Devotional

అశ్వమేధ యాగం వింతలు విశేషాలు

అశ్వమేధ యాగం వింతలు విశేషాలు

అశ్వమేధయాగం – బుుగ్వేదం.

అశ్వమేధయాగం గురించి వివరణలు బుుగ్వేదంలో దొరుకుతాయి.
అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం, తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృఢంగా ఉండే 15 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు.

గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ, ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సరరకాలం (కొంతమంది అర్థ సంవత్సర కాలమని చెపుతారు) యధేచ్చగా తిరగడనికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు. అశ్వము శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు.

గుర్రాన్ని ప్రతీ ఆపదల నుండి ఇబ్బందులనుండి రక్షించటానికి గుర్రానికి తోడుగా రాజ కుమారులు కాని సేనాధిపతులు గాని ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ణ యాగాదులు జరుపుతారు.

గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి మూడు గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని పఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి, మహారాణీ, తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణీ ముందు కాళ్ళను, పరిచారికలు కడుపు భాగాన్ని, వెనుక కాళ్ళను అభ్యంగనమాచరిస్తారు. అశ్వము తల, మెడ, తొకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు.

ఓడినరాజులు స్వచ్ఛందంగా కొంత సంపదను విజేతకు అందిస్తారు. గెలిచినరాజు ఎవరి రాజ్యాన్ని ఆక్రమించడు, దోచుకోడు. కేవలం ఆధిపత్య నిరూపణకే అశ్వమేధయాగం చేసేవారు.

చివరిగా యాగశాలలో బుుత్విక్కుల సన్మాణంతోను, విజిగీషుడు పొందినధనంతోను పేదసాదలకు దానధర్మం యాగం ముగుస్తుంది.

కొన్ని యాగాలలో అశ్వబలితో యాగం పరిసమాప్తమైయ్యేది.