Sports

క్రికెట్‌ను పట్టించుకోని ఒలంపిక్స్ కమిటీ. ప్రయత్నాలు వీడని ఐసీసీ.

క్రికెట్‌ను పట్టించుకోని ఒలంపిక్స్ కమిటీ. ప్రయత్నాలు వీడని ఐసీసీ.

లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌ ప్రాథమిక జాబితాలో క్రికెట్‌ పేరు లేకపోవడంపై ఎలాంటి నిరాశకు గురికాలేదని అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) వెల్లడించింది. గత ఆగస్టు నుంచి 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఒలింపిక్స్ కమిటీ విడుదల చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై ఐసీసీ తాజాగా స్పందించింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై తమకు ఇంకా ఆశలు ఉన్నాయని పేర్కొంది. ‘అదనపు స్పోర్ట్స్’ విభాగంలో క్రికెట్‌ చేర్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ‘‘ఆతిథ్యం నగరం (లాస్‌ఏంజెలెస్‌) అదనపు క్రీడలను ఎంచుకునే ప్రక్రియ 2023 నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడు క్రికెట్‌ కూడా భాగం కావాలని కోరుతున్నాం. అయితే క్రికెట్‌ను అదనపు క్రీడగా చేర్పించడం కఠిన సవాలే. ఇప్పటికైతే ఎలాంటి హామీ ఇవ్వలేం. గత ఆగస్టులో క్రికెట్‌ను కూడా చేర్చాలని కోరాం. దీనికి బీసీసీఐ మద్దతు కూడా మాకు ఉంది’’ అని ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు వెల్లడించారు.