DailyDose

TNI నేటి నేర వార్తలు 4-Dec-2021

TNI నేటి నేర వార్తలు 4-Dec-2021

* అమరావతి (ప్రకాశం జిల్లా/దర్శి)

దర్శి నగర పంచాయితీ ఎన్నికల ఫలితాలపై ప్రకాశం జిల్లా నాయకులతో సమీక్షలో టీడీపీ అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు

ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా సరైన నాయకత్వం ఉన్న చోట టీడీపీకి మంచి ఫలితాలొచ్చాయి

ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత, జిల్లా నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో దర్శిలో విజయం సాధించారు.

వైసీపీ నేతలు రెండున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను మానసికంగా, శారీరకంగా వేధించారు

టీడీపీ అధికారంలోకి వచ్చ్చాక మిమ్మల్ని ‎ ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం

నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్ర అభివృద్దిపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశాం.

ఇప్పడు పార్టీని పునాదుల నుంచి సరైన నాయకత్వంతో బలోపేతం చేస్తున్నాం

30 ఏళ్ల వరకు స్తిరంగా ఉంటే నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తాం, పార్టీలో కష్టపడి నిజాయితీగా పనిచేసినవారికే ప్రాధాన్యం

పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క కార్యకర్తకు, నాయకునికి అన్యాయం జరవనివ్వం.

ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నూకసాని బాలాజీ, దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డి, నారపుశెట్టి పాపారావు, పమిడి రమేష్ , గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గూడూరి ఎరిక్షన్ బాబు, బ్రహ్మం, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

* ప్రకాశం జిల్లా

టంగుటూరులో దారుణం… స్దానిక పంచాయితీ ఆఫీసు ఎదురుగా బంగారం వ్యాపారి రవికిశోర్ ఇంట్లో దారుణ హత్యకు గురైన భార్య కుమార్తెలు వెంకట లేఖన, శ్రీదేవిలు. గుర్తు తెలియని వ్యక్తులు కోసం గాలిస్తున్న పోలీసులు.

ఈరోజు ఉదయం ఎస్పీ మల్లికా ఘర్గ్ IPS గారు సంఘటనా స్దలానికి చేరుకుని పోలీసులు, మరియు ప్రజల వద్ద నుండి వివరాలు సేకరిస్తున్నారు.

అధికారులకు పలు సూచనలు చేసి తిరిగి వెళ్ళిపోయారు.

* పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని దేవాలయాలను టార్గెట్ చేసి ఒకే రోజు మూడు దేవాలయాలలో దొంగతనాలకు పాల్బడ్డారు. లక్కవరం గ్రామంలోని సాయిబాబా గుడి, వెంకటేశ్వరస్వామి ఆలయం, రామాలయం లలో అర్ధరాత్రి దొంగలు దోపిడీకి పాల్బడ్డారు. ఆలయాలలో వున్న హుండీ లను పగలగొట్టి అందులో వున్న నగదు ను దోచుకుపోయారు. కాగా ఇటీవల కాలంలో లక్కవరం గ్రామంలో దొంగలు తరచుగా దొంగతనాలకు పాల్బడుతున్నారు. ఇళ్ళు, షాపుల తాళాలు పగలగొట్టి పలు దొంగతనాలకు పాల్బడ్డారు. ఇదే క్రమంలో తాజాగా గుళ్ళను టార్గెట్ చేసి హుండీ లను పగలగొట్టి దొంగతనానికి పాల్బడ్డారు. దొంగతనం సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్కవరం గ్రామంలో ఎక్కడా సి.సి. కెమెరా లు లేకపోవడం దొంగలకు వరంగా మారింది. సి.సి. కెమెరా లు లేకపోవడం వలన రాత్రి సమయాల్లో అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఇప్పటికైనా గ్రామంలో సి.సి. కెమెరా లు ఏర్పాటు చేయాలని, దొంగతనాలు అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

* ఎబివిపి ఎల్ బి నగర్ విభాగ్ లోని దిల్సుక్ నగర్ నగరంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1 లక్షా 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించి నిరసన రాస్తారోకో నిర్వహించాడం జరిగింది. ఈ సందర్భంగా విభాగ్ కన్వీనర్ అక్యారి మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఏడేళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం మాయమాటలతో మభ్యపెడుతూ అమాయకపు నిరుపేద నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. PRC నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 191000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్, దిల్సుక్ నగర కార్యదర్శి కుంచాల సాయిరాం, సుమంత్, రంజిత్, సూర్య మోహన్, అలేఖ్య ,అంజలి, సుష్మా తదితరులు పాల్గొన్నారు.

బైట్
అక్యారి మహేష్
ABVP LB నగర్ విభాగ్ కన్వీనర్

* న్యాయస్థానం నుండి దేవస్థానం వరకూ పేరుతో అమరావతి రైతులు చేస్తున్న పాద యాత్ర కు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో కోర్ట్ వద్ద నుండి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్ర లో మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదాలు చేస్తూ తెలుగుదేశం శ్రేణులు కదం తొక్కాయి. అమరావతి కి 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులను నట్టేట్లో ముంచుతూ ముఖ్యమంత్రి తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అమరావతి ని అయిదు కోట్ల ఆంధ్రుల రాజధానిగా గుర్తించాలని తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేసారు. ఈ పాదయాత్ర లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు

చిరకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన ప్రయోజనములు విషయంపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతోరాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ నందు ఏపీ జేఏసీ మరియు ఏ పి జేఏసీ అమరావతి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని సి పి ఎస్ రద్దు చేయాలని కాంట్రాక్ట్ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించాలని పెండింగ్ డి ఎల్ విడుదల చేయాలని అదేవిధంగా ఉద్యోగులకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించామన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసి రోజు నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలు అన్నీ పశ్చిమగోదావరి జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు పశ్చిమగోదావరి జిల్లా ఏపీ జెఎసి కన్వీనర్ శ్రీనివాస రావు పశ్చిమగోదావరి జిల్లా అమరావతి జేఏసీ చైర్మన్ కె రమేష్ కుమార్ కన్వీనర్ వెంకట రాజేష్ పలువురు ఉద్యోగులు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.

* మధిర మండలం దెందుకూరు హై స్కూల్లో కరోనా కలకలం.

5 గురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పరీక్షించిన వైద్యులు.

ఉపాధ్యాయురాలకు,10వ తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్.

* Omicron: హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు

హైదరాబాద్‌: కొత్త వేరియంట్‌కు వేగంగా విస్తరించే గుణం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే చారిత్రక ట్యాంక్‌బండ్‌ సహా చార్మినార్‌ల వద్ద ‘ఫన్‌డే’ వేడుకలను రద్దు చేసింది.

సందర్శకులపైనే కాకుండా సాధారణ ప్రజలపై కూడా ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ను విధిగా వాడాలనే ఆదేశాలను ఖచ్చితం చేసింది.

వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా మారిన జియాగూడ, మేకలమండి, మలక్‌పేట్‌ గంజ్, బేగంబజార్, పాతబస్తీ, మలక్‌పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడిమల్కాపూర్, సరూర్‌నగర్‌ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించింది. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

* రావులపాలెం:

తూర్పుగోదావరి జిల్లా పోలీసులు గంజాయి అక్రమరవాణాపై కొనసాగుతున్న దాడులు

ఏజెన్సీ ప్రాంతము నుండి అక్రమముగా తరలిస్తున్న 715 కేజీల గంజాయి స్వాధీనం.

ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్.

ది.03-12-2021 సం॥రం తేదీ సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా, S.P. శ్రీ M.రవీంద్రనాధబాబు

గారి ఆదేశముల మేరకు రావులపాలెం C.I.శ్రీ V.కృష్ణ ఆధ్వర్యంలో రావులపాలెం S.I. శ్రీ పి. బుజ్జిబాబు

గారు సిబ్బంది, మధ్యవర్తులు మరియు రావులపాలెం తహశీల్దార్ కలసి రావులపాడు శివారు

మల్లాయిదొడ్డి గ్రామములో హెచ్.పి. పెట్రోల్ బంక్ దగ్గర తణుకు వైపు పోవు ఎన్.హెచ్.16

రోడ్డులో రాజమండ్రి వైపు నుండి వచ్చు వాహనములు తనికీ చేయుచుండగా సాయంత్రం 7

గం॥లకు చెన్నై వెళ్ళుచున్న PV024321 నెంబరు గల మహి ట్రావెల్స్ బస్ను ఆపి తనిఖీ చేయగా

అందులో 17 సంచులలో మూటలు కట్టి ఉన్న పట్టుకుని గంజాయిని స్వాధీనపరుచుకుని ఇద్దరు వ్యక్తులను

అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 715.530 గ్రాములు గంజాయిని మరియు PY02K4321 నెంబరు గల

మహి ట్రావెల్స్ బస్ తో పాటుగా ముద్దాయిలకు చెందిన రెండు సెల్ ఫోన్లు స్వాధీనపర్చుకోవడం జరిగినది.

అరెస్ట్ కాబడిన వ్యక్తుల వివరములు:

(1) మురగన్ వీర మణికండన్
S/o మదసామి తేవార్ మురగన్, వయస్సు 29 సం॥రంలు, కులం : మరేవార్, శంకర్నగర్, మధురైరోడ్డు, తిరునాళవెల్లి జిల్లా, తమిళనాడు రాష్ట్రం. (2) రంగసామి సెల్వం S/o రంగసామి, వయస్సు 42 సం॥రంలు, కులం : వన్నెయార్, శ్రీనివాస్ నగర్, కోయంబేడు, చెన్నై, తమిళనాడు రాష్ట్రం.

స్వాధీనపర్చుకున్న ప్రొపర్టీ వివరములు:

(1) (2) 715.530 గ్రాములు గంజాయి, దీని మార్కెట్ విలువ రూ. 72,00,000/-లు. PY02K4321 నెంబరు గల మహి ట్రావెల్స్ బస్

(3) రెండు సెల్ ఫోన్లు.

ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గంజాయిని, బస్ను మరియు వారి యొక్క రెండు సెల్ ఫోన్లను మధ్యవర్తుల సమక్షములో పైన తెల్పిన ముద్దాయిల నుండి స్వాధీన పరుచుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో వీరికి సహకరించిన ఇతర వ్యక్తుల పాత్రపై విచారణ జరుగుచున్నది. పైన తెల్పిన అరెస్ట్ కాబడిన ముద్దాయిలను ఈ రోజు కొత్తపేట జె.ఎఫ్.సి. మెజిస్ట్రేట్ వారి వద్దకు రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. సదరు గంజాయి రవాణాలో మిగిలిన వ్యక్తుల పాత్రపై కూడా విచారణ జరిపి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది.

సబ్ డివిజినల్ పోలీస్ అధికారి,
అమలాపురం సబ్ డివిజన్.

* దిశ మార్చుకున్నా జవాద్ సైక్లోన్.

ఒడిశా లోని పూరి వైపు ప్రయాణం.

ఉత్తరాంధ్ర కు ఊరట.

* అమరావతి :

గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం పోనుగుపాడులో దంపతులు చిట్టీల పేరిట మోసానికి పాల్పడ్డారు.

భీమేశ్వర రావు, అతని భార్య సుబ్బాయమ్మ దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసి పరారయ్యారు.

బాధితుల్లో ఫిరంగిపురంతో పాటు గుంటూరు, నరసరావుపేట వాసులు ఉన్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.