NRI-NRT

తెలుగు రాష్ట్రాలలో ఆటా సంబరాలు ప్రారంభం

తెలుగు రాష్ట్రాలలో ఆటా  సంబరాలు ప్రారంభం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆటా వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో డిసెంబర్ 5వ తారీకు నుంచి మూడు వారాల పాటు ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 26 తారీకున రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఆటా వేడుకలు సందర్భంగా ఆటా ప్రతినిధులు మాతృభూమి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్,ఆటా వేడుకలు చైర్ మధు బొమ్మినేని గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఆటా వేడుకలు కార్యక్రమానికి కో-చైర్ గా అట్లాంటాకి చెందిన అనిల్ బొద్దిరెడ్డి మరో కో-చైర్ గా న్యూ జెర్సీకి చెందిన శరత్ వేముల వ్యవహరిస్తారు. కోవిద్ -19 సమయంలో ఆటా 600 పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రభుత్వ ఆసుప్రతులలో పంపిణి చేసారు. ఆటా 17 వ మహాసభలు వాషింగ్టన్, డీసీ లో జులై 1, 2 & 3 తారీకులలో నిర్వహిస్తారు. మహాసభలలో ముందు నిర్వహించే ఆటా సేవ మరియు వేడుకలు 3 వారల పాటు డిసెంబర్ 5 నుంచి 26 వరకు నిర్వహిస్తారు.

మహిళా సాధికారత కోసం వరంగల్ జిల్లాలో కుట్టు మెషిన్ లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతోంది. ట్రైనింగులో గ్రాడ్యుయేట్ అయినా వారికీ కుట్టు మెషిన్ లు ఇవ్వటం జరుగుతుంది. కాన్సర్ స్క్రీనింగ్ నల్గొండ లో నిర్వహిస్తున్నారు.. దాదాపు 200 మందికి పైగా మహిళలకుఈ స్క్రీనింగ్ నిర్వహించబోతున్నారు. ఉభయ రాష్ట్రాలలో ఎన్నో హెల్త్ మరియు కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేస్తారు. వరంగల్, నల్గొండ, రంగా రెడ్డి జిల్లాల్లో స్కూల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి పరిచే దిశగా విద్యుతీకరణ, మంచి నీటి సౌకర్యం, డిజిటిలిజషన్ ప్రాజెక్ట్స్ చేపట్టారు. డిసెంబర్ 10వ తారీఖున అనాధ శరణాలయంలో అన్నదానం నిర్వహిస్తారు.ఆటా అంతర్జాతీయ సాహితి సదస్సు డిసెంబర్ 11వ బెస్ట్ వెస్ట్రన్ లక్డికాపూల్ లో నిర్వహించనున్నారు.

తిరుపతి లో డిసెంబర్ 18 తారీఖున సాంస్కృతిక కళోత్సవం నిర్వహించనున్నారు. వాగ్గేయకారుల సంగీతోత్సవం హనుమకొండ లో నిర్వహించనున్నారు. స్టార్ట్ అప్ బిజినెస్ సెమినర్స్ విశాఖపట్నం మరియు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. అమెరికన్ విశ్వవిద్యాలయాలలో దరఖాస్తు చేసుకోవటానికి పాటించవలసిన నియమాలు తెలియపరిచేందుకు అమెరికన్ కన్సుల్టే ప్రతినిధులు మరియు తెలంగాణ విద్యాశాఖ అధికారులతో కార్యక్రమం నిర్వహించబోతున్నారు. యువ కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఆటా నాదం నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగెర్స్ నిహాల్ కొండూరి, నూతన మోహన్, సాయి శ్రీకాంత్, విజయలక్ష్మి మరియు రామాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో ఇండియా లో ఉన్న ప్రవాసులు మరియు ప్రజలు విరివిగా పాలుపంచుకోవాలని ఆటా కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాలలో ఆటా  సంబరాలు ప్రారంభం - Game festivities begin in Telugu states.