Fashion

చలికాలం నేతి వైద్యం గురించి విన్నారా?

చలికాలం నేతి వైద్యం గురించి విన్నారా?

ప్రస్తుతం వ్యాధి నిరోధక సామర్ధ్యం / ఇమ్యూనిటీ మీద సర్వత్రా అవగాహన పెరిగిన నేపధ్యంలో నెయ్యి అనేది ఒక సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఆహార నిపుణులు సిథ్స్‌ఫార్మ్‌ నిర్వాహకులు కిషోర్‌ ఇందుకూరి అభివర్ణిస్తున్నారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ తో పాటు ఇతర పలు సంస్థలు కూడా నెయ్యి అందించే ఆరోగ్య లాభాలను థృవీకరించిన నేపధ్యంలో నెయ్యి వినియోగం వల్ల కలిగే పలు ప్రయోజనాలు ఆయన వివరించారిలా…దేశీ నె్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. తద్వారా వింటర్‌ సీజన్‌లో విభిన్న రకాల వైరస్‌లను అడ్డుకుని ఫ్లూ, దగ్గు, జలుబుల నుంచి రక్షిస్తుంది.
ఆయుర్వేద గ్రంధాల ప్రకారం… దేహంలోని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరించి ఉంచేందుకు నెయ్యి సహకరిస్తుంది. అందువల్లే దీనిని చలికాలపు వంటకాలు, గజర్‌ కా హల్వా, మూంగ్‌ దాల్‌ హల్వా తదితర మిఠాయిల్లో ఎక్కువ వినియోగిస్తారు.
శీతాకాలంలో ప్రధాన పండగలు రావడం, ఆ సమయంలో దీపాలను సైతం నెయ్యి తో వెలిగించడం వెనుక అంతరార్ధం ఇదే. అలాగే పిండివంటలు వండుకోవడం సర్వ సాధారణం. గారెలు, బూరెలు, అరిసెలు…మరేవైనా సరే వాటి తయారీలో ఆయిల్‌ వినియోగం తప్పనిసరి. అయితే వీలైనంత వరకూ పిండి వంటలు నెయ్యితో వండడం శ్రేష్టమంటున్నారు నిపుణులుసంప్రదాయంగా మన భారతదేశ వంటల విధానంలో నెయ్యి ఒక తప్పనిసరి ముడి సరుకు. మరీ ముఖ్యంగా శాఖాహార వంటలకు సంబంధించి అటు రుచిని ఇటు ఆరోగ్యాన్ని పెంచేందుకు నెయ్యి తప్పనిసరిగా వినియోగించేవారు. అయితే రిఫైండ్‌ ఆయిల్స్‌తో నెయ్యిని మేళవించడం అనేది ఆధునికులు చేస్తున్న అతిపెద్ద పొరపాటని పోషకాహార నిపుణుల మాట. పుష్కలంగా నీరుతో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందుతుంది.శరీరం కొవ్వును గ్రహించడంలో నెయ్యి సహకరిస్తుంది. బరువు తగ్గించే మార్గాల్లో నెయ్యి వాడకం కూడా ఒకటని నవతరం వైద్యులు చెబుతున్నారు. నెయ్యిలో శరీరానికి అవసరమైన, కొవ్వును కరిగించే ద్రవపదార్ధాలు, శరీర ధర్మాల్ని నిర్వర్తించడంలో సహకరించే డి,కె,ఇ,ఇ విటమిన్స్‌ ఉంటాయి. దీనిలో బ్యుటిరిక్‌ యాసిడ్‌ ఉంటుంది. దీనిని పెద్ద పేగు కణాలు శక్తి కారకంగా ఉపయోగించుకుంటాయి.హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను కాపాడుతుంది.కణాల విధులను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ రాకను నెయ్యిలోని అధిక వేడి గుణం అడ్డుకుంటుంది. పరగడుపున ఉదయం పూట నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కణాల పునరుజ్జీవన ప్రక్రియను అది బలోపేతం చేస్తుంది. నెయ్యిలోని యాంటాక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు చర్మంలోని సున్నితత్వాన్ని పరిరక్షిస్తాయి. చర్మాన్ని దెబ్బ తీసే పిగ్మంటేషన్‌ ను, ఇన్‌ఫ్లమేషన్‌ ను దూరం చేస్తాయి. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. గుండె పనితీరు, కంటి చూపును మెరుగుపరచి, కేన్సర్, మలబద్దక నివారిణిగా ఉపకరిస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి వంటి శీతాకాల సమస్యలను తగ్గించేందుకు చేసే న్యాసా చికిత్సలో గోరు వెచ్చని నెయ్యిని వినియోగిస్తారు. –భారతీయ పురాణాలు, సంప్రదాయాలు ఎప్పటి నుంచో నెయ్యి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. అలాగే ఆయుర్వేద చికిత్స నిపుణులు…దీనిని సహజసిద్ధమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా అభివర్ణిస్తారు. అలాగే శాస్త్రీయ పరిశోధనలు కూడా నెయ్యిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం అత్యుత్తమ ఆరోగ్య చిట్కాగా తేల్చాయి.