WorldWonders

ప్రమాదంలో మద్రాసు నగరం. 200 ఏళ్లలో లేని వర్షం ఒకేసారి పడితే…

ప్రమాదంలో మద్రాసు నగరం. 200 ఏళ్లలో లేని వర్షం ఒకేసారి పడితే…

ప్రమాదపుటంచుల్లో చెన్నై.. 200 ఏళ్ల తర్వాత రికార్డు వర్షం

★ చెన్నై మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది.

★ కుంభవృష్టికి చెన్నై సిటిలోనూ, శివారు ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.

★ ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.

★ గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని సుమారు 500 వీధుల్లో మోకాలి లోతు ప్రవహిస్తోంది.

★ పూందమల్లి, ఆవడి, అంబత్తూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

★ కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో చెరువు గట్టులు తెగిపోవడంతో వరదలు ముంచెత్తాయి.

★ కాంచీపురం నుంచి హైవేను కలిపే మార్గం పాలారు నది వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

★ వరద బాధితులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు రక్షిస్తున్నాయి.

తమిళనాడును వర్షాలు వీడట్లేదు.

★ తమిళనాడులోని 17 జిల్లాల్లో మూడు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి.

★ తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్‌నగర్‌, శివగంగ, దిండిగుల్‌, మధురై జిల్లాల్లోనూ కుండపోత వర్షాలకు లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

★ రామేశ్వరంలో వర్షం పడుతూనే ఉంది.

★ ఈశాన్య రుతుపవనాల తీవ్రత, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అండమాన్‌ తీరంలో రేపు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో..తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి.

★ చెన్నై సహా 14 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్ జారీ చేసింది.

★ తిరువణ్ణామలై, కళ్లకుర్చి, కన్నియాకుమారి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

★ వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలున్నాయి.