Politics

ఒకే వేదికపై దగ్గుబాటి-చంద్రబాబు

నందమూరి తారక రామారావు మనుమరాలి వివాహం హైదరాబాద్​లో జరుగుతోంది. ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, అలుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత.. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ వేడుకలో కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం దగ్గుబాటి కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు ఫోటోలు దిగారు.