DailyDose

TNI నేటి నేర వార్తలు 30-Nov-2021

TNI నేటి నేర వార్తలు 30-Nov-2021

* డిసెంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను నేరుగా మన ఆంధ్రప్రదేశ్ వైపుగా రానుంది. ఇది బలహీనమైనది అయితే దక్షిణ కోస్తాంధ్రను తాకుతుంది, బలంగా ఉంటే మచిలీపట్నం నుంచి ఒడిషాను తాకుతుంది. మరీ బలంగా ఉంటే బంగ్లాదేశ్ వెల్తుంది.

ఎలా చూసినా మన రాష్ట్రం మీద ప్రభావం మాత్రం ఉంటుంది.

ఎందుకంటే బలహీనమైనది అయితే ఉత్తర తమిళనాడు లేదా దక్షిణ ఆంధ్ర నెల్లూరు/ప్రకాశం జిల్లాలను తాకుతుంది. దీని వల్ల భారీ వర్షాలు రాయలసీమ దాక విస్తరిస్తాయి, గోదావరి జిల్లాల వరకు వర్షాలు పడూతాయి.

అలా కాకుండా బలమైనది అయితే వర్షలతో పాటు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం దాక ఎక్కువ ప్రభావం ఉంటుంది. నష్టాన్ని కూడ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది.

మరీ బలంగా ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వచ్చి బంగ్లాదేశ్ కి వెల్తుంది. దీని వల్ల కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ప్రభవం ఉంటుంది. ఎలా జరిగితే నష్టం కాస్తంత తక్కువగా ఉంటుంది.

రేపు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. కాబట్టి రేపు మరొక్కసారి ఈ తుఫాను గురించి మాట్లాడుతాం.

ఈ రోజు మన ఏపి వాతావరణం

ఈ రోజు కూడ నెల్లూరు, దక్షిణ ప్రకాశం, కడప​, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వర్షాలుంటాయి. మధ్యాహ్నం/సాయంకాలం సమయంలో ఎక్కువగా వర్షాలు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తర ప్రకాశం జిల్లాల్లో తక్కువగా వర్షాలు.

* అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన నక్క ప్రశాంతి (16) మృతదేహానికి ఒంగోలు రిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం పోస్ట్ మార్టం.

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండల కేంద్రంలో తల్లి, ఆమె సహజీవనం చేస్తున్న శ్రీకాంత్ చేతిలో హత్యకు గురై అనంతరం దహనం చేయబడిన ప్రశాంతి మృతదేహానికి వైద్యుల బృందం శవపరీక్ష నిర్వహించారు. తల్లి మాధవి,ఆమె ప్రియుడు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో ప్రశాంతి మృత దేహాన్ని పెట్రోల్,డీజిల్ పోసి మూడు సార్లు కాల్చివేశారు.

పోలీసులకు ఎటువంటి ఆనవాళ్లు కనిపించకుండా దహనం చేయగా మిగిలిన ఎముకలను పూడ్చి వేశారు. సోమవారం వైద్యుల బృందం ప్రశాంతిని పూడ్చి వేసిన ప్రదేశంలో త్రవ్వకాలు చేయగా కేవలం కొద్దిపాటి ఎముకలు మాత్రమే కనిపించాయి. మృతదేహాన్ని పూర్తి ఎముకలు కాలిపోయేంతవరకు కాల్చి వేసినట్లు పోలీసులు,గుర్తించారు.

ఫోరెన్సిక్ వైద్యుల బృందం దొరికిన కొద్దిపాటి ఎముకల అవశేషాలను పరీక్షల నిమిత్తం తరలించారు. దీనిపై పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఫోరెన్సిక్ నిపుణుల బృందం నివేదిక ఆధారంగా మరింత లోతుగా ప్రశాంతి కేసును చేధించగలమని అంన్నారు. అలాగే శ్రీకాంత్ తల్లిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు.

* విజయవాడ: ఎన్టీఆర్‌ వర్సిటీ నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పందించారు. విశ్వవిద్యాలయాల నిధుల జోలికి వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ వెళ్లలేదని, ఇకమీదట కూడా వెళ్లదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే వర్సిటీ నిధులను వినియోగించుకుందని ఆరోపించారు. తమ ప్రభుత్వ కార్యాకలాపాలపై పనిగట్టుకొని ఆరోపణలు చేయడమే పనిగా ప్రతిపక్షలు వ్యవహరిస్తున్నాయని మంత్రి సురేశ్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్జీఆర్‌ వర్సిటీ పరిణామాలపై గవర్నర్‌కు నివేదిస్తామని ఐకాస కన్వీనర్‌ వెంకటనారాయణ వెల్లడించారు.

* వైసీపీ రెండున్నరేళ్ల పాలన లో దౌర్జన్యాలు అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యం:అచ్చెన్న అమరావతి: వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ మహిళా సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మహిళా హోంమంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారం ఉందని మహిళల పట్ల బరితెగించి వ్యవహరిస్తున్న వారికి రాబోయే రోజుల్లో మహిళల చేతిలో బడితెపూజ ఖాయమన్నారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఇక వారి అరాచకాలు సాగవని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్న విషయం వైసీపీ గుర్తుంచుకోవాలన్నారు. మళ్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడ్డవారిని, దాడికి కారణమైనవారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

* ఏపిలో ఇకపై పాత వాహనాలకు గ్రీన్ టాక్స్

రవాణా వాహనాలు
ఏడేళ్ళు దాటితే యేటా 4 వేలు
పదేళ్ళు దాటితే యేటా 5 వేలు
పన్నెండేళ్ళు దాటితే యేటా 6 వేలు చొప్పున గ్రీన్ టాక్స్ వసూలు చేయనున్నారు.

మోటర్ సైకిలు
పదిహేనేళ్ళు దాటితే రెండు వేలు
ఇరవైయేళ్ళు దాటితే అయిదు వేలు.

కార్లు జీపులు వగైరా
పదిహేనేళ్ళు దాటితే ఐదు వేలు
ఇరవైయేళ్ళు దాటితే పదివేలు
వసూలు చేయనున్నారు.

కొత్త వాహనాల కొనుగోనులుపై

యాభై వేల రూపాయిల పైబడిన బైకులపై 9 నుండి 13 శాతం
20 లక్షలకు మించి వాహనాలపై 12 నుండి 18 శాతం పన్ను పెంచి వసూలు చేయనున్నారు?

* జగన్ రెండున్నర ఏళ్ల పాలనలో సాధించింది శూన్యం!

రాష్ట్రంలో అధికారం చేపట్టి జగన్ రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. ప్రజలు ఎంతో అభివృద్ధి జరుగుతుందనుకున్నకలలు కల్లలయ్యాయని నూతనంగా కార్యదర్శిగా ఎన్నికైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి డి హరినాథ్ విమర్శించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగ దోడటమే లక్ష్యంగా విలువైన పాలనా కాలాన్ని వృధా చేశారన్నారు. అనాలోచితంగా ,ఆవేశంగా తీసుకొని నిర్ణయాల వల్ల హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు ప్రతికూల తీర్పులు ఎదురయ్యాయి. విద్యార్థులు, యువకులకు, ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల సాధన కోసం నిరసనలతో ఉద్యమాల బాటపట్టారు.

నవరత్నాల పేరుతో జనాకర్షణ పథకాలను ప్రారంభించి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఆపథకాల కోసం రెండున్నరేళ్ల లోనే మూడు లక్షల కోట్ల అప్పు ప్రజల నెత్తినవేశారు. కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తెస్తానని చెప్పిన మాటలు, నీటి మీదరాతలా మిగిలిపోయాయి. అమరావతి రాజధాని విషయంలో, తొందరపడితీసుకున్న అస్పష్ట వైఖరి 3 రాజధానుల నిర్ణయాన్నివెనక్కి తీసుకోవటం ద్వారా ఆయన బలహీనత స్పష్టమైంది. శాసన మండలి రద్దు విషయంలోనూ కేంద్రాన్ని ఒప్పించలేక పోయారని ,మాట మార్చను మడం తిప్పనని చెప్పే జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాల తానే మార్చుకోవటం ద్వారా అపఖ్యాతి పాలయ్యాడు.

32 మంది అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు పోస్కోకు అప్పగించడానికి కేంద్రం చేస్తున్న కుట్రలను ఎదిరించటం లో చిత్తశుద్ధి లేదు. గంగవరం పోర్టు సైతం కార్పొరేట్లకు అప్పగించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా దోపిడీకి బాహాటంగా ద్వారాలు తెరిచారు. మద్యపాన నిషేధం ఊసేమర్చిపోయారు. చెత్త మీద కూడా పన్ను విధించి ప్రజల నడ్డి విరిచారు. రాష్ట్రంలో ప్రజలు అతివృష్టితో, అనావృష్టితో రాయలసీమనుండి ఉత్తరాంధ్ర వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కక్షలు కార్పణ్యాలతో శాసనసభలో దూషణ పర్వాలు, ప్రతిపక్ష నాయకుల కుటుంబాలపై అసభ్యకరమైన భాషలతో దాడులు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించి, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం కృషి చేయాలని ,లేనియెడల ప్రజలు నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హరినాథ్ హెచ్చరించారు.

* విజయవాడ: ఎన్టీఆర్‌ వర్సిటీ నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పందించారు. విశ్వవిద్యాలయాల నిధుల జోలికి వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ వెళ్లలేదని, ఇకమీదట కూడా వెళ్లదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే వర్సిటీ నిధులను వినియోగించుకుందని ఆరోపించారు. తమ ప్రభుత్వ కార్యాకలాపాలపై పనిగట్టుకొని ఆరోపణలు చేయడమే పనిగా ప్రతిపక్షలు వ్యవహరిస్తున్నాయని మంత్రి సురేశ్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్జీఆర్‌ వర్సిటీ పరిణామాలపై గవర్నర్‌కు నివేదిస్తామని ఐకాస కన్వీనర్‌ వెంకటనారాయణ వెల్లడించారు.

* కొండపల్లి

కాల్ మని వేధింపులు తాళలేక వీఆర్వో గౌస్ ఆత్మహత్య.

ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ గా గుర్తింపు.

ప్రస్తుతం కొండపల్లి గ్రామ విఆర్వోగా విధులు నిర్వహిస్తున్న గౌస్.

వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పు చేసిన గౌస్.

వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు సృష్టించిన కాల్ మని మాఫియా.

చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని ఆత్మహత్య.

వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల పోలీసులకు విజ్ఞప్తి.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.