Business

అబ్బబ్బ్బా….పేటీఎం సంస్థకు ₹481కోట్ల నష్టం

అబ్బబ్బ్బా….పేటీఎం సంస్థకు ₹481కోట్ల నష్టం

భారీ అంచనాలతో ఐపీవోకు వెళ్లిన పేటీఎంకు మార్కెట్లలో ఎదురుగాలి వీచింది. పేటీఎంను నష్టాలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.కాగా కంపెనీ తాజాగా విడుదల చేసిన క్యూ2 ఫలితాల్లో కూడా భారీ నష్టాలను సొంతం చేసుకుంది. ఈ ఏడాది క్యూ2లో భారీ నష్టాలను మూటకట్టుకుంది. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 481 కోట్ల 70 లక్షల రూపాయల నికర నష్టాలు వచ్చాయి.

గత ఏడాదితో పాటుగా వరుసగా రెండో త్రైమాసికంలో నష్టాలను పొందడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఇదే స్థాయిలో నష్టాలను పేటీఎం రికార్డు చేసింది. (ఏప్రిల్‌-జూన్) క్యూ1లో 376 కోట్ల 60 లక్షల రూపాయల మేర నష్టాలను మూటకట్టుకుంది. ఇదిలా ఉండగా…కంపెనీ రెవెన్యూ గణీయంగా పెరిగింది. కోవిడ్‌-19 రాకతో డిజిటల్‌ చెల్లింపులు అధికమయ్యాయి. దీంతో పేటీఎం కార్యకలాపాలు రెట్టింపు స్ధాయిలో జరిగాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో వన్ 97 కమ్యూనికేషన్స్ మొత్తంగా 1,086 కోట్ల 40 లక్షల రూపాయల మేర కార్యకలాపాలను రికార్డు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 663 కోట్ల 90 లక్షల రూపాయలు నమోదుచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో 64 శాతం మేర కంపెనీ కార్యకలాపాలు పెరిగాయి. ఫలితంగా కొంతమేర నష్టాలు తగ్గాయి.