DailyDose

ఈ ప్రముఖులను ఒకసారి స్మరించుకుందాం

ఈ ప్రముఖులను ఒకసారి స్మరించుకుందాం

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది.
పుట్టిన తేదీ: 9 ఆగస్టు, 1910
పుట్టిన స్థలం: రావులపాలెం
మరణించిన తేదీ: 26 నవంబర్, 1975
మరణించిన స్థలం: తాడేపల్లిగూడెం

గరికపాటి వరలక్ష్మి (సెప్టెంబర్ 13, 1926 – నవంబర్ 26, 2006)
అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి రంగస్థల, సినిమా నటి.

ఎం. ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు.

పుట్టిన తేదీ: 8 అక్టోబర్, 1935
పుట్టిన స్థలం: తుంగతుర్తి
మరణించిన తేదీ: 25 నవంబర్, 1997
మరణించిన స్థలం: హైదరాబాద్