DailyDose

TNI నేర వార్తలు 24-Nov-2021

TNI  నేర వార్తలు 24-Nov-2021

* గుంటూరు

గురజాల నియోజకవర్గంలో దారుణం

టీడీపీ కార్యకర్తను చితకబాదిన ప్రత్యర్థులు

వైసీపీ నేతలే దాడి చేశారంటున్న బాధితులు

పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాబిపై వచక్షణారహితంగా దాడి

దాడిలో తీవ్రంగా గాయపడిన సైదాబి

బైక్ పై పెళ్లికి వెళ్లి వస్తుండగా రిలో అడ్డగించి రాళ్లు, కర్రలతో దాడి

పొలం దారి విషయంలో కావాలనే గొడవపడ్డారన్న సైదాబి కుమారుడు జిలానీ

నరసరావుపేటలో ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సైదాబి

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పై నిరసన ర్యాలీ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, స్థానిక సమస్యల పై వినత ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం బస్టాండ్ నుండి తహశీల్దార్ ఆఫిస్ వరకు బైక్ ర్యాలీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరితో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర పెట్టకుండా, సకాలంలో కొనుగోలు చేసి రైతులకు నగదు చెల్లించే విషయంలో జాప్యం చేస్తూ రైతుల నడ్డి విరుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘు అన్నారు.

అంతేకాకుండా పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహశీల్దార్ రవిందరకు అంద చేశారు ఈ కార్యక్రమంలో మండలం బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు ఈరసవడ్ల వెంకన్న మండల అధ్యక్షుడు రఘు మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ ములుగుజిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు M D ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు.

*జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీ అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ల తీరుతో వరి ధాన్యం పండించిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో62 లక్షల ఎకరాల్లో వరి సాగు బడి చేయడం జరిగిందని కోటి క్వింటాలు ధాన్యం ఉత్పత్తి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది కానీ పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కేవలం 11 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలని భారీ వర్షాలు వరదల వలన నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర వ్యవసాయ విధానం అవలంబించి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

* విశాఖ ….గాజువాక…

స్టీలుఫ్లాంట్ కోకోవోన్ బ్యాటరి 5 లో ప్రమాదం..

ఎత్తు నుండి పడి సందీప్ కుమార్ సింగ్ అనే 25 సంవత్సరాల కాంట్రాక్టు కార్మికుడు మృతి…

ధర్యాప్తు చెస్తున్న స్టీలుఫ్లాంట్ పోలిసులు..

* నా సతీమణిపై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డా: చంద్రబాబు

తిరుపతి: రాష్ట్రంలో వరదలు మానవ తప్పిదం వల్లే వచ్చాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ తెలియదని.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆయన బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాపానాయుడుపేట వద్ద ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. గొలుసుకట్టు చెరువులు ఉంటాయని.. వాటిలోకి వరద రాకముందే నీటిని విడిచిపెట్టాల్సి ఉంటుందన్నారు. అలా చేయని పక్షంలో మిగతా చెరువుల్లోనూ నీరు నిండిపోయి వరదలు వచ్చే ప్రమాదముంటుందని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాత్రిళ్లు కూడా పనిచేసి కలెక్టర్లను క్షేత్రస్థాయికి పంపి నియంత్రణ చర్యలు చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. వరద బాధితులు, మృతుల కుటుంబాలకు సాయం అందే వరకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

* కుప్పంలో దౌర్జన్యం చేసి గెలిచారు

రౌడీయిజం చేసి కుప్పం మున్సిపాలిటీని వైకాపా గెలిచిందని.. దాన్ని ఇప్పుడు పెద్ద ఇష్యూ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారని.. దొంగ ఓట్లు వేసి దౌర్జన్యంగా గెలిచారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే బాధ్యత ప్రజలపైనే ఉందని చెప్పారు. ఎవరి కోసం తెదేపా పోరాడుతుందో 5 కోట్ల ప్రజలు ఆలోచించాలన్నారు. తాను కంపెనీలు తెస్తే వీళ్లు దందాలు చేస్తున్నారని.. ఇలాంటి ఉన్మాదులతో పోరాడాలా? అని ప్రశ్నించారు. రూ.వేలకోట్లు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.

* ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా

తెదేపా 22 ఏళ్లు అధికారంలో ఉన్నా తన సతీమణి ఏనాడూ బయటకు రాలేదని.. అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైకాపా నేతలు మాట్లాడారని విమర్శించారు. 40 ఏళ్లులో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అలిపిరిలో తన కారుపై మందుపాతర పేలినా భయపడలేదని.. తన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డానన్నారు. కౌరవ సభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చేశానని.. ప్రజల వద్దకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పానని తెలిపారు. తప్పుడు పనులు చేసేవారిని వదిలిపెట్టనని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వైకాపా పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తామన్నారు.

* రాయల చెరువుకు చంద్రబాబు వెళ్ళొద్దని పోలీసులు నోటీసులు అయిన చంద్రగిరి నుంచి రాయలచెరువు కు చేరుకున్న బాబు.

* రాజధాని పేరుతో రాక్షస క్రీడ ను ముగించండి కృష్ణా జిల్లా అమరావతి జే.ఏ. సి కో- కన్వీనర్ – ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు శాసన మండలిలో సి ఆర్ డి ఏ రద్దు ఆంధ్రప్రదేశ్ పరిపాల వికేంద్రీకరణ – అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టాలను ఉపసంరించుకుంటూ రెండు బిల్లులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా దీనిపై స్పందిస్తూ, కృష్ణా జిల్లా అమరావతి జే ఏ సి కో – కన్వీనర్, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళవెంకట గోపాలకృష్ణా రావు ఈరోజు విజయవాడలోని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయం నుండి పూర్తీ వివరాలుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళవెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 9,165 కోట్లతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపిలతో ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, అసెంబ్లీ శాసనమండలి సచివాలయం పూర్తీ చేయటం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులనే తప్పుడు నిర్ణయంతో ఎన్నివేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో, ఎందరు రైతులు, మహిళలు ఉసురు పోసుకున్నరో ముఖ్యమంత్రి ఒకసారి సమీక్షించుకోవలి అన్నారు.కోట్ల రూపాయల ప్రజలసొమ్మును. ఫీజుల రూపంలో లాయర్లకు తగలేసారని ఒకవైపు మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవడం ….,

మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లైమాక్స్ ముందుందని చెప్పటం చూస్తుంటే ఈ ప్రభుత్వం మూడు రాజధాను లకే కట్టుబడి ఉందని అర్థమవుతుంది అని అమరావతి భూములను కాజేయలనే ఆలోచనతోనే సరికొత్త బిల్లంటూ నటకాలాడుతున్నారని అన్నారు. అమరావతి రాజధానిగా అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ స్వాగతించారు అని గుర్తుచేశారు. రాజధాని పేరిట రాక్షస క్రీడ జరుగుతుందన్నారు అమరావతి లాండ్ పూలింగ్ చారిత్రాత్మక విషయమని రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని, మూడురెట్లు ఎక్కువ ఇస్తామన్నా ఎవరు భూములు ఇవ్వరని చెప్పారు. మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ, మళ్ళీ సమగ్రం గా బిల్లు తెస్తామంటూ గందరగోళం సృష్టించారు అన్నారు. అమరావతి నీ ఏకైక రాజధానిగా చేసి ప్రజలకు పాలన అందించాలని, భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

* నిన్న GHMC లో గొడవ చేసిన బిజెపి నాయకులపై చర్య తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి కోరిన మంత్రి కేటీఆర్.

* జయలలిత నివాసం వేద నిలయం ఆమె మేన కోడలు దీప కె స్వాధీనం చేయాలి

ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు

మెమోరియల్ గా మార్చే అధికారం లేదు

మద్రాస్ హై కోర్ట్ సంచలన తీర్పు.