Devotional

నేటి మీ రాశి ఫలితాలు 2-Dec-2021

నేటి మీ రాశి ఫలితాలు 2-Dec-2021

?️హిందూ ధర్మం?
? శుభోదయం ?
✍? 02.12.2021 ✍?
? నేటి రాశిఫలాలు ?

? మేషం
ఈరోజు
మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
???????

? వృషభం
ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
???????

? మిధునం
ఈరోజు
ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.
???????

? కర్కాటకం
ఈరోజు
ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
???????

? సింహం
ఈరోజు
అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
???????

? కన్య
ఈరోజు
శ్రద్ధగా పని చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.
???????

⚖ తుల
ఈరోజు
అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. లక్ష్మీదేవి ఆలయ దర్శనం శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

? వృశ్చికం
ఈరోజు
ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనః స్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
???????

? ధనుస్సు
ఈరోజు
మనఃస్సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
???????

? మకరం
ఈరోజు
శుభకాలం ఉంది. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
???????

? కుంభం
ఈరోజు
శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.
???????

? మీనం
ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే మంచిది.
???????