DailyDose

TNI నేటి నేర వార్తలు 3-Dec-2021

TNI నేటి నేర వార్తలు 3-Dec-2021

* విశాఖ

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.

పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.

మరో 24గంటల్లో తుఫానుగా రూపాంతరం.

విశాఖ తీరానికి 960కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం.

గోపాలపూర్ కు 1020, పరదీప్ కు 1080 కిలోమీటర్లు దూరంలో కేందీకృతం.

రేపు ఉదయానికి ఉత్తర కోస్తా -ఒడిశా తీరాలకు సమీపించునున్న తుపాను.

అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా పయనించనున్న జవాద్ తుపాను.

నేడు, రేపు భారీ వర్షాలు.

ఏపీ లోని ఉత్తర కోస్తా, ఒడిశా లో తీరం వెంబడి 40కిలోమీటర్లు వేగంతో గాలులు.

ఈ రోజు పెరగనున్న ప్రచoడ గాలులు ఉధృతి.

* కోరిక తీర్చాలని నర్సును వేధించిన ప్రభుత్వ డాక్టర్ సస్పెండ్

నారాయణఖేడ్: వివాహిత మహిళను లైంగికంగా కోరికలు తీర్చుకునేందుకు వేధించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ కె. రమేష్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు.

డాక్టర్ నర్సింగ్ చౌహాన్ పై మీడియాలో వచ్చిన ప్రతికూల వార్తల దృష్ట్యా ఆసుపత్రిలో ట్రైనీ నర్సింగ్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి డాక్టర్ హోదాకు అపకీర్తిని కలిగించడంతో తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మేరకు సంగారెడ్డి జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ కు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పూర్తి వివరాలు సేకరించి సమర్పించాలని ఆదేశించారు.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు డాక్టర్ రామకృష్ణ రాజుకు ఇన్ చార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు అప్పగించారు.

* జిల్లా ఎస్పీ ఆదేశాలతో గుట్కా, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల కట్టడి కోసం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు అనుమానితుల, పాత నేరస్తుల ఇళ్లు మరియు దుకాణాలలో తనిఖీలు.

అనంతపురం జిల్లాలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గుట్కా, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం కోసం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాలతో అనుమానితుల, పాత నేరస్తుల ఇళ్లు, దుకాణాలు మరియు అటవీ ప్రాంతాలు, గడ్డివాములు, ఆయా పరిసరాలలో అక్రమ సారా నియంత్రణ కోసం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

* తూర్పుగోదావరి :

జగ్గంపేట

జగ్గంపేట పోలీస్టేషన్ నుంచి ముగ్గురు నిందితులు పరార్.

నిన్న సాయంత్రం గండేపల్లి మం. మల్లేపల్లి దాబా వద్ద గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు.

గండేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి విచారణ నిమిత్తం జగ్గంపేట తరలింపు.

స్టేషన్ సిబ్బంది కళ్లుగప్పి పరారయిన ముగ్గురు నిందితులు గాలిస్తోన్న పోలీసులు.

* ఎస్ బి ఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు. అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న 14మంది ఘరానా ముఠా అరెస్ట్.

ఎస్‌బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నుంచి ఎస్బిఐ బ్యాంక్ ఉద్యోగులమంటూ అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి కోట్లు దండుకుంటున్న14 మంది ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సందర్భంగా గురువారం నాడు సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. వివరాల ప్రకారం. కొందరు వ్యక్తులు ఢిల్లీ కేంద్రంగా నగరంలో ఎస్‌బిఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్నారనే పక్క సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

అనంతరం కాల్ సెంటర్‌ ఖాతాల్లోని లక్షల రూపాయల నగదు నిలుపుదల చేశారు. దేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసాన్ని ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. స్ఫూపింగ్‌ యాప్‌ ద్వారా ఎస్‌బీఐ అసలైన కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు.

ఓ ముఠా దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఎస్‌బీఐ నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కాల్‌సెంటర్‌ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి రూ.కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాల తీసుకొని క్రెడిట్‌కార్డు దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. అసలైన ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు స్ఫూఫింగ్‌ యాప్‌ వాడుతున్నారని.

ఈ యాప్‌ వాడకంలో ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సీపీ తెలిపారు. 1860 180 1290 అనే నంబరును స్ఫూపింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30సెల్‌ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు, 1 రూటర్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్.

ధనీ, లోన్‌ బజార్‌ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని. ప్రొసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారని వివరించారు. ఈ ముఠాలో 14 మందిని అరెస్టు చేసి నిందితుల వద్ద నుంచి 17 స్మార్ట్ ఫోన్లు, 20 బేసిక్ ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, 5సిమ్‌కార్డులు,3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.

సైబర్ నేరగాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్155260 కు కానీ, 100 కానీ, 9490617310 సైబరాబాద్ సైబర్ క్రైమ్ వాట్సాప్ నంబర్ కు వాట్స్అప్ చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ క్రైమ్స్ డిసిపి రోహిణి ప్రియదర్శిని, డిసిపి లావణ్య సైబర్ క్రైమ్స్, శ్రీధర్ ఏసిపి సైబర్ పాయింట్స్ తోపాటు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలుతోపాటు పలువురు పాల్గొన్నారు.

* ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్

మద్యం మత్తులో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తన

శ్రీకాకుళం జిల్లా: వంగర మండలం కొప్పరవలస ఎం.పి.యు.పి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తిరుపతి రావును సస్పెన్షన్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.మద్యం మత్తులో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల పట్ల ఆయన స్పందించారు.