DailyDose

TNI తాజా వార్తలు 24-Nov-2021

TNI తాజా వార్తలు 24-Nov-2021

* అమరావతి

కేశినేని నాని ఎక్స్ అఫిషీయో ఓటుపై అభ్యంతరం తెలుపుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

కేశినేని నాని తన ఎక్స్ అఫిషీయో ఓటును విజయవాడ కార్పోరేషనుకు ఆప్షనుగా ఇచ్చారు. కొండపల్లిలో ఓటేయలేరనేది మా వాదన

వసంత కృష్ణ ప్రసాద్.

* రాయల చెరువుకు చంద్రబాబు వెళ్ళొద్దని పోలీసులు నోటీసులు

అయిన చంద్రగిరి నుంచి రాయలచెరువు కు చేరుకున్న బాబు.

* రాజధాని పేరుతో రాక్షస క్రీడ ను ముగించండి

కృష్ణా జిల్లా అమరావతి జే.ఏ. సి కో- కన్వీనర్ – ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు

శాసన మండలిలో సి ఆర్ డి ఏ రద్దు ఆంధ్రప్రదేశ్ పరిపాల వికేంద్రీకరణ – అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టాలను
ఉపసంరించుకుంటూ రెండు బిల్లులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా దీనిపై స్పందిస్తూ, కృష్ణా జిల్లా అమరావతి జే
ఏ సి కో – కన్వీనర్, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళవెంకట గోపాలకృష్ణా రావు ఈరోజు
విజయవాడలోని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయం నుండి పూర్తీ వివరాలుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ
సందర్భంగా ఆళ్ళవెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 9,165 కోట్లతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ , ఎంపిలతో
ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, అసెంబ్లీ శాసనమండలి సచివాలయం పూర్తీ చేయటం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులనే
తప్పుడు నిర్ణయంతో ఎన్నివేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో, ఎందరు రైతులు, మహిళలు ఉసురు పోసుకున్నరో
ముఖ్యమంత్రి ఒకసారి సమీక్షించుకోవలి అన్నారు.కోట్ల రూపాయల ప్రజలసొమ్మును. ఫీజుల రూపంలో లాయర్లకు తగలేసారని ఒకవైపు
మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవడం ….,

మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లైమాక్స్ ముందుందని చెప్పటం చూస్తుంటే ఈ ప్రభుత్వం మూడు రాజధాను లకే కట్టుబడి ఉందని అర్థమవుతుంది అని అమరావతి భూములను కాజేయలనే ఆలోచనతోనే సరికొత్త బిల్లంటూ నటకాలాడుతున్నారని అన్నారు. అమరావతి రాజధానిగా అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ స్వాగతించారు అని గుర్తుచేశారు. రాజధాని పేరిట రాక్షస క్రీడ జరుగుతుందన్నారు అమరావతి లాండ్ పూలింగ్ చారిత్రాత్మక విషయమని రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని, మూడురెట్లు ఎక్కువ ఇస్తామన్నా ఎవరు భూములు ఇవ్వరని చెప్పారు. మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ, మళ్ళీ సమగ్రం గా బిల్లు తెస్తామంటూ గందరగోళం సృష్టించారు అన్నారు. అమరావతి నీ ఏకైక రాజధానిగా చేసి ప్రజలకు పాలన అందించాలని, భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

* అమరావతి.

సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లు సభలో ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని.

* సినిమాటోగ్రఫీ చట్టం మార్పుల పై..అసెంబ్లీ.. లో

రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించాల్సిన సినిమా హాళ్లలో ఆరు కు పైగా షోలు వేస్తున్నారు.

సినీ పరిశ్రమ లో ఏమి చేసినా ఎవ్వరు ఏమి అనరు అనే ఉద్దేశ్యం తో ఉన్నారు

పేద మధ్యతరగతి వారికి సినిమా వినోదం.

* ప్రజల బలహీనత లు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ఆన్లైన్ టికెట్ విధానం వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది

థియేటర్ లో కూడా ఆన్లైన్ తోనే టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం.

* కేవలం రోజు 4 షో లు మాత్రమే వేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం

ఇంటి దగ్గర్నుంచి కదలకుండా ప్రభుత్వం చెప్పిన ధరకు టికెట్ దొరికే విధంగా సినిమాటోగ్రఫీ చట్టం లో మార్పులు
చేస్తున్నాం..

జిఎస్టీ ని పోల్చి చూసుకుంటే ఎక్కడ పొంతన కుదరడం లేదు.

ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ లు దాచే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీస్కుంటాము.

రాష్ట్రంలో రాజకీయ పార్టీ లు, కొన్ని మీడియా సంస్థలు ఆన్ లైన్ టికెట్ విధానం పై బురద చల్లుతున్నారు.

* రంగారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ఎమ్మెల్సీ లుగా షంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి

ఇండిపెండెంట్ నామినేషన్ తిరస్కరణ

ప్రపోజర్స్ లేకపోవడంతో తిరస్కరణ.

* జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన పోలీస్‌ శాఖను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ విజువల్స్

* బ్రేకింగ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ రేషన్ కార్డ్ దారులకు ఇచ్చే ఉచిత బియ్యం
మరో నాలుగు నెలలు పొడిగించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

* ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ ని మించిపోయింది. ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశారనే కక్షతో
గుంటూరుజిల్లా, పిడుగురాళ్ళ మండలం, తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదా పై వైసీపీ రౌడీమూకలు నరరూపరాక్షసుల
కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోంది..పొలం తగాదా నెపంతో వైసీపీ ఫ్యాక్షన్
దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులు నిద్ర నటిస్తుంటే..వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయి.

నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

* అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి పేర్ని నాని గారి కామెంట్స్ :

• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం శాసనసభలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరణ బిల్లును ప్రవేశపెట్టాం.

• ఇప్పటి వరకూ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు కొంత ఆన్ లైన్, ప్రైవేట్ వెబ్ సైట్ లలోనూ.. కొంతమేర ధియేటర్ల యొక్క
ఇష్టాయిస్టాల మేరకు వ్యవస్థ నడుస్తూ వస్తుంది.

• ఈ చట్ట సవరణ వల్ల తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల జారీ సంపూర్ణంగా ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వం నిర్వహించే
ప్రభుత్వ శాఖ అయిన ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నిర్వహించే వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు.

• ప్రభుత్వం వ్యాపారం చేసే అవకాశం లేదు.

• ఆర్టీసీ టిక్కెట్లు, రైల్వే టిక్కెట్లు, ఫ్లైట్ టిక్కెట్లు ఎలా అయితే కొనుక్కోగలుగుతున్నామో.. సినిమా టిక్కెట్లు కూడా అదే రకంగా
కొనుక్కోవడానికి చట్టంలో వెసులుబాటుకి ప్రయత్నం,

• థియేటర్లలో కూడా ధియేటర్ యాజమాన్యం ప్రభుత్వం వెబ్ సైట్ లో టిక్కెట్లు అమ్ముతుంది. ఇది సంపూర్ణంగా యూజర్ ఫ్రెండ్లీ.

• ఇప్పటి వరకూ పేద, మధ్య తరగతి వారికి అతి చేరువైనది సినిమానే.

• ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్లు విక్రయంతో పాదర్శకత పెంపొందుతుంది.

• సినిమా టికెట్ల ఆన్లైన్ విధానం అమలులోకి వస్తే అటు ప్రజలకు ఇటు సినిమా పరిశ్రమకు, ప్రజలకు అన్ని విధాలా ప్రయోజనం
కలుగుతుంది.

• ఆన్ లైన్ సాప్ట్ వేర్ రూపొందించడంపై అందరితో చర్చలు జరగుతున్నాయి. అందరితో చర్చించి సాప్ట్ వేర్ ను తయారుచేయడం
జరుగుతుంది.

• జగన్ గారి ప్రభుత్వం రాక ముందు ఇష్టానుసారంగా రేట్లను భారీగా పెంచి సినిమా టెక్కెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్మేవారు. గతంలో ఇష్టా
రాజ్యంగా దోచుకున్నారు.

• ప్రభుత్వ నియంత్రణలను అధిగమించి చేస్తుంటే దానిని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.

• ప్రభుత్వానికి రావాల్సిన రాబడి కూడా రావడంలేదనేది ప్రభుత్వం గమనించింది.

• థియేటర్ల దగ్గర హౌస్ పుల్ బోర్డులు పెట్టి.. బ్లాక్ లో అమ్మే పరిస్థితి ఉండదు. రోజుకి 4 షోలు మాత్రమే.

• ప్రజలను దోచుకోవడం ఆగుతుంది.

• అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల అమ్మకం చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే
దీనిపై కొంత మంది పనికట్టుకుని వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నం సరికాదు.

• ప్రభుత్వం వ్యాపారం చేయదు.. టికెట్ల అమ్మకంపై రుణాలు తెచ్చుకునే యోచన లేదు.

• ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు మాత్రమే టిక్కెట్ దొరకాలి. వినోదం అందరికీ అందుబాటులో ఉండాలి.

• ట్యాక్స్ లు ఎగ్గొట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సక్రమంగా జీఎస్టీ కట్టాలనేది ప్రభుత్వ ఆలోచన.

• గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హాయాంలో సినిమా కెపాసిటీని బట్టి 50 శాతం వరకూ ఆన్ లైన్ అమ్మవచ్చని రూల్ ఎమెండ్ మెంట్ ఉంది
తప్పితే చట్టసవరణ లేదు.

• సినిమా ఇండస్ట్రీ పొడ్యూసర్స్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్లు ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారికి కొన్ని విజ్ఞాపనలు
పెట్టారు. ప్రభుత్వం పరిశీలిస్తుంది.

• బెనిఫిట్ షోకి అవకాశం ఉంది.. కానీ ఆ బెనిఫిట్ ఎవరి కోసం…?

• జీవో 35 ప్రకారం బెనిఫిట్ షోకి అవకాశం.. సమాజహితం కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నామనే సంస్థ ఎవరైనా సినిమా థియేటర్ తో
గానీ, డిస్ట్రిబ్యూటర్స్ తో గానీ మాట్లాడుకుని జాయింట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే బెనిఫిట్ షోకి అనుమతి వస్తుంది.

• చట్టం ప్రకారం కేవలం 4 షోలే వేయాలి.

• సినిమాటోగ్రఫీ చట్టం వచ్చినప్పటి నుంచి.. ప్రభుత్వం చెప్పినన్ని షోలే నడపాలి.

• చంద్రబాబు నాయుడు గారి హాయాంలో టిక్కెట్ల విక్రయం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు.. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వదు.. ఈ కమిటీ
రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మా రేటు మేం పెంచుకునే అవకాశం ఇవ్వండని కోర్టులకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకునే వాళ్లు.

• జీవో నెంబర్ 35 ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది కోర్టుకి వెళ్లారు.. కానీ కోర్టు ఒప్పుకోలేదు. జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్
అమ్మాలని ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు.

• జగన్ గారి ప్రభుత్వానికి పెద్ద హీరో, చిన్న హీరో.. పెద్ద రెమ్యూనరేషన్, చిన్న రెమ్యూనరేషన్.. పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్.. పెద్ద
ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ అని ఏమీ లేదు.. ప్రేక్షకుడి యాంగిల్ లోనే ప్రభుత్వ ఆలోచన.

• ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకి సంబంధం లేనిది ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థ… ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ అనేది ఎగ్జిబిటర్లకు
సంబంధించింది.

• ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో.. పర్యావరణ హితం కోసం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా కేంద్రప్రభుత్వ ఆదేశాల
మేరకు గ్రీన్ ట్యాక్స్.

• గతంలో 10 సంవత్సరాలు దాటిన పాతవాహనాలకు రూ.200 లు మాత్రమే అదనపు ఫీజును వసూలు చేసేవారు. పాత వాహనాలు వాడే
వారిని నిరుత్సాహ పర్చడం కోసం ఫీజును పెంచుతున్నాం.

• పాత వాహనాలు నడపడం వల్ల పొగ పెరగడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరగడం, పర్యావరణానికి ఇబ్బంది.

• వాహన పన్నుల చట్టంలో సవరణలు చేశాం… పాత వాహనాల నియంత్రణ కోసమే హరితపన్ను(గ్రీన్ ట్యాక్స్).

• సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాడే మోటారు సైకిళ్లు, ఆటోలకు హరితపన్ను లేదు. ఈ పెంపుదల వర్తించదు.

• 10 లక్షల దాటిని లగ్జరీ వాహనాలకు మాత్రమే పన్ను.

• రూ.20 లక్షల దాటిన 4 వీలర్లకు 4 శాతం పన్ను.

* మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన…

మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్న నారా లోకేష్.

మహానాడు, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించిన నారా లోకేష్.

ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్.

ప్రజల్ని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న లోకేష్.

* లోకేష్ గెలిస్తే ఇళ్లు పీకేస్తారని ప్రచారం చేసారు.

కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్కే దగ్గర ఉండి మరీ పేదల ఇళ్లు కూలుస్తున్నారు.

త్రాగునీరు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి, రోడ్లు వెయ్యడం లేదు, రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు.

నిత్యావసర సరుకులు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధర ,ఇంటి పన్ను పెంచేసారు.

ఇళ్ల పట్టాలు ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఇళ్లు తొలగిస్తున్నారు.

విద్యుత్ బిల్లు ఎక్కువొచ్చిందని, రకరకాల కారణాలు చూపి పెన్షన్, రేషన్ కార్డు, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారంటూ తమ
సమస్యలను లోకేష్ కి వివరించిన మహానాడు ప్రాంత ప్రజలు.

సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, మీ తరపున పోరాడతానని లోకేష్ హామీ.

* మీడియా తో నారా లోకేష్

ఆకాశంలో ఉన్న జగన్ గారు భూమ్మీదకి రావాలి.

రెండున్నర ఏళ్లలో తాడేపల్లి కొంప నుండి బయటకు అడుగు పెట్టలేదు.

సొంత జిల్లా ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని ముఖ్యమంత్రి

వరదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్ రెడ్డి గాల్లో ఒక రౌండ్ కొట్టొచ్చి ఇంట్లో
పడుకున్నారు.

హుద్ హుద్ , తిత్లీ వచ్చినప్పుడు చంద్రబాబు గారు స్వయంగా వెళ్లి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అక్కడే ఉన్నారు.

తిత్లీ వచ్చినప్పుడు 21 రోజుల్లో వెయ్యి కోట్ల నష్ట పరిహారాన్ని రైతులకు అందజేసాం.

ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా వేసే నాధుడు లేడు.

రైతులు తీవ్రంగా నష్టపోయారు,వరి ,శనగ, మిర్చి ఇలా పంటలన్ని దెబ్బతిన్నాయి.

తక్షణమే పరిహారం అందించాలి.

జగన్ రెడ్డి గారు వచ్చిననాటి నుండి అన్నీ సమస్యలే.

ఇసుక దగ్గర నుండి నిరుద్యోగం వరకూ అనేక సమస్యలు.

ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు. తమిళనాడు లో ఇండస్ట్రీయల్ సమిట్ పెడితే 25 వేల కోట్ల పెట్టుబడులు ఆ రాష్ట్రానికి వెళ్లాయి.

ప్రజల పై భారాన్ని పెంచుకుంటూ పోతున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు , విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను ,ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, ఇప్పుడు మళ్లీ
వాహన రిజిస్ట్రేషన్ మీద పన్ను.

వాహనాలు కొనే వారిపై కూడా జగన్ రెడ్డి బాదుడే బాదుడు.

పెంచిన పన్నులు తగ్గించే వరకూ టిడిపి ప్రజలకు అండగా పోరాడుతుంది.

జగన్ రెడ్డి తుగ్లక్ 3.0 మాట మార్చడం, మడమ తిప్పడం ఆయనకి అలవాటుగా మారింది.

ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చెయ్యలేదు.

జగన్ రెడ్డికి ఏ సబ్జెక్ట్ మీదా అవగాహన లేదు.

చట్టం తీసుకొచ్చే ముందు ఇవ్వన్ని తెలియదా?

కనీస అవగాహన లేకుండా సౌత్ ఆఫ్రికా, మూడు రాజధానులు అన్నారు.

మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసారా?

అప్పుడు వద్దు అన్న మండలి ఇప్పుడు ముద్దైంది. అందుకే ఆయన మాట మారుస్తాడు, మడమ తిప్పుతాడు అనేది.

మంగళగిరి లో అభివృద్ధి ఆగిపోయింది.

రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే మంగళగిరి లో ఎంతో అభివృద్ధి చెయ్యొచ్చు.

ముఖ్యమంత్రి ఉండే నియోజకవర్గమైనా అభివృద్ధికి నోచుకోవడం లేదు.

అభివృద్ధి అంతా పేపర్లకే పరిమితం అవుతుంది.నిధులు విడుదల కావడం లేదు.

తాడేపల్లి ప్రాంతానికి తాగునీరు అందించేందుకు టీడీపీ ప్రభుత్వం 110 కోట్లు కేటాయించింది.

పైసల కోసం కాంట్రాక్టర్లను బెదిరించిఆఖరికి ఆ ప్రాజెక్ట్ ను కూడా ఆపేశారు.

లోకేష్ వస్తే ఇళ్లు కొట్టేస్తాడు అని ప్రచారం చేసి ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యే దగ్గరుండి ఇళ్లు కొట్టిస్తున్నారు.

నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం టిడిపి పోరాడుతుంది.

నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

* ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్.

* పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు పోలిస్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడి

3 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కిన స్టేషన్ రైటర్ సత్యనారాయణ

కొనసాగుతున్న సోదాలు