NRI-NRT

సామినేని రవి ఆధ్వర్యంలో తానా సేవా శిబిరాలు

సామినేని రవి ఆధ్వర్యంలో తానా సేవా  శిబిరాలు

తానా ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్న కొలంబస్ కు చెందిన ప్రవాసాంధ్రుడు సామినేని రవి ఆధ్వర్యంలో వచ్చే 12, 13 తేదీల్లో వరంగల్ ఖమ్మం జిల్లాల్లో రెండు భారీ సేవా శిబిరాలను నిర్వహిస్తున్నారు. 12వ తేదీన వరంగల్ జిల్లా నేరడ గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ఆ గ్రామంలో ఉన్న పాఠశాలలకు బెంచీలను విరాళంగా అందజేస్తున్నారు. విద్యార్థులకు సి పి ఆర్ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 100 సోలార్ దీపాలను విరాళంగా అందజేస్తున్నారు.