DailyDose

TNI నేటి తాజా వార్తలు 4-Dec-2021

TNI నేటి తాజా వార్తలు 4-Dec-2021

* దిల్లీ:

కొణిజేటి రోశయ్య(88) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశార. ‘‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం.

తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది.

రోశయ్య సేవలు మరువలేనివి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని మోదీ తెలిపారు.

కాగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

బీపీ పడిపోవడంతో హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే రోశయ్య తుదిశ్వాస విడిచారు.

* అమరావతి.

రోశయ్య కుమారుడితో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:

ఈ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య కుమారుడితో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడారు. రోశయ్య కుమారుడికి ఫోన్‌ చేసిన ముఖ్యమంత్రి, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమన్న ముఖ్యమంత్రి, ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. మరోవైపు, రోశయ్య మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఇవాళ్టి నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

* కొబ్బరి చెట్టు పడి విద్యార్థిని మృతి.

వజ్రపుకొత్తూరు మండలం, ఉద్దానం గోపినాధపురం గ్రామంలో జవాద్ తుపాన్ కారణంగా వీస్తున్న గాలులకు కొబ్బరిచెట్టు పడి గోరకల ఇందు అనే ఇంటర్ విద్యార్థిని మృతిచెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు.

మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది.

ఈసందర్భంగా మంత్రివర్యులు మృతిరాల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చి భరోసా కల్పించారు.

* ఉత్తరాంధ్రకు తప్పిన “జవాద్”. ‘ముప్పు’.?

జవాద్‌ తుఫాన్‌ ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు తప్పినట్టుగానే అంచనా వేస్తున్నారు అధికారులు. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న జవాద్ తుఫాన్.

గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బలహీనపడుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రకు ‘జవాద్’ తుఫాన్ ముప్పు తప్పినట్టేనని. ఉత్తరాంధ్ర తీరానికి సమీపించి క్రమేపీ బలహీనపడుతూ ఒడిశా వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు.

ఇక, జవాద్‌ తుఫాన్‌ ప్రభావంతో. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, ఉత్తరాంధ్ర తీరానికి సమీపిస్తున్న కొద్ది బలహీనపడుతూ. ఒడిశా వైపు వెళ్లనున్న జవాద్ తుఫాన్. రేపు ఒడిశాలోని పూరి దగ్గర తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, జవాద్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్‌ అయిన ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమై ఉన్నారు.

* 🌐📳 లక్షలాది వైఫై రూటర్లలో సెక్యూరిటీ సమస్యలు, హెచ్చరిస్తున్న టెక్‌ నిపుణులు 🤩

👉 సైబర్‌ నేరస్తులు పంథా మార్చారు. ఇన్ని రోజులు మెయిల్స్‌, మెసేజెస్‌, ఫ్రీగిఫ్ట్‌ లు పేరుతో బ్యాంక్‌ అకౌంట్‌లలో ఉన్న మనీని కాజేసేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చి వైఫై రూటర్ల సాయంతో వైరస్‌ పంపి పర్సనల్‌ కంప్యూటర్లు, ఆఫీస్‌లో కంప్యూటర్లపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడుల్లో వ్యక్తులు, లేదంటే సంస్థల రహస్యాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని అడ్డం పెట్టుకొని కావాల్సిన మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని మిలియన్ల వైఫై రూటర్లలో సుమారు 226 భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చ్‌ సంస్థ ‘ఐఓటీ ఇన్స్పెక్టర్‌’, టెక‍్నాలజీ మ్యాగజైన్‌ ‘చిప్‌’ పలు నివేదికల్ని విడుదల చేసింది. నెట్‌గేర్‌, ఆసుస్‌, సినాలజీ,డీ – లింక్‌, ఏవీఎం,టీపీ -లింక్‌, ఇడి మ్యాక్స్‌ సంస్థల రూటర్లలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తాయని, తద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు అవకాశం ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ సెక్యూరిటీ సమస్యలు వెలుగు రావడంతో సంబంధిత సంస్థలు.. ఆ సమస్యని పరిష్కరించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఐఓటీ ఇన్స్పెక్టర్‌ సంస్థ సీటీఓ ఫ్లోరియన్ లుకావ్స్కీ మాట్లాడుతూ.. మిలియన్ల రూటర్లలో తలెత్తిన 226 భద్రతా లోపాల వల్ల తలెత్తే నష్టం ఒకే విధంగా ఉంటుందని చెప్పలేం. కానీ అదే భద్రతా లోపాల్ని అడ్డంపెట్టుకొని హ్యాక్‌ చేయడం హ్యాకర్లకు చాలా సులభం’ అవుతుందని అన్నారు. అయితే ఈ సమస్యలకు రూటర్లలో వినియోగించే కొత్త కాంపోనెంట్స్‌, ల్యూనిక్స్‌ కెర్నాల్‌ అనే ఆపరేటింగ్‌ స్టిస్టమ్‌ తో పాటు ఇతర డేటా సర్వీసులను టార్గెట్‌ చేసుకొని సైబర్‌ దాడులు జరిగే ప్రమాదం ఉందని అన్నారు.

సైబర్‌ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఇటీవల నార్డ్‌ పాస్‌ అనే సంస్థ 50 దేశాలకు చెందిన ప్రజలు ఎలాంటి పాస్‌వర్డ్‌లను వినియోగిస్తున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను ఎంత సమయంలో హ్యాక్‌ చేయొచ్చు అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మనదేశానికి చెందిన ప్రజలు..సెకను కన్నా తక్కువ సమయంలో హ్యాక్‌ చేసే విధంగా పాస్‌ వర్డ్‌ అనే వర్డ్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారని తేలింది. దీంతో పాటు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567 పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటున్నట్లు నార్డ్‌ పాస్‌ పేర్కొంది. అలా కాకుండా కష్టతరమైన వర్డ్స్‌లేదంటే నెంబర్స్‌ పెట్టుకోవడం వల్ల వైఫై రూటర్ల ద్వారా జరిగే హ్యాకింగ్‌ నుంచి సురక్షింతంగా ఉండొచ్చని ఫ్లోరియన్ లుకావ్స్కీ సూచించారు.

📰✒️ సత్యమేవ జయతే ✒️📰

* తిరుమల: కొండ చరియలు విరిగిపడినా శ్రీవారే భక్తులను కాపాడారు: తితిదే ఈవో జవహర్ రెడ్డి

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి మనందరినీ రక్షించి భక్త వత్సలుడని మరోమారు చాటి చెప్పారని తితిదే ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు.

కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల గురించి స్వామి వారు తమను హెచ్చరించారన్నారు. ఆఫ్కాన్‌ సంస్థ ఇంజినీరింగ్‌ నిపుణులు, తితిదే ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని, లింక్‌ రోడ్డును ఈవో పరిశీలించారు.

* తిరుపతి అర్బన్ జిల్లా:-

విజయవాడ పోలీస్ కమిషనర్ గా బదిలీపై వెళుతున్న డి.ఐ.జి శ్రీ క్రాంతి రాణా టాటా ఐ.పి.యస్ గారికి ఘనంగా వీడ్కోలు.

అనంతపురం రేంజ్ డి.ఐ.జి గా కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ధి, అంకితభావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి, శాఖాపరమైన పరిపాలన ప్రక్రియలో భాగంగా బదిలీపై విజయవాడ పోలీస్ కమిషనర్ గా వెళుతున్న డి.ఐ.జి శ్రీ క్రాంతి రాణా టాటా ఐ.పి.యస్ గారికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వేంకట అప్పల నాయుడు ఐ.పి.యస్ గారు, అనంతపురం రేంజ్ డి.ఐ.జి శ్రీ క్రాంతి రాణా టాటా ఐ.పి.యస్ గారిని దుశ్శాలువాతో సన్మానించి మేమొంటో అందచేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి.టి.డి సివి&యస్.ఓ శ్రీ గోపీనాథ్ జట్టి ఐ.పి.యస్ గారు పాల్గొన్నారు.

అనంతపురం రేంజ్ డి.ఐ.జి గా సమర్ధవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు అందించిన సేవల గురించి కొనియాడి ఘనంగా జిల్లా యస్.పి శ్రీ వేంకట అప్పల నాయుడు ఐ.పి.యస్ గారి అధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ఘనంగా సత్కరించి వీడ్కోలు పలకడం జరిగింది.

ఈ కార్యక్రమంలో, అడిషనల్ యస్.పి లు అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ మేడం, యల్&ఓ శ్రీ ఆరిపుల్లా గారు, తిరుమల మునిరామయ్యా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, పాల్గొన్నారు.

* నెల్లూరు జిల్లా గూడూరు రురల్.

మహా పాదయాత్ర లో మరో సారి ఉద్రిక్తత.

మహా పాదయాత్రలో రోప్ పార్టీ పై వెంకటగిరి సి.ఐ దాడి.

గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

పుట్టంరాజు కండ్రిగా వద్ద అమరావతి రైతుల ఆందోళన.