DailyDose

ఈ ప్రముఖులను స్మరించుకుందాం

ఈ ప్రముఖులను స్మరించుకుందాం

* టి. త్రివిక్రమరావు ఒక సినీ నిర్మాత. ఈయన ఎన్. టి. ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి మొదలైన ప్రముఖ హీరోలతో జస్టిస్ చౌదరి, దొంగ, గూఢచారి నెం.1, ఘరానా దొంగ, బొబ్బిలి సింహం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ ఈయన స్థాపించిన సినీ నిర్మాణ సంస్థ. హిందీలో కూడా జితేంద్ర హీరోగా పలు సినిమాలు నిర్మించాడు.

మరణం : 2008 డిసెంబరు 03
హైదరాబాదు

* దేవానంద్ (Dev Anand)

( సెప్టెంబర్ 26, 1923 – డిసెంబర్ 3, 2011) సుప్రసిద్ధ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు.

* బందా కనకలింగేశ్వరరావు (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు.