DailyDose

TNI నేటి తాజా వార్తలు 30-Nov-2021

TNI నేటి తాజా వార్తలు 30-Nov-2021

* తిరుపతి….శ్రీవారికి అత్యంత ప్రితీ పాత్రమైన శేషాద్రి స్వామి ఇక లేరు అన్నది నమ్మలేకపోతున్నా…సిజేఐ ఎన్వీ రమణ.

శేషాద్రి స్వామితో 25 సంవత్సరాల అనుభంధం వుంది.

ఆయన మరణించడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.

ఆయన లేకుండా తిరుమలకు రావడం ఉహించలేనిది.

దేవుణి సేవలో తరిస్తూ …ఆరోగ్యాన్ని కూడా విస్మరించారు.

ఆయన కోరిక మేరకు శ్రీవారి సేవలో వుండగానే చివరి శ్వాస విడిచారు.

శేషాద్రి స్వామి రచించిన పుస్తకాలను టిటిడి ముద్రించి భక్తులుకు అందుబాటులో తీసుకురావాలి.

* డిసెంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను నేరుగా మన ఆంధ్రప్రదేశ్ వైపుగా రానుంది. ఇది బలహీనమైనది అయితే దక్షిణ కోస్తాంధ్రను తాకుతుంది, బలంగా ఉంటే మచిలీపట్నం నుంచి ఒడిషాను తాకుతుంది. మరీ బలంగా ఉంటే బంగ్లాదేశ్ వెల్తుంది.

ఎలా చూసినా మన రాష్ట్రం మీద ప్రభావం మాత్రం ఉంటుంది.

ఎందుకంటే బలహీనమైనది అయితే ఉత్తర తమిళనాడు లేదా దక్షిణ ఆంధ్ర నెల్లూరు/ప్రకాశం జిల్లాలను తాకుతుంది. దీని వల్ల భారీ వర్షాలు రాయలసీమ దాక విస్తరిస్తాయి, గోదావరి జిల్లాల వరకు వర్షాలు పడూతాయి.

అలా కాకుండా బలమైనది అయితే వర్షలతో పాటు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం దాక ఎక్కువ ప్రభావం ఉంటుంది. నష్టాన్ని కూడ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది.

మరీ బలంగా ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వచ్చి బంగ్లాదేశ్ కి వెల్తుంది. దీని వల్ల కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ప్రభవం ఉంటుంది. ఎలా జరిగితే నష్టం కాస్తంత తక్కువగా ఉంటుంది.

రేపు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. కాబట్టి రేపు మరొక్కసారి ఈ తుఫాను గురించి మాట్లాడుతాం.

ఈ రోజు మన ఏపి వాతావరణం

ఈ రోజు కూడ నెల్లూరు, దక్షిణ ప్రకాశం, కడప​, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వర్షాలుంటాయి. మధ్యాహ్నం/సాయంకాలం సమయంలో ఎక్కువగా వర్షాలు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తర ప్రకాశం జిల్లాల్లో తక్కువగా వర్షాలు.

* అమరావతి

జగనన్న విద్యా దీవెన – పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌

ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ, ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను నేడే (30.11.2021, మంగళవారం) సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

జగనన్న విద్యా దీవెన

దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే (మూడు నెలలు) విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా.

తల్లులు ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్ళి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు.

కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతాయి
కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉన్నత విద్య చదివే అవకాశం, అందరికీ వర్తింపు, తద్వారా అన్ని విధాల స్ధిరపడనున్న కుటుంబాలు.

జగనన్న విద్యా దీవెన – మొదటి విడత – 19 ఏప్రిల్‌ 2021.

రెండో విడత – 29 జులై 2021, మూడవ విడత – 30 నవంబర్‌ 2021, నాలుగవ విడత – ఫిబ్రవరి 2022.

గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్లు బకాయిలతో కలిపి ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.6,259 కోట్లు. కరోనా సమయంలో కూడా అంతరాయం లేకుండా ఫీజుల చెల్లింపు

విద్యారంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన వ్యయం – మొత్తం లబ్దిదారులు – 1,99,38,694, లబ్ది రూ.కోట్లలో 34,622.17.

* తన కుమార్తె శ్రిష్టి వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,శ్రీమతి వైఎస్ భారతి దంపతులను ఆహ్వానించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ,శ్రీమతి విజయ లక్ష్మీ గారు, ఆదిమూలపు విశాల్.

* విజయవాడ బస్టాండ్‌లో మళ్లీ తెరుచుకోనున్న సినిమా థియేటర్లు మినీ థియేటర్ల వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చిన ‘వై స్కీన్స్‌’ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో థియేటర్లు నిర్మించింది. కోవిడ్‌ రెండు దశల్లో థియేటర్లను మూసివేయాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత కోవిడ్‌ నుంచి కోలుకుంటూ మళ్లీ థియేటర్లు తెరుచుకుంటున్న సందర్భంలో. ప్రేక్షకులకు మళ్లీ వినోదాన్ని అందించడానికి ఆర్టీసీ బస్టాండ్‌లోని ‘వై స్క్రీన్స్‌’ థియేటర్లు సిద్ధమయ్యాయి. డిసెంబరు 2వ తేదీ నుంచి సినిమాలు ప్రదర్శించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లు తెరుస్తున్న నేపథ్యంలో. ‘వై స్క్రీన్స్‌’ యాజమాన్యం డిసెంబరు 1న(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు విలేకరులను థియేటర్లుకు ఆహ్వానిస్తోంది. విలేకరుల కోసం ప్రత్యేకంగా పెళ్లిసందడి, లవ్‌స్టోరీ సినిమాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. విలేకరులు వచ్చి సినిమాల ప్రదర్శనను ఎంజాయ్‌ చేయమని ఆహ్వానం పలుకుతోంది.