Politics

చంద్రబాబును ఏడిపించిన “ఎమ్మెల్యేలకు ” ప్రాణభయం

చంద్రబాబును ఏడిపించిన “ఎమ్మెల్యేలకు ” ప్రాణభయం

అమరావతి

శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేలు , మంత్రి కొడాలి నానికి భద్రత పెంచిన ప్రభుత్వం

మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్ల భద్రతో పాటు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రత

కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ ల తో పాటు అదనంగా 3+3 గన్ మెన్ భద్రత కల్పించిన ప్రభుత్వం

చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా ఫిర్యాదు

ఫిర్యాదుల పరిశీలన అనంతరం వారి భద్రతను సమీక్షించిన కమిటీ , వారికి తక్షణం భద్రత కల్పిస్తూ నిర్ణయం

ఇవాల్టి నుంచి మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, ద్వారంపూడిలకు అదనపు సిబ్బందిని నియమించిన ప్రభుత్వం