్ల చట్టాల గురించి కనీసం ఏనాడు ప్రస్తావించకుండా, ఢిల్లీలో నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని మూడు రాష్ట్రాల రైతు సోదరులు బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే ఏ ఒక్కనాడు కూడా రైతులకు మద్దతు తెలపని కేసీఆర్ గారు, 14 నెలల నుండి ఎండనక, వాననక, చలికి ఓర్చుకుని పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో 700 మంది రైతులు చనిపోతే సంతాపం కూడా తెలపని సీఎం కేసీఆర్ గారు ఇయ్యాల నేను ధర్నాలు చేస్తేనే బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలని ఉపసంహరించుకున్నారని అనడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. నల్ల చట్టాలను పార్లమెంటులో ఆమోదించి 14 నెలలు అవుతున్న ఇన్ని రోజులు ఎందుకు నల్ల చట్టాలపై ఒక పత్రిక విమర్శ చేయలేదు కానీ, రైతుల ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం వల్ల దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరి నేను ఒక్కరోజు ధర్నా చేయడం వల్ల వచ్చిందని అనడం వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట అని అన్నారు.

ఇప్పటికి అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుని రైతన్నను ఆదుకునే ప్రయత్నం చేయాలని, రైతు లేనిదే రాజ్యం లేదని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప ఇకనైన ఈ అహంకారపు అధికార పార్టీలకు బుద్ధి చెప్పాలంటే పోరాటం చేయాలని, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు అవుతాయని ఆనాడే రాహుల్ గాంధీ గారు చెప్పారని, రైతుల హక్కుల కొరకైనా, మానవ హక్కుల కొరకైనా, పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కొరకైనా, పేదరిక నిర్మూలన కొరకైనా పోరాడేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లా డి రాం రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, ఇరుస వడ్ల వెంకన్న,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎస్సీ ఎస్టీ బీసీ సెల్ మండలాల అధ్యక్షులు మైస ప్రభాకర్,మూడు విరేశ్,బుస సాంబయ్య,ములుగు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,సర్పంచ్ తుమ్మేటి రాజీ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు.

జంగలి రవి,సీనియర్ నాయకులు మీల్కురీ ఐలయ్య,కొంపల్లి రాజీ రెడ్డి పిన్ రెడ్డి రాజీ రెడ్డి,మామిడి శెట్టి స్వామి,గ్రామ కమిటీ అధ్యక్షులు
చెన్నోజు శ్రీను,జనగాం నాగరాజ్ కట్ల సతీష్,మండల ఓంకార్, ముడిగె రాజు కుమార్, సరసనీ రవి బొయిని సుధాకర్,ఉపాధ్యక్షులు కంతాల రాజీ రెడ్డి,ప్రధాన కార్యదర్శి నల్ల కోటి,మునిగాల శ్రీనివాస్, అన్న బోయిన రాజు,ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు జాడి ఎల్లయ్య జాడి ఎల్లయ్య,ఉప సర్పంచ్ లు మర్కా జయశంకర్,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి రాజిరు,సహకార సంఘం వైస్ చైర్మన్ పెరుమండ్ల మాజీ సహకార సంఘం వైస్ చైర్మన్ దొంతర వేణి కుమార్, రాజేందర్,యువజన కాంగ్రెస్ నాయకుడు మామిడి శెట్టి కోటి
తదితరులు పాల్గొన్నారు.

* కదిరి లోని చైర్మన్ వీధిలో మూడు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందుకు సంబంధించిన చెక్కులను ఈరోజు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. కేవలం మూడు రోజుల్లోనే పరిహారం ఇవ్వడం గతంలో ఎన్నడూ జరగలేదు. అదేవిధంగా చిన్నపిల్లల మృతికి పరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా గతంలో లేవు… అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా భవిష్యత్తులో కూడా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.

* రాజధాని అంటే ఏమి చెప్పాలి? ఎక్కడనీ చెప్పాలి? రఘరామ దిల్లీ: పది రోజుల్లో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని గ్రహించిన సీఎం జగన్‌ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

”సీఆర్డీఏలో రాజ్‌భవన్‌, సచివాలయం, హైకోర్టు ఉంటాయని గతంలోనే అగ్రిమెంట్‌ చేశారు. అయినా… 3 రాజధానుల అంశంలో వెనక్కి వెళ్లేదిలేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నిన్న నేతలు దుర్బుద్ధిగా మాట్లాడారు. సీఎం జగన్‌, పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు రికార్డుల్లో ఉన్నాయి. రాజధాని మారిస్తే రైతులకు రూ.99వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నష్టపరిహారం చెల్లించకుండా.. ఎలాంటి బిల్లు పెట్టకుండా ఉండాలంటే హైకోర్టులో కేసును కొనసాగించాలి. 2014లో జగన్‌ ..

అమరావతిలో ఉన్న ల్యాండ్‌లో సిటీ నిర్మించడం గొప్పఅవకాశమన్నారు. అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తామని గతంలోనే చెప్పి.. నిన్న అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. రూ.5లక్షల కోట్లు అవుతుందని అంటున్నారు… అందులో ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత?. రూ. 10వేల కోట్లు ఖర్చుపెడితే అద్భుతంగా.. ప్లాన్‌ చేసిన సిటీ ఏర్పాటు చేయొచ్చు. ఒక కులంపై ద్వేషంతో చేసిన వ్యవహారంతో.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు.

మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3లక్షల కోట్లు ఖర్చు చేశామని అంటున్నారు… ఎక్కడ దేనికి ఎంత ఖర్చు చేశారు? ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశామా? అంటే ఏదీ లేదు. సవ్యంగా నడిచే ఇసుక పాలసీని నాశనం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాజధానికి సంబంధం లేదు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ ఎక్కడ ఉంది. హైదరాబాద్‌ నిజాం హయాంలోనే మహానగరం.

చెన్నై, ముంబయి బ్రిటీష్‌ కాలంలోనే మహా నగరాలు. ఏ ముఖ్యమంత్రి ఉంటే విశాఖపట్నానికి పోర్టు వచ్చింది. ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని శాసన మండలి రద్దు చేస్తామన్నారు. నెల క్రితం కిరణ్‌ రిజుజును కలిసి మండలి రద్దు విషయం వారి దృష్టికి తీసుకెళ్లారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు చాలా తేడా ఉంది. ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రికి ఎందుకింత కక్ష. రాజధాని అంటే ఏం చెప్పాలి… ఎక్కడని చెప్పాలి.

రాయలసీమ రాజకీయాలు మానేసి అభివృద్దిపై ఫోకస్‌ పెట్టండి. రాష్ట్రంలో 95శాతం మున్సిపాలిటీలు గెలిచాం.. ఒక్క కొండపల్లి మున్సిపాలిటీ పోతే ఏమవుతుంది. రాజధాని ఆపే శక్తి ఒక్క కోర్టుకు మాత్రమే ఉంది… న్యాయస్థానం న్యాయం చేయాలి” అని రఘురామకృష్ణరాజు అన్నారు.

* విజయవాడ

ఎంపి కేశినేని నాని కామెంట్స్….

ఈరోజు కూడా సమావేశం లో వైసిపి సభ్యులు గందరగోళం సృష్టించారు

హాజరు తీసుకోమని ఆర్.ఒ ఆదేశించగానే… బల్లలు విరగ్గొట్టడం ప్రారంభించారు

కోర్టు ఆదేశాలతో జరిగే ఎన్నిక అయినా… అధికారులు వైసిపి కి అనుకూలంగా వ్యవహరించారు

వైసిపి సభ్యులు ఈ రెండు రోజులు అరాచకం, హడావుడి చేశారు

ఎన్నికల అధికారి సరైన వివరణ ఇవ్వకుండా ఎన్నిక వాయిదా వేశారు

దీనిపై హైకోర్టు కూడా ఈరోజు అధికారుల తీరు మీద
ఆగ్రహం వ్యక్తం చేసింది

రేపు పదిన్నరకు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది

టిడిపి సభ్యులు కు పూర్తి పోలీసులు భద్రతతో తీసుకురావాలని సూచించింది

రేపు అయినా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత తో ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నాం

వైసిపి సభ్యల తీరు పై ఎన్నికల అధికారి పోలీసులు కు ఫిర్యాదు చేయాలి

ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా సభ్యులు ధైర్యం గా నిలబడ్డారు

క్యాష్ కన్నా క్యారెక్టర్ ముఖ్యమని నిలబడిన మా సభ్యులు కు నా ధన్యవాదాలు

* ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్‌ఈసీ, డీజీపీ తప్పుకోవాలి: చంద్రబాబునాయుడు

కడప: కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడటంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కడప జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ఆయన ఎన్నిక వాయిదా విషయం తెలియగానే మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి వాయిదా వేయించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ధ్వజమెత్తారు.

‘‘ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్‌ఈసీ, డీజీపీ తప్పుకోవాలి. ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వైకాపా వారినే ఛైర్మన్‌ చేయండి. తెదేపా సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులు హల్‌చల్‌ చేస్తున్నారు. పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. తెదేపా సభ్యుల ఓర్పును చేతగానితనంగా చూడొద్దు. ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి’’ అని చంద్రబాబు కోరారు.