DailyDose

TNI నేటి నేర వార్తలు 25-Nov-2021

TNI నేటి నేర వార్తలు 25-Nov-2021

* ఎల్బీనగర్…

ఆంద్రప్రదేశ్ లోని సీలేరు నుండి మహారాష్ట్ర కు డ్రగ్స్ రవాణా గుట్టు రట్టుచేసిన రాచకొండ SOT పోలీసులు.

5 గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ SOT పోలీసులు.

వీరి వద్ద 3 కోట్ల 7 లక్షల 93 వేల విలువ జేసే 1820 కిలోల గంజాయి , ఒక స్విఫ్ట్ కారు , మరియు పది టైర్ల లారీ ని స్వాధీనం చేసుకున్న రాచకొండ SOT పోలీసులు.

వివరాలను మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్.

* కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్ర జోగులాంబ గద్వాల

ఏఐసీసీ మరియు టిపిసిసి పిలుపుమేరకు ప్రజా చైతన్య యాత్ర (Jana Jagaran) భాగంగా గురువారం ఉదయం 11:30కి జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రాలలో ముఖ్యఅతిథిగా నాగేష్ ముదిరాజు వచ్చినారు జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ముఖ్యంగా వరి పంట వేసిన రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది. వెంటనే ప్రభుత్వం రైతుల మొత్తం పండని కొనాలని మేము ఈ సందర్భంగా కోరుచున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ రైతులకు పంట కొనడం లో జాప్యం చేశారు అందువల్ల వర్షాలకు వరదలకు ధాన్యం నాని తేమ శాతం ఎక్కువ అయినది అలాంటి రైతులకీ నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నాము అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బల్గేర నారాయణ రెడ్డి , టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్ , మల్దకల్ మండల అధ్యక్షులు నల్లా రెడ్డి , ధరూర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ , గట్టు మండల అధ్యక్షులు గౌస్ , గద్వాల్ మండల అధ్యక్షులు శ్యామ్ , జిల్లా సేవాదళ్ అధ్యక్షులు జమాల్ , కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కొత్త గణేష్ , మైనారిటీ అధ్యక్షులు కౌసార్ బెగ్ , కేటి దొడ్డి మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండల్ రెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంగ్లా షాశ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలెగ్జాండర్ మహారాజ్, సేవాదళ్ జనరల్ సెక్రటరీ శివ రాజు , సేవాదళ్ ఉపాధ్యక్షులు దీపక్ కుమార్ , యువజన కాంగ్రెస్ నాయకులు ఇలియాస్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిఫాయథ, యువజన కాంగ్రెస్ నాయకులు మహేందర్, బిసన్న, రియాజ్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

* విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ లో ఇంతవరకు క్రషర్ ప్రారంభించక పోవడంపై తెలుగుదేశం పార్టీ మాజీ శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు ద్వారపురెడ్డి జగదీష్ బొబ్బిలి చిరంజీవులు పార్వతీపురం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సంవత్సర పేదలకు సంబంధించి 15 మండలాల్లో పండించిన రైతుల వద్ద నుంచి క్రషర్ కు చెరకు ను తీసుకోకపోవడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. యాజమాన్యం సరిపడ చెరుకు లేదని తప్పించుకుని ప్రయత్నం చేస్తున్నారని ద్వారపురెడ్డి జగదీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తక్షణమే రెవెన్యూ యాక్ట్స్ ద్వారా ప్రభుత్వం కార్మికులకు రైతులకు రావలసిన బకాయిలు చెల్లించే ప్రస్తుతం ఈ సీజన్లో సంబంధించి చెరకును యాజమాన్యం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

* హలో మాదిగ చలో డిల్లీ

తేది డిసెంబర్ 13 వ తేది సోమవారం ఉదయం 10 గంటలకు డిల్లీలో జంతర్ మంతర్ నందు అందోళన కార్యక్రమంలో బాగంగా ఈరోజు 25-11-2021 తేదిన ఆలూరు ప్రభుత్వ అథిది గృహము ఆవరణము నందు ఆలూరు తాలూకా అధ్యక్షతన MRPS కర్నూలు పార్లమెంటు అధ్యక్షలు చిప్పగిరి లక్ష్మీ నారాయణ ద్వార కరపత్రాలు ప్రారంభించి కరపత్రాలు విడుదల చేయడమైనది చిప్పగిరి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ దీని మఖ్య ఉధ్ధేశం మాదిగ లకు ABCD వర్గీకరణ జరిగితే మన మాదిగ విద్యార్థులు ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు వచ్చేఅవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం డిల్లీకి అందరు కదిలి రావాలి అని మాదిగ సోదరులకు తెలియజేసారు ఈకార్యక్రమంలో తాలూకా అధ్యక్షలు కత్తి రామాంజనేయులు జిల్లా ఉపాధ్యక్షలు కామినహాళు ఎర్రిస్వామి హాలహర్విమండలం కన్వీనర్ గూళ్యం ఎల్లప్ప చిప్పగిరి కన్వీనర్ గోవిందు హొళగుంద కన్వీనర్ వెంకటేష్ జాన్ వినోద్ మల్లయ్య శివ సిద్దు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

* 40 సంవత్సరాల క్రితం మహబూబాద్ జిల్లా కేంద్రం శివారులో కొనుగోలు చేసిన భూములను లాక్కునేందుకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ భూక్య శీను ప్రయత్నిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గోవింద్ ఝావార్, వేల్పుల రాజశేఖర్, రామడుగు మధుసూదన్, కుంచారపు శ్రీనివాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. శనగ పురం రెవిన్యూ పరిధిలో వివిధ సర్వే నంబర్లలో నాలుగు దశాబ్దాల క్రితం భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ భూక్య శ్రీను మా భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూములు ఇప్పుడు తనవి, తన కుటుంబ సభ్యులకు చెందినవని భూక్య రవి చెబుతూ మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు మీడియాకు వివరించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని బాధితులు చెప్పుకొచ్చారు. తరచూ సర్వేలు చేయాలని తమను ఇబ్బందులకు భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. గతంలోనే అనేక మార్లు సర్వేలు చేసి హద్దులు నిర్ణయించారని ఈ భూముల్లో కౌన్సిలర్ కు సెంటు భూమి కూడా లేదన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.

* విశాఖజిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపైఅనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌నేత అయ్యన్న పాత్రుడు నివాసం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లి ఫిర్యాదు చేయాలని తెదేపా శ్రేణులు నిర్ణయించారు. ర్యాలీకి అనుమతించని పోలీసులు మార్గ మధ్యలోనేతెదేపా శ్రేణులను అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని దాటుకుని అయ్యన్నపాత్రుడు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై అయ్యన్నపాత్రుడుఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా అయ్యన్నపాత్రుడు నడిరోడ్డు పైనే ధర్నాకు దిగారు.ఈక్రమంలో పోలీసులు, తెదేపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళాకార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎంతసేపైనా సరే రోడ్డుపైనే బైఠాయించి. పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లి ఫిర్యాదు చేసి తీరుతామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తల పైపోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమన్నారు. పోలీసుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు పరిసర గ్రామాల నుంచి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. నర్సీపట్నంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాదిగాతరలివచ్చిన కార్యకర్తలు అయ్యన్నకు మద్దతుగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తో పాటు, పలువురు సీనియర్‌ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.

* మాజీ మంత్రి వివేకా హత్య కేసు

7 రోజుల సీబీఐ కస్టడీకి నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

మాజీ మంత్రి వివేకా హ్యత కేసులో అరెస్టై..రిమాండ్​లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్​ రెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో ఉన్న దేవిరెడ్డిని 8 రోజులు కస్టడీకీ ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్​పై వాదనలు విన్న న్యాయస్థానం. 7 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. డిసెంబరు 2 వరకు దేవిరెడ్డి కస్టడీ కొనసాగనుంది.

* ప.గో.జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై దారుణం.

శివాలయం వద్ద మహిళా యాచకులను మోకాళ్ళపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో దాడి.

దెబ్బలు తాళలేక కేకలు పెట్టిన మహిళా యాచకులు.

ఆలయానికి వచ్చిన భక్తులను ఇబ్బంది పెడుతున్నారనే నెపంతో దాడి చేసినట్లు సమర్థించుకున్న దేవస్థానం.

యాచించకుండా వెళ్ళిపోతామని చెప్పిన కనికరం లేకుండా దారుణంగా కొట్టారని మహిళ యాచకుల ఆవేదన.

* అమరావతి (హైకోర్టు)

నేరస్థులను రక్షించాలనుకుంటున్నారా. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న.

విశాఖ చెందిన డాక్టర్ కె.సుధాకర్ కేసు విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసులో ఎలా వ్యవహరించాలో తమకు బాగా తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించింది.

★ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ కె.సుధాకర్ కేసు విషయంలో.. నేరస్థులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది.

★ సీబీఐ అభ్యర్ధన మేరకు.. బాధ్యులైన పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీసింది.

★ అంతేకాదు.. ఇలాంటి విషయాల్లో ఏ విధంగా వ్యవహరించాలో తమకు బాగా తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించింది.

★ పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. సీబీఐ కోరుతున్న అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలిపారు.

★ అయితే.. దానికి సంబంధించిన వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసిన ధర్మాసనం.. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

★ డాక్టర్ సుధాకర్​పై విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై.. వీడియో క్లిప్పింగులను జతచేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్​గా పరిగణించి విచారణ జరిపి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

★ ఈ వ్యాజ్యం నేడు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.

★ దర్యాప్తుపై స్థాయి నివేదికను సీల్డ్ కవర్​లో కోర్టు ముందు ఉంచినట్లు సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు కోర్టుకు తెలిపారు.

★ కేసులో ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేసినట్లు వివరించారు.

★ సీబీఐ కోరిన పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే.. తుది అభియోగపత్రం దాఖలు చేస్తామని వెల్లడించారు.

★ పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్​ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలిపారు.

* ఎండాడ వద్ద ఘోర రోడ్ ప్రమాదం.

త్రి టౌన్ సిఐ ఈశ్వరరావు మృతి.

గురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని మదురవ్వాడ వైపు వెళ్తున్న పోలీసు వాహనం ఎండాడ ఏసీపీ కార్యాలయం దగ్గరలో ప్రమాదానికి గురైంది.

బహుశా ఈ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఉంటుందని, లేదా ఈ వాహన డ్రైవర్ (హోమ్ గార్డు) వేరే వాహనాన్ని ఢీకొని ఉంటాడని పోలీసులు బాహావిస్తున్నారు.

ఈ ఘటనలో 3టౌన్ సిఐ ఈశ్వరరావు కు బయమైన గాయలైయి నూజ్జు నూజ్జు అయ్యి ఘటనా స్థలంలో మృతి చెందారు.

డ్రైవర్ కి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* అమరావతి

అసెంబ్లీలో చంద్రబాబు భార్యపై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆ వ్యాఖ్యలకు నిరసనగా తెదేపా నేత వర్ల రామయ్య దీక్ష చేయనున్నారు.

సీఎం క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో నేడు వర్ల రామయ్య దంపతులు.. 12 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నారు.

ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నట్లు వర్ల రామయ్యతెలిపారు.

నవంబర్​ 19న ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా మధ్య మాటల యుద్ధం సాగింది.

ఈ క్రమంలో తాను మాట్లాడుతుండగా.. స్పీకర్​ మైక్​ కట్​ చేశారని చంద్రబాబు తెలిపారు.

దాంతో అసెంబ్లీ నుంచి చంద్రబాబు, మిగతా తెదేపా ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.

వెంటనే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఒక్కసారిగా భోరున విలపించారు. వెక్కివెక్కి ఏడ్చారు.

తన భార్యను అవమానించేలా అసెంబ్లీలో అధికారపక్షం వాళ్లు మాట్లాడారని చంద్రబాబు గద్గద స్వరంతో తెలిపారు.

* కర్నూలు జిల్లా పెదకడుబూరు పోలీసు స్టేషన్ లో పెన్సిల్ కోసం ఫిర్యాదు చేసిన చిన్నారులు.

* కె.ఎల్.విశ్వవిద్యాలయంలోని ఉమెన్స్ ఫోరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో మహిళల పై హింసను అరికట్టడం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు ముఖ్యఅతిథిగా ఏపీ సిఐడి సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆడపిల్లలు, మహిళలు, బాలికలపై సమాజం నుంచి ఎదురవుతున్న హింస అంతా ఇంతా కాదని అన్నారు. మారిన కాలంతో పాటు హింస స్వరూపాలు మారాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని తెలిపారు. మహిళలపై జరుగుతున్న హింసను పూర్తిగా అరికట్టేందుకు అందరం నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

చిన్న పిల్లల నుంచి మహిళల వరకు అనేక రకాల హింసలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాలలో మహిళల పై నిత్యం హింసలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళ పై హింసలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై దాడులను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం ప్రవేశపెట్టారని తెలిపారు. దిశ చట్టం మహిళలకు ఒక శ్రీరామ రక్ష అని కొనియాడారు. ప్రస్తుత కాలంలో రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై రోజూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, అవి చాలా వరకు బయటకు రావడం లేదని చెప్పుకొచ్చారు.

మహిళలను దేవతలుగా భావించే ఈ గడ్డపై నిత్యం ఎన్నో దాడులు, అత్యాచారాలు జరుగుతుండటం భయాన్ని కలిగిస్తోందన్నారు. చిన్నారులపై కూడా జరుగుతున్న దారుణాలను చూసి కఠిన చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకతపై ఒక మహిళగా తల్లిగా తనకు బాధకలిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలకు ఎంతో అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక చట్టం తీసుకురావడం ఎంతో శుభపరిణామాన్ని తెలిపారు. ఆపద లో ఉన్న మహిళలకు రాష్ట్ర పోలీస్ అండగా ఉంటుందని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగ సంక్షేమ అధిపతి డీన్ డాక్టర్ కే.ఆర్.ఎస్.ప్రసాద్, అడ్వైసర్ డాక్టర్ హాబీబుల్లా ఖాన్,ఉమెన్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ లలిత,ఎఐ అండ్ డీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ లలిత, వాసుజ దేవి,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.