DailyDose

TNI నేటి తాజా వార్తలు 29-Nov-2021

TNI నేటి తాజా వార్తలు 29-Nov-2021

* ?️?️?️?️?️?️

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

29-11-21
సోమవారం

?️ నిన్న 28-11-2021 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 24,608.

?️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 11,050.

?️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.20 కోట్లు.

?సర్వేజనాః సుఖినోభవంతు ?

* విశాఖ బ్రేకింగ్

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.

మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ కు వర్షాలు.

రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం.

మరింత బలపడే అవకాశం.

పశ్చిమ వాయువ్య దిశగా పయనించనున్న అల్పపీడనం.

తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని అంచనా.

డిసెంబర్ 3రాత్రి నుండి ఉత్తర కోస్తా, ఒడిశా లో వర్షాలు.

* వెంకన్న పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనది: స్వరూపానందేంద్రస్వామి

డాలర్ శేషాద్రి: వెంకన్న పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనది: స్వరూపానందేంద్రస్వామి.

విశాఖ: తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మరణం తనను కలచివేసిందని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. నిత్యం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనదని చెప్పారు. వెంకన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ డాలర్‌ శేషాద్రి సుపరిచితులన్నారు. ఆయన ఆప్యాయతను పొందినవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు. డాలర్‌ శేషాద్రితో విశాఖ శారదా పీఠానికి సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. ఆయన మహావిష్ణువు హృదయంలో చేరాలని ఆశిస్తున్నట్లు స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు.

* భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు త్వరితగతిన సహాయం అందించి భాధితులకు వీలైనంత ఎక్కువ సేవ చేయాలని తపన పడే ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

సోమవారం ఉదయం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరదల వల్ల దెబ్బతిన్న నాలుగు జిల్లాల కలెక్టర్స్ తో ముఖ్యమంత్రి సమావేశమై ఇప్పటివరకు తీసుకున్న సహాయ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బీభత్సం సృష్టించి వారం రోజులు దాటకముందే , గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్యూమరేషన్ పూర్తి చేసి, బాధితులకు నష్ట పరిహారం అందించిన తొలి ప్రభుత్వం తమదని తెలిపారు. గతంలో వరద బాధితులకు బియ్యం కందిపప్పు ఇస్తే సరిపోతుందని భావించే వారని, ఇప్పుడు నిత్యావసర సరుకులతోపాటు గా ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వేల రూపాయల నగదు అదనంగా అందజేశామని తెలిపారు. అదేవిధంగా అధిక వర్షపాతం నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క నీటి బొట్టు ని ఒడిసి పట్టుకొని రాబోవు వేసవికాలంలో మంచి నీటి కొరత రాకుండా ఇప్పటి నుండే జల సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్యాస్ కేడింగ్ స్టోరేజ్ సిస్టం ,కెనాల్ స్టోరేజ్ సిస్టం ద్వారా నీటి నిల్వలు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నష్ట పరిహారం అందించిన గ్రామాల్లో సోషల్ ఆడిట్ తప్పకుండా చేయాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లోని శంకరన్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పాల్గొని శాఖల వారీగా ఇప్పటి వరకు తీసుకున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రి కి వివరించారు. వరద ప్రభావిత 48960 కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున నగదు అందజేశామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు మరణాలు సంభవించాయని, వారి కుటుంబాలకు ఐదు లక్షల వంతున నష్ట పరిహారం అందజేశామని తెలిపారు. తీవ్రంగా దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్ల కు సంబంధించి మొత్తం 27 కు గాను 15 రోడ్లు పునరుద్ధరించామని మిగతావి రాబోయే వారం రోజుల్లో చేపడతామని , అలాగే ఆర్ అండ్ బి రోడ్లు కు సంబంధించి మొత్తం 24 కు గాను 22 రోడ్లు పునరుద్ధరించడం జరిగిందని తెలియజేశారు. జిల్లాలో ఇప్పటికీ భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నందున మరమ్మత్తు పనులకు ఆటంకం కనుగుతోందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ హరిందర్ ప్రసాద్ పాల్గొన్నారు.

* ఆ 6 జిల్లాల పై వైద్యరోగ్య శాఖ దృష్టి పెట్టాలి:కేబినెట్ సమావేశంలో సియం కేసీఆర్

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ సమీక్షించాలి. మందులు, టీకాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి. మంత్రులంతా జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితులపై సమీక్షించాలి. అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలి. ఆరు జిల్లాలపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆదిలాబాద్‌, కుమరం భీం, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొవిడ్‌ పరీక్షలు ఎక్కువగా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలి” అని వైద్యారోగ్య శాఖ అధికారులు, మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

* న్యూఢిల్లీ:-

సోమవారం ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో అందరి చూపు సాగు చట్టాల రద్దుపైనే ఉండనుంది.

మూడు వివాదాస్పద చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ మేరకు బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

సమావేశాల తొలిరోజే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ‘కొంతమంది’ రైతులు మాత్రమే నిరసనలు తెలుపుతున్నారని.. అయినప్పటికీ అందరిని దృష్టిలో ఉంచుకొని రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం బిల్లులో పేర్కొంది.

తొలిరోజు పార్లమెంట్​ సమావేశాలకు తప్పక హాజరు కావాలని భాజపా, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. విపక్ష పార్టీలన్నీ ఈ బిల్లుకు మద్దతు తెలపడం లాంఛనమే కానుంది!

అయితే, రైతుల సమస్యలపై విపక్షాలు వెనక్కి తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఎంఎస్​పీకి చట్టబద్ధత కల్పించే విషయమై.. మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో దాదాపు అన్ని పార్టీలూ దీనిపై మాట్లాడాయి.

▪️ సమావేశాల్లో కనీస మద్దతు ధరపై చర్చ జరపాల్సిందేనని డిమాండ్ చేశాయి. దీంతో పాటు సాగు చట్టాల ఉద్యమంలో అమరులైన రైతులకు పరిహారం అందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

▪️ పెగసస్​ వ్యవహారం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లపై సభలో చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి.

▪️ బంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం నియంత్రణ పరిధిని పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీటిపై పార్లమెంట్​లో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది.

▪️ సాగు చట్టాల రద్దు బిల్లు కాకుండా మరో 25 ముసాయిదా చట్టాలను పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది కేంద్రం.

▪️ ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే బిల్లు సైతం ఈ భేటీలో ఉభయ సభల ముందుకు రానుంది. ఈ బిల్లుతో ఆర్​బీఐ తన అధికారిక డిజిటల్ కరెన్సీ రూపొందించే వీలు కలుగుతుంది.

▪️ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు-2019పై సంయుక్త పార్లమెంట్ కమిటీ ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ముందుకు రానుంది. బిల్లుతో పాటు కమిటీ ఇచ్చిన నివేదికపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. 2019లోనే దీన్ని పార్లమెంట్​లో ప్రవేశపెట్టగా. విపక్షాల డిమాండ్​తో సంయుక్త కమిటీకి సిఫార్సు చేశారు.

▪️ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్​స్టాన్సెస్ చట్ట సవరణ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సవరణ బిల్లు, దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్​మెంట్ సవరణ బిల్లు సైతం పార్లమెంట్ ముందుకు రానుంది. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడగించేందుకు పై రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇప్పటికే వీటిపై ఆర్డినెన్సులు జారీ చేసింది.

రాజకీయపరమైన బిల్లులు సైతం ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు రానున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​, త్రిపుర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ జాబితాను సవరించే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.

కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు బిల్లులు.

▪️ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతన సవరణ బిల్లు 2021.

▪️ దివాలా రెండో సవరణ బిల్లు.

▪️ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్​మెంట్ అథారిటీ సవరణ బిల్లు.

▪️ 1983 నాటి ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో 2021 ఇమ్మిగ్రేషన్ బిల్లు.

▪️ నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు 2021.

▪️ మనుషుల అక్రమ రవాణా నిరోధక, రక్షణ, పునరావాస బిల్లు 2021.

సమావేశాల్లో స్పీకర్, ఛైర్మన్ అనుమతించిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉభయ సభలు సజావుగా జరిగేలా సహకరించాలని విపక్షాలను కోరింది.

* అప్డేట్:

తాడేపల్లి సిఎం నివాసం సమీపంలోని పార్కింగ్ స్థలంలో గోశాల ఏర్పాటు.

తిరుపతి నుండి ఆరు గోవులను తీసుకువచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.

సిఎం జగన్ సతీమణి భారతి గోవులకు పూజచేసి గోశాలకు తరలించినట్టు అనధికారిక సమాచారం .

సడన్ గా గోశాల ఏర్పాటుపై వైపిపి నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో చర్చ.

* లోక్ సభ లో టిఆర్ఎస్ ఎంపీలు ఆందోళన స్వీకర్ పోడియం వద్ద నినాదాలు న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో తొలి రోజే రభస మొదలైంది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. కానీ ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు సభలో నిరసన చేపట్టారు. లోక్‌సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.

* ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బిర్లా సభను వాయిదా వేశారు.

* అనంతపురం:

✓ చరిత్రలో తొలిసారిగా పీఏబీఆర్ డ్యాం గేట్లు ఎత్తివేత.

✓ డ్యాం నిర్మాణమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గేట్లు ఎత్తిన సందర్భాలు నిల్.

✓ ఓ వైపు పేరూర్ డ్యాం నుంచి మరోవైపు హెచ్చెల్సీ నుంచి నీరు రాక.

✓ జీడిపల్లి జలాశాయం నుంచి పీఏబిఆర్ కు పెద్ద ఎత్తను నీరు.

✓ భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగా రెండు గేట్లు ఎత్తిన అధికారులు.

✓ 1000 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు విడుదల.

✓ తొలిసారిగా గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున తరలివస్తున్న సందర్శకులు.