NRI-NRT

బోధన్ మండలంలో 300మంది విద్యార్థులకు నాట్స్ చేయూత

బోధన్ మండలంలో 300మంది విద్యార్థులకు నాట్స్ చేయూత

నాట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ మండలంలో ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్ధులకు బ్యాగులు, నోట్ పుస్తకాలు, పలక‌లు, పెన్నులు, పెన్సిల్‌లు, జామెట్రీ బాక్స్‌లను పంపిణీ చేశారు. నాట్స్ సభ్యులు శశాంక్ కోనేరు, గోపి పాతూరి స్థానిక పాఠశాలల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఎత్తోండ, సాలంపాడు, అక్బర్ నగర్ పాఠశాలల్లోని 300మంది విద్యార్ధులకు వీటిని అందజేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం తదితరులు పాల్గొన్నారు.