Devotional

శ్రీ శైల జ్యోతిర్లింగం వింతలు-విశేషాలు

శ్రీ శైల జ్యోతిర్లింగం వింతలు-విశేషాలు

శివ దర్శనం

☘️☘️☘️☘️☘️☘️☘️☘️

కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

శ్రీ మల్లికార్జున స్వామి – శ్రీశైలం -కర్నూలు జిల్లా

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదావసంతమ్
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ “”

శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కర్నూలు జిల్లా లోని ప్రముఖ శైవ క్షేత్రము. ఇక్కడ మల్లిఖార్జునుడు భ్రమరాంబ కొలువై ఉన్నారు. ఇది దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొలువై ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగం లలో ఒకటి.

పురాణగాధ

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి…ఆ తల్లే భ్రమరాంబిక గా ఇక్కడ పూజలందుకొంటున్నది..

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది.. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే నామం తో పిలుస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది.

త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి.

సాక్షి గణపతి ఆలయం.

ఇది ముఖ్యమైన ఆలయం కి కొద్ది దూరంలో ఉంటుంది. మనము శ్రీశైలము వచ్చినాము అని ఈ గణపతి సాక్షి అన్నమాట అందుకే ఇతనిని సాక్షి గణపతి అంటారు.

పాలధార-పంచధారలు

శిఖరంకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపస్సు చేసిన ప్రదేశము ఉంది. కొండపగులులనుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.

హటకేశ్వరం

శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు.

శిఖరం

శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి అటూ ఇటూ వీలుగా త్రిప్పి దూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపై నున్న శిఖరాన్ని చూడటానికి ప్రయత్నించాలి.అలా చూసే టప్పుడు ఆవ్యక్తి కి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

నల్లమల లోతట్టు ప్రాంతమైన భౌరాపూర్‌ చెరువు వద్ద వెలసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డిరాజులు, విష్ణుకుండినులు, చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెప్తున్నది.

ఆదివాసీల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుడిని బావగా పిలుచుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు.

మహాశివరాత్రి రోజున పూర్వంనుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కల్యాణంచేసే పద్ధతి నేటికీ కొనసాగుతున్నది

పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకుని పూజలు చేసారని చరిత్ర చెబుతుంది.

శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు

శ్రీశైల మల్లికార్జునుడి గర్భాలయానికి ముందు మండపాన్ని విజయ నగర చక్రవర్తి రెండవ హరి హర రాయలు 1405 లో నిర్మించాడు. ఈ మండపం లోపల ఒక వైపు రత్న గణ పతి ,రెండవ వైపు హద్ర కాళి ,వీర భద్ర విగ్రహాలున్నాయి. నంది మండపంను కాకతియ ప్రతాప రుద్ర చక్ర వర్తి కట్టించినట్లు కధనం గిద్దెడు సెనగలు బసవన్న మూతికి కడితే భక్తుల కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.

శక్తిమంతమైన పంచాక్షరీ నామాన్ని అడుగడుగునా స్మరిస్తూ, భక్తులు చేసే శ్రీశైల యాత్ర, వేద దర్శనంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.
.

……
ఓం నమః శివాయ ??

☘️☘️☘️☘️☘️☘️