DailyDose

TNI నేటి తాజా వార్తలు 25-Nov-2021

TNI  నేటి తాజా వార్తలు 25-Nov-2021

* ఆంధ్రప్రదేశ్:- టికెట్ల ధర విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి

దేశమంతా ఒకటే జీఎస్టీ గా పన్నులు తీసుకుంటున్నారు

టిక్కెట్ ధరలు కూడా అదే వెసులుబాటు ఉండాలి పారదర్శకత

పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ హర్షించదగ్గదే

అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా ఉండాలి

ప్రోత్సాహం ఉన్ననాడే సినీ పరిశ్రమ నిలదొక్కుకుంది

థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వం ఆలోచించాలి

సినిమా పై ఆధార పడ్డ కుటుంబాల కోసం పునరాలోచన చేయాలి..చిరంజీవి..

* కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి: 

విలక్షణ నటుడు కమలహాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తన తండ్రి కోలుకుంటున్నారని ఆయన కుమార్తె, సినీనటి శృతిహాసన్ వెల్లడించారు. కమల్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమలహాసన్ ఆరోగ్యం బాగుందంటూ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ అధికారులు కూడా బులెటిన్ విడుదల చేశారు. కాగా పరిశ్రమలో కమలహాసన్, రజనీకాంత్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కమల్‌కు కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న రజనీకాంత్. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు.

* తమిళనాడులో కిలో టమోటా రూ.70లకే..!

సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

చెన్నై: ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు వీటి ధరలు పెరగడమే తప్ప ఏనాడు తగ్గిన దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలోనే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటా ధరలు… సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమోటా ధర 130 రూపాయలు ఇప్పటికే దాటేసింది. కొన్ని ప్రాంతాల్లో కేజీ టమోటా ధర రూ.150 కూడా దాటేసింది.

ఇలాంటి తరుణంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిలో టమాట 70 రూపాయలకే ప్రజలకు ఇవ్వాలని అని అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు సీఎం స్టాలిన్. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కిలో టమాట ధర 150 రూపాయలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం స్టాలిన్. ప్రభుత్వ దుకాణాల్లో సబ్సిడీ లో టమాటాలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

* అమరావతి

హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసు లో సి.బి.ఐ తాజా అఫిడవిట్

అఫిడవిట్ ను హైకోర్టులో దాఖలు చేసిన సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ అఫిడవిట్ను పిటిషనర్ల కు పంపిన సి.బి.ఐ.

న్యాయమూర్తులను కించపరిచే విధంగా పదే పదే వీడియోలు పెడుతున్న పంచ్ ప్రభాకర్ కోసం నవంబర్ 1న లుక్ఔట్ సర్క్యులర్ హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేశామని పేర్కొన్న సి.బి.ఐ.

ఇంటర్పోల్ జారీచేసిన బ్లూ నోటీసు ద్వారా అమెరికాలోని ఎఫ్ బి ఐ( ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అతని చిరునామాను పంపిందని పేర్కొన్న సి.బి.ఐ.

నవంబరు 8వ తేదీన పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ సంబంధిత కోర్టు నుంచి తీసుకున్న సి.బి.ఐ.

ఈనెల 9వ తేదీన ఇంటర్ పోల్ కు పంచ్ ప్రభాకర్ అరెస్టు రిక్వెస్ట్ ను పంపిన సి.బి.ఐ.

ప్రభాకర్ అరెస్ట్ కు సంబంధించి ఇంటర్పోల్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్న సీబీఐ.

పంచ్ ప్రభాకర్ తాజా వీడియో లపై ఈనెల 15న యూట్యూబ్ ఛానల్ తో వర్చువల్ గా సమావేశమైన సిబిఐ అధికారులు.

పంచు ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్స్ మొత్తాన్ని తొలగించాలని యూట్యూబ్ ను కోరిన సి.బి.ఐ.

ఈ కేసులో సంబంధం ఉన్న మిగతా వారందర్నీ విచారిస్తున్నామని పేర్కొన్న సి.బి.ఐ.

ఈ కేసులో 17వ నిందితుడిగా పంచ్ ప్రభాకర్ పేరును చేర్చామని పేర్కొన్న సి.బి.ఐ.

* నెల్లూరుజిల్లా

గూడూరు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.

గూడూరు పోటుపాలెం సర్కిల్ జాతీయ రహదారి పై చంద్రబాబు నాయుడు రోడ్ షో.

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వరద ముంపు జిల్లాల పర్యటనలో భాగంగా కడప,నెల్లూరు జిల్లాల పర్యటనలో భాగంగా నాయుడుపేట దాటుకుని గూడూరు వద్ద జాతీయ రహదారి పై రోడ్ షో లో పాల్గొన్నారు. భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులు,చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు.

* నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుకు. మోదీ శంకుస్థాపన

నోయిడా: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌ జిల్లా జెవెర్‌ ప్రాంతంలో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు హాజరయ్యారు. శంకుస్థాపనకు ముందు ఎయిర్‌పోర్టు డిజైన్‌ విశేషాలను మోదీకి. నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు.

1300 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తోన్న ఈ నిర్మాణం పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఇదే కానుంది. తొలి దశలో రూ.10,050కోట్లతో దీని పనులు చేపట్టారు. 2024 సెప్టెంబరు/అక్టోబరు నాటికి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని యూపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఏడాదికి 1.2కోట్ల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్టును రూపుదిద్దనున్నారు. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానశ్రయం కాగా. ఉత్తరప్రదేశ్‌లో ఐదోది. దేశంలోనే ఐదు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులున్న ఏకైక రాష్ట్రంగా యూపీ నిలవనుంది.

* తమ్మినేని సీతారాం గారు
శాసనసభ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ

విషయం: మహిళలపై అసహ్యకరమైన లైంగిక సంభాషణలు చేసిన ప్రజా ప్రతినిధుల పై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్యా! సమస్యలపై చర్చించే ప్రజా వేదికగా ఉండాల్సిన శాసనసభ మహిళల గౌరవాన్ని భంగం పరిచే కక్షపూరిత సంభాషణలకు, అసహ్యకరమైన దుర్భాషలకు వేదిక కావడం అత్యంత విషాదకరం.

19-11-21 న అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి జరిగిన దుర్భాషల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

సభలో లేని వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడడం సభా మర్యాద కాదు అనేది మీకు తెలియని విషయం ఏమీ కాదు.

సభలో లేని మహిళను అన్యాపదేశంగా ఉద్దేశించి కొడుకు పుట్టుకను వివాదాస్పదం చేయడం, నిందారోపణలు చేయడం లైంగిక వేధింపులకు క్రిందకే వస్తుంది. సభలో లేని అమ్మ గురించి, చెల్లి గురించి మాట్లడనడం ఏరకంగా న్యాయబద్దమైనది?

అత్యున్నత శాసనసభ మందిరంలో ఈ రకమైన లైంగిక సంభాషణలను నిరోధించాల్సిందిగా కోరుతున్నాము.

ప్రజలకు బాధ్యత వహిస్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, చట్టాలను గౌరవిస్తామని ప్రకటించి, ప్రమాణం చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రతిపక్షాలను మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని బిడ్డల పుట్టుకను ప్రశ్నించడం మహిళలకే కాదు, శాసనసభకు, శాసనసభా నాయకుడికి అగౌరవం. ప్రతిపక్ష నాయకుడు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడాదమనడం ఏరకమైన సభామర్యాద?

కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు అత్యంత ఆక్షేపణీయం గా ఉంది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఎవరు ఎవరిని ఉద్దేశించి ఏమి మాట్లాడోరో కూడా పత్రికల లో మీడియా లో చర్చ నియాంశమవుతుంది. వెరసి రాజకీయాలలో అధికార ప్రతి పక్షాలు తమ రాజకీయ మైలేజి కోసం మహిళ లను, చివరకు మహిళా ప్రజాప్రతినిధులు కూడా సభలోనూ బయట అవమానకరంగా ఆరోపిస్తున్నారు. ఇవి నేరపూరిత మైన వ్యాఖ్యానాలు.

వారు శాసన సభ లో ఆఫ్ ది రికార్డు మాట్లాడినా అక్కడ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, విలేకరులు అందరూ కూడా జరిగిందేమిటో, మాట్లాడింది ఏమిటో విన్నారు..

దీనిపై మీరు విచారణ చేయాలి. అసభ్య సంభాషణలు చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి.

మహిళలను గౌరవించడం మాత్రమే కాదు మహిళల కోసం చేసిన చట్టాలను రక్షించాల్సిన బాధ్యత కూడా శాసనసభ కున్నది.

అసెంబ్లీలోనూ,బయటా ఏమి మాట్లాడినా చెల్లుబాటవుతుందనే ధోరణికి అడ్డుకట్ట వేయటానికి అవసరమైన చర్యలు చేపట్టాలి.

ఒక బిడ్డ తన పోలికలతో లేదని ఇటీవల కాలంలో తండ్రి సొంత బిడ్డను చంపడం మీడియా లో రిపోర్ట్ అయింది.

శాసనసభలో జరిగిన ఈ అసహ్యకరమైన ఆరోపణలు అంతకంటే తక్కువ నేరమేమీ కాదు. నేరస్తులకు శిక్షలు పడాలి. అంటే నేరం పై విచారణ జరగాలి.

మహిళలను ఉద్దేశించి సైగలు కూడా లైంగిక వేధింపులకిందకు వస్తాయని ఇండియన్ పీనల్ కోడ్ నిర్వచిస్తుంది.

అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించారు అన్న వార్తలు అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చాయి .

ఆ అన్ పార్లమెంటరీ పదాలు మహిళల లైంగికతను కించపరుస్తూ వాడినప్పుడు కచ్చితంగా వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది.

మీరు మీ అధికారాన్ని ఉపయోగించి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇప్పటికే ఒక ఎమ్మెల్యే చేసిన లైంగిక దూషణలు యూ ట్యూబ్ లో ప్రసారమవుతున్నాయి.ఇద్దరు శాసనసభ్యులు మహిళలతో అనుచిత లైంగిక సంభాషణలు మీడియా లో ప్రచారం లో ఉన్నాయి.

శాసన సభ సభ్యుల నైతిక ప్రవర్తన పైన చర్యలు చేపడతారని ఆశిస్తున్నాము.

మహిళలకు సాధికారత కల్పిస్తున్నామని అసెంబ్లీలో ముందు రోజే ప్రకటించారు.మహిళలసాధికారతకు భంగ కరంగా అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఉంది.

జరిగిన ఘటనలపై విచారణ జరపాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
నమస్కారము లతో

డి.రమాదేవి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి
పి.దుర్గాభవాని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి
సుంకర పద్మశ్రీ మహిళా కాంగ్రెస్ నాయకులు
రాగి గంగాభవాని పి ఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు
నాగమణి ఐప్వా రాష్ట్ర కార్యదర్శి
ఎన్ మాలతి మహిళా సత్తా

* హైదరాబాద్

కోవిడ్‌తో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌ లో క్రిటికల్ కండీషన్‌లో ప్రముఖ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.

ఇండస్ట్రీ వర్గాల నుండి ఏదైనా కొంత సాయం కావాలని కోరుతున్న శివశంకర్ మాస్టర్ తనయుడు అజయ్ కృష్ణ.

శివశంకర్ మాస్టర్ పరిచయం అక్కరలేని పేరు. కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్న శివశంకర్ మాస్టర్ ఇప్పుడు కోవిడ్‌తో క్రిటికల్ కండీషన్‌లో ఉన్నారు.

నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు.

శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు.

శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.

చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

రోజూవారి ఖర్చులకు అధిక మొత్తంలో అవుతుండటంతో. అంత మొత్తం భరించే శక్తి తమ వద్ద లేదని. ఇండస్ట్రీ వర్గాల నుండి ఏదైనా కొంత సాయం కావాలని శివశంకర్ మాస్టర్ తనయుడు అజయ్ కృష్ణ కోరుతున్నారు.

* అమరావతి/కొండపల్లి (హైకోర్టు)

ఇలాగైతే.. అత్యవసర వ్యాజ్యాలనూ తిరస్కరించే పరిస్థితి వస్తుంది.

హౌస్ మోషన్, లంచ్ మోషన్ పిటిషన్ల దాఖలు విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

అత్యవసరం లేని వ్యాజ్యాలను విచారించాలని పిటిషనర్లు కోరితే.. భవిష్యత్తులో అత్యవసరం ఉన్న వ్యాజ్యాలనూ తిరస్కరించే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది.

★ అత్యవసర సమయాల్లో విచారణ కోసం దాఖలు చేసే హౌస్ మోషన్, లంచ్ మోషన్ పిటిషన్ల విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

★ అంతగా అత్యవసరంకాని వ్యాజ్యాలను కూడా అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరితే.. భవిష్యత్​లో అత్యవసరం ఉన్న వ్యాజ్యాలను తిరస్కరించే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది.

★ ఈనెల 24న కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఆర్వోను ఆదేశిస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి 23న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

★ ఆ ఉత్తర్వులపై అత్యవసరంగా లంచ్ మోషన్​లో అప్పీల్ వేయడానికి అనుమతివ్వాలని హైకోర్టు ధర్మాసనం ముందు వైకాపా కౌన్సిలర్ల తరపున న్యాయవాది కోరారు.

★ అందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం అనుమతి నిరాకరించింది.

★ గతంలో ఒక ఎన్నిక విషయమై రాత్రి 10 గంటల సమయంలో హౌస్ మోషన్ అనుమతి కోరారని గుర్తు చేశారు.

★ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

★ ఎన్నికల వ్యవహారంలో అత్యవసరం ఏముంటుందని ధర్మాసనం ప్రశ్నించింది.

★ నిజంగా అత్యవసరం ఉన్న అంశాల్లోనే న్యాయవాదులు హౌస్ మోషన్, లంచ్​ మోషన్ పిటిషన్ల అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

* అమరావతి

పంచాయతీల ఖాతాల ఖాళీపై సర్పంచుల ఆవేదన

పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాటాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు.

– ప్రభుత్వం తీరుపై విశాఖ జిల్లాలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు.

– నిధులు జమచేయాలని డిమాండ్‌ చేశారు.

★ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు.

★ పంచాయతీల ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థికసంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ పలు జిల్లాలో ప్లకార్డులను ప్రదర్శించారు.

* విశాఖ జిల్లాలో..

★ విశాఖ జిల్లా రావికమతంలో ఆందోళన చేసి భిక్షాటన చేపట్టారు.

★ మండల పరిషత్‌ కార్యాలయం వరకూ సర్పంచులు ర్యాలీగా వెళ్లారు.

★ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెప్పాపెట్టకుండా తీసుకోవడంపై అభ్యంతరం చెబుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

★ అనంతరం ఎంపీడీవో రామచంద్రమూర్తికి వినతిపత్రం అందజేశారు.

★ పంచాయతీ నిధులు తీసుకొని సర్పంచుల చేతులు కట్టేసిందని మేడివాడ, చినపాచిల, రావికమతం మహిళా సర్పంచులు లీలా, రామలక్ష్మి, మంగ వాపోయారు.

★ ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీల ఖాతాల్లోకి జమా చేయాలని టి.అర్జాపురం, తట్టబంద, మర్రివలస సర్పంచులు మడగల అర్జున, గోకాడ చిన రమణ, పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.

* అనంతపురం జిల్లాలో…

★ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

★ ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

★ సర్పంచులకు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరారు.

★ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియడం లేదని వాపోయారు.

★ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయడంలేదని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

★ కార్యక్రమంలో కోడూరు సర్పంచి మురళీమోహన్‌, దేమకేతేపల్లి సర్పంచి తిరుమలేష్‌గౌడ్‌, వీరాపురం సర్పంచి లక్ష్మీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* కృష్ణా జిల్లాలో..

★ కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద కోనాయపాలెం సర్పంచి మార్కపూడి వెంకట్రావమ్మ, ఏటూరు సర్పంచి మామిడి వెంకటేశ్వరరావు, ముప్పాళ్ల సర్పంచి వీరమ్మ, వార్డు సభ్యులు నిరసన దీక్ష చేపట్టారు.

★ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడానికి పైసా నిధులు లేవని, వెంటనే నిధులు జమచేయాలని డిమాండ్‌ చేశారు.

* స్క్రోలింగ్ జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని తక్కెళ్ళపాడు గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో బిక్షాటన. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాటకాలకు మళ్ళించడం తో తెలుగుదేశం పార్టీ చెందిన సర్పంచులు ఆధ్వర్యంలో గ్రామంలో భిక్షాటన
పంచాయతీ నిర్వీర్యం అవుతాయని సర్పంచులు ఆందోళన.

* గుంటూరు జిల్లా (మంగళగిరి)

మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్ పర్యటన.

★ మంగళగిరి మండలం చినకాకాని గ్రామం హోసన్న మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పర్యటన ప్రారంభించిన లోకేష్.

గ్రామంలో ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్.

★ గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న లోకేష్.

వైసీపీ ని గెలిపిస్తే 3 వేల పెన్షన్ అన్నారు. రెండున్నర ఏళ్లుగా పెంచింది రూ.250 మాత్రమే అంటూ లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధులు.

* నవంబరు 27న ఆన్ లైన్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల…

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు
నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేస్తారు.

తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టిటిడి తెలిపింది.

భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

* 🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

🕉️ నిన్న 24-11-2021 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22,778

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 13,179

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 1.43 కోట్లు …

🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

* అమరావతి

నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

ఇది శ్రీలంక- దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26,27, 28 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చునని పేర్కొంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశముందని వెల్లడించింది.

* చరిత్రలో ఈ రోజు/నవంబరు 25

🌷అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము

🌹అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం.

🌸1926 : 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా జననం (మ. 2012). MGL News

🌺1952 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు ఇమ్రాన్ ఖాన్ జననం.

🌻1964 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం (1893).

🌼1966 : భారతీయ సినిమా నటి రూపా గంగూలీ జననం.

💐1974 : ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన యూ థాంట్ మరణం (జ.1909).

🥀2010 : ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.🥀💐🌼🌻🌺🌸🌹🌷🌳🍀🌿🌲🎋🌱🎍🌴☘️

* శబరిమలకు10 ప్రాంతాలలో స్లాట్ బుకింగ్

అయ్యప్పను దర్శనానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేని వారికి.. కేరళలోని స్పాట్ బుకింగ్ కేంద్రాలు టీడీబీ యాజమాన్యం ప్రారంభం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని వారు ఆయా ప్రాంతాలకు వెళ్లి దర్శనం కోసం బుకింగ్ చేసుకోవచ్చు.

దీని కోసం ఏమి అవసరం:
1. ఆధార్ కార్డ్
2.కరోనా వ్యాక్సిన్ యొక్క రెండు మోతాదుల సర్టిఫికేట్. టీకాలు వేయకపోతే
3. RT PCR కరోనా టెస్ట్ 72 గంటల ముందు తీసుకున్న ప్రతికూల ప్రమాణపత్రం.

10 ప్రదేశాలలో స్పాట్ బుకింగ్స్ స్థలాలు:

1. కొట్టారక్కర శ్రీ గణపతి దేవాలయం
2. ఎరిమెలి
3. నిలక్కల్
4. కుముళి చెక్‌పోస్ట్.
5. శ్రీ కండేశ్వర ఆలయం, తిరువనంతపురం.
6. ఎట్రుమనూరు శ్రీ మహాదేవర్ దేవాలయం.
7. వైక్కం శ్రీ మహాదేవర్ ఆలయం.
8. పందళం ప్యాలెస్‌లో ఉన్న శ్రీ వలియక్ ఆలయం
9. పెరుంబవూరు శ్రీ ధర్మశాస్తా ఆలయం.
10. కీలల్లం శ్రీ మహాదేవర్ ఆలయం.

అయ్యప్ప స్వామివారిని సందర్శించే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం.