DailyDose

కోహినూర్ వజ్రం వెనుక కథ ఇది

కోహినూర్ వజ్రం వెనుక కథ ఇది

ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు పెట్టింది ఎవరు ?
………………………………………………….

మనదేశ హిందూరాజుల సామంతుల వద్దగల వజ్రాలగురించి విదేశీయాత్రికులు తమ రచనలలో పేరేకొనడం జరిగింది. ఉదా॥న్యూనిజ్ అనే యాత్రికుడిప్రకారం నాడు ఆంధ్రదేశంలో విరివిగా విలువైన వజ్రాలు దొరికేవని, గనులనుండి త్రవ్వి బయటకు తీసిన వజ్రాలలో 25 మాంజలీన్ బరువున్న వాటిని రాజుగారి ఖజానాకు చేరేవని వ్రాశాడు. ఒక మాంజలిన్ అనగా నాలుగు గురువింద గింజల ఎత్తు. చివరి విజయనగరప్రభువుల రాజధానైన చంద్రగిరిలో 1614లో మూడు బోషానాల నిండుగా ఇలాంటి విలువైన వజ్రాలున్నట్లు ఈ బరడాస్ అనే యాత్రికుడు తెలిపాడు.

పరిటాల, కొల్లూరు, వజ్రకరూరులోని గనులు వజ్రాలకు ప్రసిద్ధి. వజ్రకరూరులో దొరికే వజ్రాలు నాణ్యమైనవి. నాడు ఈ గనులన్నింటిని కలిపి గోల్కొండ వజ్రాలగనులుగా పిలిచేవారు.

విజయనగర ఓటమి తరువాత ఆదిల్షాకు కొడిగుడ్దంత వజ్రాన్ని చేజిక్కుంచుకొన్నాడని డికాడా అనే యాత్రికుడు వ్రాసుకొన్నాడు.రాయలు ఆ వజ్రాన్ని తన తలపాగాలో ధరించేవాడట.

1534 లో గార్డియా డి ఓర్టా విజయనగరాన్ని సందర్శించాడు. రాయలు వద్ద కోడిగుడ్డంత వజ్రాన్నేకాకుండా 150, 175,313 కారట్ల విలువైన వజ్రాలున్నట్లుగా టావెర్నియర్ పేర్కొన్నాడు.

కోహినూర్ వజ్రం 1656 ఆప్రాంతంలో కృష్ణానది వద్దగల కొల్లూరులో దొరికింది. గోల్కొండ కమాండర్ మీర్ జుమ్లా చేతికి ఈ ముతక వజ్రం చేరింది. చెక్కకుండా సానబట్టకుండానే ఈ వజ్రాన్ని మీర్జుమ్లా, షాజహానుకు కానుకగా అందించాడు.అప్పుడు దాని బరువు 765 కారట్లు. షాజహను దానిని సానబట్టడానికి వెనిస్ నగరంనుండి వచ్చిన హోర్టెన్సియో బోర్ణియో అప్పగించాడు. బోర్నియో చేతిలో ఈ వజ్రం ఎంతగానో నష్టపోయింది.

1665 లో టావెర్నియర్, ఔరంగజేబు ఖజానాలో చూచినపుడు దీని బరువు 268 కారట్లు. నాదిర్షా 1739 లో డిల్లిపై దండయాత్ర జరిపి లక్షమంది అమాయక ప్రజలను ఊచకోత కోసి నెమిలి సింహాసనంతో పాటు ఈ వజ్రాన్ని కూడా పట్టుకుపోయాడు. నాదిర్షా ఈ వజ్రానికి కోహినూర్ అనే పేరుపెట్టాడు.

1747 లో నాదిర్షా హత్యానంతరం ఈ వజ్రం అతని మనువడైన పారూక్ కు చేరింది. నాలుగేళ్ళ అనంతరం పారూక్ దీనిని కాబూల్‌ రాజైన అహ్మద్ షాకు ఇవ్వడం జరిగింది. తరువాత ఈ వజ్రం అహ్మద్ షా కొడుకైన తైమూర్ కు చేరింది.మరలా 1793 లో తైమూర్ కొడుకైన షాజహాన్ చేతికి వచ్చింది. షాజహన్‌ తమ్ముడైన మహ్మద్ అన్న కండ్లను పీకించి కారాగారంలో తోశాడు. ఏ కారణంచేతనో కోహినూర్ కారాగారంలోవున్న షాజహాన్ వద్దేవుండిపోయింది. 1795 లో ఈ కోహినూర్ వజ్రం షాజహాన్ తమ్ముడైన సులతాను షుజాకు దక్కింది.1809 లో ఎల్ఫిన్ స్టోన్ ఈ వజ్రాన్ని సులతాన్ షుజా చేతికంకణంలో చూచాడు. వారసత్వయుద్ధంలో ఓడిన షుజా వజ్రంతోపాటు లాహోర్ కు పారిపోయాడు.

షుజాను లాహొర్ పాలకుడైన రాజా రంజిత్ సింగ్, రాచరికభవనంలో ఖైదీగా చేశాడు.