ScienceAndTech

మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్…బిట్‌కాయిన్ల అమ్మకం

మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్…బిట్‌కాయిన్ల అమ్మకం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్టర్ హ్యాక్ అయ్యింది. కాయిన్ లు కొనాలంటూ…ఆగంతకులు ట్వీట్ చేశారు. బిట్ కాయిన్ లు లీగల్ చేశామంటూ…మెసేజ్ లు చేయడం కలకలం రేపింది. 500 బిట్ కాయిన్ లు పంచుతున్నామంటూ…హ్యాకర్లు ట్వీట్ చేశారు. హ్యాకర్ల ట్వీట్ పై పీఎంవో అధికారులు రెస్పాండ్ అయ్యారు. ప్రధాని ట్విట్టర్ అకౌంట్ ను రీస్టోర్ చేసింది ట్విట్టర్. ఇటీవలే..పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ లు హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే…భారత ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్ ఖాతాను ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో హ్యాకర్స్ హ్యాక్ చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ విషయాన్ని పీఎంవో వర్గాలు తెలుసుకున్నాయి. ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ట్విట్టర్ కు తెలియచేయడం జరిగిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. వెంటనే ట్విట్టర్ స్పందించి…రీస్టోర్ చేసిందని తెలిపింది. ఖాతా హ్యాక్ అయిన సమయంలో…ఏదైనా మెసేజ్ వస్తే వదిలేయాలని పేర్కొంది.