DailyDose

TNI నేటి తాజా వార్తలు 28-Nov-2021

TNI నేటి తాజా వార్తలు 28-Nov-2021

* బర్డ్ కు మరో ఆధునిక సాంకేతిక మణి హారం.

అధునాతన రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ విరాళం.

అదనపు ఈవో,ఆసుపత్రి ఎండి శ్రీ ధర్మారెడ్డి కి అందజేసిన దాత వెంకటేష్.

* ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందిస్తున్న బర్డ్ ఆసుపత్రికి ఆదివారం అత్యాధునిక రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ విరాళంగా అందింది.

హైదరాబాద్ సనత్ నగర్ లోని ఆర్ ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత శ్రీ వెంకటేష్ దంపతులు రూ 1 కోటి 30 లక్షల విలువయ్యే డిజిటల్ ఎక్స్ రే యంత్రాన్ని టీటీడీ అదనపు ఈవో, ఆసుపత్రి ఎండి శ్రీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్బంగా అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి దాత శ్రీ వెంకటేష్ ను సన్మానించారు. దాత చేతుల మీదుగా ఎక్స్ రే యంత్రాన్ని ప్రారంభింపజేశారు. డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్, ఎఈవో శ్రీ పార్థసారథి, రేడియాలజి ఇంచార్జ్ శ్రీ మునిరత్నం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* రోగికి ఇబ్బంది లేకుండా ఎక్స్ రే

రాయలసీమలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యంత్రం వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్స్ రే తీసే సదుపాయం లభిస్తుంది. రోగిని అటు, ఇటు కదిపి నొప్పి వచ్చే ట్లు చేయకుండా టేబుల్ నే ఏ విధంగా కావాల్సి ఉంటే అలా తిప్పుకుని సులువుగా ఎక్స్ రే తీయొచ్చు. ఎక్స్ రే హై క్వాలిటీ తో వస్తుంది ఒక నిముషంలోనే రోగికి, అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్ వాట్స్ యాప్ కు ఎక్స్ రే వెళుతుంది. ఒక కాపీ ఆసుపత్రి రికార్డులో భద్ర మవుతుంది. ఇందుకోసం క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నందు వల్ల రోగి ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా ఎప్పుడైనా ఎక్స్ రే చూసుకోవచ్చు. ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి మార్గదర్శనంలో మొన్న సువర్ణ సాఫ్ట్వేర్, ఇవాళ అధునాతన ఎక్స్ రే ప్రారంభించామని, త్వరలో ఆధునిక సిటి మిషన్ ప్రారంభిస్తామని, మరిన్ని ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చుకుని రోగులకు వేగంగా, నాణ్యమైన సేవలు అందిస్తామని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి తెలిపారు.

———————————————— టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

* విశాఖ…

విశాఖ టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన.

ఎన్టీఆర్ స్కూల్ లో బుద్ధి జ్ఞానం నేర్పబడును అనే ఆలోచన ద్వారా నిరసన .

కొడాలి నాని,అంబటి, వల్లభనేని వంశీ ,సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ల మాస్క్ రూపంలో నిరసన.

దేవాలయం లాంటి అసెంబ్లీ లో అసభ్య పదజాలం వాడటం , వ్యక్తి గత దూషణ లు,భూతులు మాట్లాడుతూ న్నారు.

ప్రజాస్వామ్య లో మార్గదర్శకంగా ఉండ వాల్సిన నేతలు భూతుల మాట్లాడుతూ న్నారు.

ఇప్పటి కైనా ఈ వైసీపీ నేతలకు మార్పు రావాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.

విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మి, బోయి రమాదేవి,పల్లా ఉమారాణి, లక్ష్మీ లావణ్య, రమణమ్మ, సమ్మిడి ఉమా, గోడి అరుణ, నూరి, మంగమ్మ, కుమారి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.

* న్యూఢిల్లీ :

పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనలేదు.

ప్రభుత్వంవైపు నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు.

* అమరావతి :

గుంటూరు జిల్లా, తెనాలి డీఎస్పీ సీసీ సెల్‌ఫోన్ చోరీ.

తెనాలి డీఎస్పీ సీసీ సెల్‌ఫోన్ చోరీకి గురైంది.

కఠెవరంలో ఇద్దరు యువకులు అడ్రస్ అడుగుతూ ఫోన్ లాక్కెళ్లారు.

పట్టుకునేందుకు ప్రయత్నించినా ఆగంతకులు దొరకలేదు.

దీంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సివిల్ డ్రెస్ లో ఉన్న అధికారి వద్ద లాక్కొని వెళ్లిన సెల్ ఫోన్లు నిందితులను వెంటనే అరెస్టు చేసి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

* న్యూఢిల్లీ: 

కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ మన దేశంలోకి విస్తరించి, మరో వేవ్​కు దారి తీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఒమిక్రాన్​ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి.

* మహారాష్ట్ర

విదేశాల నుంచి మహారాష్ట్రలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ వేయించుకోవాలని లేదా 72 గంటల ముందు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉండాలని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అప్రమత్తమైన దేశ రాజధాని

బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ అనిల్ బైజాల్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకూండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టాలని.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన దేశాల నుంచి భారత్‌కు విమానాలను నిలిపివేయాలని ప్రధానికి కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు.

విదేశీ ప్రయాణికుల విషయంలో గుజరాత్ ప్రభుత్వం కొత్త ఆంక్షలను ప్రకటించింది. యూరప్‌, బ్రిటన్​, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ , బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ నుంచి గుజరాత్​లోకి వచ్చేవారు పూర్తి స్థాయి కరోనా టీకా తీసుకోనట్లైతే.. విమానాశ్రయాల్లో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. పూర్తి స్థాయి టీకా తీసుకున్నవారికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేసి, ఎలాంటి లక్షణాలు లేకపోతేనే.. రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పింది.

* ఆర్​టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం ఉంటేనే కర్ణాటకలోకి

కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్​టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం చూపిస్తేనే తమ రాష్ట్రంలోకి అనుమితిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 16 రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన విద్యార్థులు.. మరోసారి ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్​లో పని చేసే వారంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై తెలిపారు. 

* విమానాశ్రయాల్లో నిఘా పెంచాం: కేరళ

విదేశాల్లో కరోనా కొత్త వేరియంట్​ వ్యాప్తి దృష్ట్యా కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా పెంచామని చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, అందరూ టీకా తీసుకోవాలని ఆమె కోరారు.

* విజయవాడ: 

ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.

రెవెన్యూ భవన్‌లో అమరావతి జేఏసీ, ఏపీఎన్జీవో భవన్‌లో ఎన్జీవో జేఏసీ కార్యవర్గ సభ్యులు విడివిడిగా భేటీ అయ్యారు.

పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ తదితర డిమాండ్లతో పాటు వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

పీఆర్సీపై ఇప్పటికే డెడ్‌లైన్ విధించిన ఏపీ జేఏసీ నేతలు  సమావేశం ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

* సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.

జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహం ఇస్తామని పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.

ఈ ప్రకటన నమ్మిన ప్రజలు చాలా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారని, 9 నెలలు గడిచినా రూపాయి కూడా అందలేదని గుర్తుచేశారు.

నగదు ప్రోత్సాహకం కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని కోరారు.

గ్రామాల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పల్లెలకు ఫలితం దక్కడం లేదని విమర్శించారు.

* నరసరావుపేట

పల్నాడులో వైసిపి దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలకు టిడిపి నేతల పరామర్శ.

అమూల్య నర్సింగ్ ఆసుపత్రి లో సైదా ను పరామర్శించిన టిడిపి నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, డా౹౹చదలవాడ అరవింద బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, సింహాద్రి యాదవ్,టీడీపీ నేతలు.

ఇటీవలే పిడుగురాళ్ల జాతీయ రహాదారి పై టిడిపి కార్యకర్త సైదా పై వైసిపి శ్రేణులు దాడి.

సైదా కుటుంబానికి టిడిపి తరుపున 50 వేలు ఆర్థిక సాయం అందజేసిన నేతలు.

దాడులుకు పాల్పడే వైసిపి నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక.

అనంతరం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

గంగపట్నం గ్రామంలో కేంద్ర బృందం సభ్యులు దెబ్బతిన్న పంచాయతీరాజ్ ఆర్అండ్బి రహదారులను, చెరువును, ఇసుక మేట వేసిన వరి పొలాలను పరిశీలించారు.

రైతులు ఉజ్వల కృష్ణ చైతన్య పంట నష్టం వివరాలను కేంద్ర బృందం సభ్యులకు తెలిపారు. అనంతరం ముదివర్తి పాలెం గ్రామానికి బయల్దేరి వెళ్లారు.

* శ్రీనివాసరావు, తెలంగాణ హెల్త్ డైరెక్టర్

కొత్త వేరియంట్ పై అప్రమత్తమయ్యాం గుంగుంపులుగా ఉండొద్దు.

జనాలు జాగ్రత్తగా ఉండాలి మాస్క్ తప్పనిసరిగా వాడాలి భౌతిక దూరం పాటించాలి.

కేసులు తగ్గాయని జనాల్లో నిర్లక్ష్యం వచ్చింది.

కానీ మరోసారి అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చింది.

ఒమిక్రాన్ వైరస్ కొన్నిదేశాల్లో మాత్రమే వ్యాపిస్తోంది.

విదేశాల నుంచి వస్తున్న వారి నుంచి కొత్త మ్యుటేషన్ మన దగ్గర ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.

కోవిడ్ ప్రభావం తగ్గింది కానీ కనుమరుగు కాలేదు.

ప్రభుత్వం తరఫు నుంచి సిద్ధంగా ఉన్నాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కొత్త వేరియంట్ లక్షణాలు కూడా సేమ్ ఉంటాయి.

డెల్టా వేరియంట్ కంటే 30 శాతం తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

థర్డ్ వేవ్ లో కేవలం చిన్నపిల్లలకు సోకుతుంది అనే అపోహ వీడండి.

పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలకు కరోనా సోకుతుంది కానీ తీవ్రత ఎక్కువగా ఉండదు.

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా జరగలేదు.

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగింపు.

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా డిసెంబరు 1వ తేదీ నుండి 2022 మే 31 వరకూ పొడిగించింది. 1985 వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన డా.శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఎస్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాల్సిందిగా ఈనెల 2న కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయడం జరిగింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సిఎస్ పదవీకాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ (డిఓపిటి)అండర్ సెక్రటరీ కులదీప్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆదేశాలు జారీచేశారు.

* భారీ వర్షాలు, ఎడతెరిపిలేని వర్షం నేపథ్యంలో ది.29-11-2021, సోమవారం అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా పాదయాత్ర (మహా పాదయాత్ర) కు విరామ దినముగా ప్రకటించటమైనది. ప్రజా పాదయాత్ర తిరిగి ది.30-11-2021, మంగళవారం ఉదయం 8:30 లకు నెల్లూరు జిల్లా, అంబాపురం గ్రామము లోని శాలివాహన ఫంక్షన్ హాల్ నుండి పునఃప్రారంభం అవును. దయచేసి అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ భాగస్వాములు అందరూ గమనించవలసినదిగా ప్రార్థన.
ఇట్లు
కన్వీనర్,
అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జె.ఏ. సి).

* ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు – ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడపకు ఆరెంజ్ అలర్ట్ – భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం – భారీ వర్షాలతో రేపు చిత్తూరు, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవు – గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు – కడప జిల్లా కోడూరు, చిట్వేల్ మండలాల్లో వర్షం – అనుంపల్లి వద్ద పొంగిపొర్లుతున్న వాగులు – చిట్వేలి, రాపూర్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు – జమ్మలమడుగులో ఓ మోస్తరు వర్షం – రాయచోటిలో ఉదయం నంచి కురుస్తున్న వర్షం – అనంతపురం పుట్టపర్తి, తాడిపత్రిలో వర్షం – ప్రకాశం జిల్లా కంభం, బెస్తవారిపేట, అర్ధవీడులో కురిసిన వాన – చీరాలలో చిరుజల్లులు – నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపిలేని వర్షం – పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం – పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు – అనంతసాగరం ఎస్సీ కాలనీలోకి చేరిన వరద.

* శబరిమల యాత్రకు వెళ్లే చిన్నారులకు కేరళ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్లే పిల్లలకు ఆర్‌టీ పీసీఆర్ (RT-PCR) పరీక్ష తప్పనిసరి కాదని తెలిపింది.

శబరిమల దర్శనానికి వెళ్లే బాల యాత్రికుల విషయంలో నెలకొన్న చిన్నపాటి గందరగోళానికి తెరదించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పిల్లల విషయంలో వారి వెంట వచ్చే పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆర్టీ-పీసీఆర్‌ లేకుండానే చిన్నారులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కేరళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. అయితే పిల్లలతో పాటు వచ్చే పెద్దలు..శానిటైజర్ ఉపయోగించడం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం.. వంటి కోవిడ్ నిబంధనలకు పాటించేలా చూసుకోవాలని తెలిపింది. పిల్లల ఆరోగ్య సమస్యలకు పెద్దలు జవాబుదారీగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

శబరిమల మకరవిళక్కు పండుగ 2021-22 సజావుగా సాగడానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, కోవిడ్ నియంత్రణపై రాష్ట్ర ప్రోటోకాల్‌కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శబరిమలకు వచ్చే యాత్రికులు, సిబ్బందికి తప్పనిసరిగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా 72 గంటల ముందు ఆర్​టీపీసీఆర్​ నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఆ ఉత్తర్వుల్లో పిల్లల గురించి ప్రస్తావించలేదు. దీంతో శబరిమల యాత్రకు వచ్చే పిల్లల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

ఇక అయ్యప్ప దీక్షలు ధరించిన భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా నవంబర్ 16న శబరిమల ఆలయాన్ని తెరిచిన సంగతి తెలిసిందే. స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం రెండు నెలల పాటు ఆలయం తెరిచే ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే రోజుకు 30 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.