DailyDose

TNI నేటి నేర వార్తలు 5-Dec-2021

TNI నేటి నేర వార్తలు 5-Dec-2021

* పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో ఘరానా చిట్టీల మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. అట్లపాడు గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు, గ్రామ ఉపసర్పంచ్ తిరుమళ్ళ రంజిత్ కుమార్ ప్రజలకు సుమారు ఏడు కోట్లకు ఎగనామం పెట్టి పరారయ్యాడు. రంజిత్ కుమార్ ఎన్నో ఏళ్లుగా చిట్టీలు వ్యాపారం చేస్తున్నాడు. నిడదవోలు పరిసర ప్రాంతాల్లోని ఎంతోమంది అతన్ని నమ్మి తన దగ్గర చీటీలు వేసేవారు. దీంతో పాటు భారీగా ఫైనాన్స్ వ్యాపారాలు, ఇతర వ్యాపారాలు చేసేవాడు. ప్రజల నుంచి వసూలు చేసిన సుమారు ఏడు కోట్ల సొమ్ముతో రంజిత్ కుమార్ ఉడాయించిన టు బాధితులు చెబుతున్నారు. అతడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని.. అతని ఇంటికెళ్తే తాళాలు వేసి ఉన్నాయని బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సమిశ్రగూడెం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమిశ్రగూడెం ఎస్సై షేక్ సుభాని తెలిపారు.

* నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిపోయి అవినీతి రాజ్యమేలుతుంటే చూస్తూ ఉండిపోతూ హనీమూన్ పెళ్లి కొడుకులా వ్యవహరిస్తున్న నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు పై టిడిపి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిప్పులు చెరిగారు.

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడును గ్రామ ప్రజలు తమ సమస్యలను ఆయన ముందుచి ఏకరువు పెట్టారు. దీనిపై సహనం కోల్పోయిన శ్రీనివాస్ నాయుడు గత టీడీపీ పాలనలో ఉన్న ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు 100 కోట్లకు అవినీతి పాల్పడ్డాడని అతనిని ప్రశ్నించడం మానేసి తనను ఎందుకు అడుగుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఈరోజు ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

నిడదవోలు ఎమ్మెల్యే శ్రీని నాయుడు తండ్రి చాటు బిడ్డ అని ఈ విషయం నియోజకవర్గంలో చిన్న పిల్ల వాడిని అడిగిన చెపుతారు అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ప్రజాసేవ చెయ్యడానికి కాదు,రాజకీయాల్లోకి వచ్చింది హనీమూన్ కోసంమే అని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గంలో నాటు సారా డంపులు మీ అధికార పార్టీ కనుసన్నల్లోనే జరుగుతుంది. అవి మీరే పట్టిస్తారు,మళ్ళీ మీరే సెటిల్ చేస్తారు. నియోజకవర్గంలో ఎక్కడ లేఅవుట్ వేయాలన్న ఎమ్మెల్యే ను సంప్రదించాలి, వారికి సమర్పించి వారి అనుమతి తీసుకున్న తర్వాతనే లేఅవుట్స్ వేయాలి అనడం ఎంతవరకు సమంజసం.

నా సొంత ఇబ్బందుల వల్లే గానీ నేను బయటకు రాకపోవడం,మీకు భయపడి కాదు. ఈ విషయం అధినాయకుడు చంద్రబాబు కూడా చెప్పాను అని అన్నారు. మాట్లాడితే 100 కోట్ల ఇసుకలో అవినీతి అనడం కాదు,అధికారంలో ఉన్నది మీరే కదా నిరూపించండి. నియోజకవర్గంలో ఏ వ్యాపారం ప్రారంభించిన మీ చేతుల మీదుగానే ప్రారంభించాలా,లేకపోతే అవి రోడ్ డివైడ్ లో కొట్టేస్తారా. నిడదవోలు నియోజకవర్గంలో మా పార్టీ చేసిన అభివృద్ధిపై,మీ పార్టీ చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం. సొంత పార్టీ కార్యకర్తలలో అసహనం ఇది మీరు సాధించిన అభివృద్ధి.

రాజకీయ నాయకులను మీటింగ్ లలో కొన్ని సందర్భాల్లో ప్రజలు అభివృద్ధి పై ప్రశ్నిస్తారు. దానికి మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి తప్ప గత ఎమ్మెల్యే ని ఇలా ఆడిగారా అని తప్పించుకోవడం కేవలం భాద్యతారాహిత్యం మాత్రమే. నియోజకవర్గంలో తమ పాలనలో అటువంటివి జరగలేదని నియోజకవర్గ అభివృద్ధినీ మాత్రమే ఆకాంక్షించామని ఈ సందర్భంగా శేషారావు అన్నారు.

* పెట్రోల్… డీజిల్ ల పై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని, తగ్గించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు నల్ల రిబ్బన్ లు ధరించి పట్టణంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. స్థానిక భాజపా కార్యాలయం నుండి మదర్ తెరిస్సా విగ్రహం వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ ఈ నిరసన ప్రదర్శన కొనసాగింది.ఈ సందర్భంగా భాజపా రాష్ట గిరిజన మోర్చా అధ్యక్షుడు జాటోత్. హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ…. ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దనే ఉద్దేశ్యం తో కేంద్రం లోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల పన్నును తగ్గించి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించిందని,కేంద్ర ప్రభుత్వం తగ్గింపు తో దేశంలో ని చాలా రాష్టలు పెట్రోల్.. డీజిల్ లపై వ్యాట్ ను తగ్గించాయని , కానీ తెలంగాణ రాష్ట్రం లోని సి.ఎం కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వ్యాట్ ను తగ్గించ కుండా ప్రజల నుండి పన్నులను వసూలు చేస్తుందాని, రాష్ట్ర ప్రజల పై కనీసం కనికరం చూపకుండా రాష్ట్రంలో రాక్షస పాలన ను కొనసాగిస్తున్నాడని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేసారు. లేనిచో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

బైట్ : హుస్సేన్ నాయక్… గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు…

* ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్లు.. మాస్కులు ధరించాలని సి.ఐ వెంకటరత్నం ద్విచక్ర వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల. కోటిరెడ్డి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. హెల్మెట్లు , మాస్కులు , ధరించని, సరైన కాగితాలు లేని వాహనాలను పోలీసుస్టేషన్ కు తరలించి వారికి అవగాహన కల్పించారు.వాహనాల తనికీ సమయంలో పలు చోట్ల పోలీసులు… వాహనదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పట్టణం లోని ఓ చోట శ్రీనివాస్ అనే వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడంతో పోలీసులు చేయి చేసుకున్నారని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాడు.

ఈసందర్భంగా మహబూబాబాద్ పట్టణ సి..ఐ వెంకటరత్నం మాట్లాడుతూ… గత వారం రోజులు గా ప్రజలకు నెంబర్ ప్లేట్లు, హెల్మెట్లు ,మాస్క్ లు ధరించాలని, వాహనాలకు అన్ని రకాల కాగితాలు కలిగి ఉండాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించామని , ఈ రోజు పట్టణం లోని పలు కూడళ్ళలో విస్తృతంగా సోదాలు నిర్వహించామని, వాహనదారులందరు తమ భద్రత కోసం హెల్మెట్లు , మాస్కులు ధరించాలని
ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని.. ఏ ఒక్కరికి మినహాయింపు లేదన్నారు.

* బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం: 13మంది మృతి,వైరలైన

జకార్త: ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్‌ మైటిగేషన్‌ ఏజెన్సీ (బీఎన్‌పీబీ) అధికారి అబ్దుల్‌ ముహారి తెలిపారు. జకార్త: ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్‌ మైటిగేషన్‌ ఏజెన్సీ (బీఎన్‌పీబీ) అధికారి అబ్దుల్‌ ముహారి తెలిపారు.

* చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.

చిత్తూరు జిల్లాలో రహదారులు రక్తమోడాయి. చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డివైడర్ ఢీకొనడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేగంగా వెళుతూ డివైడర్ ఢీకొట్టారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వుంది. వారిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.

* ఫ్లాష్… ఫ్లాష్… ఫ్లాష్

మచిలీపట్నం క్రైమ్ న్యూస్ :

👉 జిల్లా కలెక్టరేట్లో మిస్ఫైర్.

👉 హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు చేతిలో గన్ ఫైర్.

👉 కలెక్టరేట్లోని ట్రెజరీ గార్డు లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు.

👉 ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ కావడంతో శ్రీనివాసరావు గుండెల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్.

👉గాయాలపాలైన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీస్ అధికారులు.

👉 ప్రాణాపాయ పరిస్థితి లో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు.

👉 జరిగిన సంఘటన పై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.

👉 ఘటనకు గల కారణాలు వెంటనే తెలియ జేయాలి అంటూ హుకుం జారీ చేసిన ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.

* కర్నూలు జిల్లాలో పెద్దదైన సిద్ధాపురం చెరువుకు శనివారం మధ్యాహ్నం గండ్లు పడ్డాయి. కేజీ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దతూము పక్కన మూడు చోట్ల గండ్లు పడ్డాయి. ఈ నీరు సమీప పంటపొలాల్లోకి చేరకుండా రైతులు తూము కాలువలోకి మళ్లించారు. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా గండ్ల నుంచి నీరు బయటకు వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే గండ్లు ఉధృతమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

దీంతో గండ్లను పూడ్చేందుకు లస్కర్లు, రైతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం గండ్లను గుర్తించిన వెంటనే ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమై ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం చెరువులో 19 అడుగుల నీరు ఉంది. అర్ధరాత్రి 12 గంటలకు తెలుగుగంగ ఏఈ శివనాయక్‌ వచ్చారు. మధ్యాహ్నం వచ్చి చూశామని, అంత తీవ్రత ఉండదనుకున్నామని ఆయన తెలిపారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ హరిప్రసాద్‌ కూడా చెరువు కట్ట వద్దకు వచ్చారు.

* ఇండోనేషియా లో భారీ భూకంపం

జకార్తా: ఇండోనేషియా (Indonesia)లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 5.17 గంటలకు టోబెలోలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.0గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. భూకంప కేంద్రం టొబెలోకు 259 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది.

భూఅంతర్భాగంలో 174.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.