DailyDose

ABN-RKపై ఎఫ్ఐఆర్ నమోదు. ₹241కోట్లు బొక్కేశారు-నేరవార్తలు

ABN-RKపై ఎఫ్ఐఆర్ నమోదు. ₹241కోట్లు బొక్కేశారు-నేరవార్తలు

* ఏబీఎన్‌ రాధాకృష్ణపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. విధులకు ఆటంకం కలిగించినందుకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఐపీసీ 353, 341,186, 120(బి) సెక్షన్ల కింద ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదైంది. కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు సీఐడీ బదిలీ చేయనుంది. కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్ర సీఐడీ అధికారులను ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణ అడ్డుకోడానికి ప్రయత్నించడం విస్మయ పరిచింది. అవినీతికి పాల్పడ్డ వారి ఇళ్లల్లో అధికారులు దర్యాప్తు చేస్తుండగా అడ్డుకోవడానికి యత్నించడంతో తీవ్ర ఒత్తిడి మధ్య నే సీఐడీ అధికారులు పంచనామా పూర్తి చేసుకున్నారు.

* పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కేసులో పోలీస్‌ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ సందర్భంగా శిల్పా చౌదరి నుంచి నార్సింగ్‌ పోలీసులు పలు వివరాలు సేకరించారు. ఆమె ఖాతాలో రూ.16వేలు, భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఖాతాలో రూ.14వేలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శిల్ప ఇప్పటి వరకు రూ.కోట్లలో మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 కేసుల్లో రూ.7కోట్లు మోసం చేసినట్టు ఆమెపై బాధితులు ఫిర్యాదు చేశారు. ముగ్గురికీ రూ.7కోట్లు తిరిగిచ్చేస్తానని శిల్పాచౌదరి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డిల నుంచి శిల్ప రూ.7కోట్లకు పైగా తీసుకొని ఎగవేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. శిల్ప అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచి భారత్‌కు వచ్చి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10కోట్లకు పైగా ఇచ్చినట్టు శిల్ప చెప్పినప్పటికీ తగిన ఆధారాలు ఇవ్వలేదు. ఆమె మోసాలపై నార్సింగ్‌ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

* కరోనా సమయంలో ఉద్యోగం పోయిందని నకిలీ ధ్రువపత్రం సమర్పించి ప్రభుత్వం నుంచి నిధులు కాజేసేందుకు ప్రయత్నించిన భారత సంతతి మహిళకు సింగపూర్‌ న్యాయస్థానం 16 నెలల జైలుశిక్ష విధించింది. రాజగోపాల్‌ మాలిని (48) సింగపూర్‌లోని ఓ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గత ఏడాది కొవిడ్‌-19 సహాయ నిధి పొందేందుకు సంస్థ.. తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు నకిలీ లేఖ సృష్టించారు. ప్రభుత్వానికి సమర్పించారు. విషయాన్ని గ్రహించిన సంస్థ.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేశారంటూ జిల్లా జడ్జి మార్విన్‌ బే.. ఆమెకు 16 నెలల జైలు శిక్ష విధించారు. మాలిని.. తాను పనిచేస్తున్న సంస్థ నిధులనూ దుర్వినియోగపరిచారు.

* ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. సోదాలతో స్పీడ్‌ పెంచిన సీఐడీ అరెస్టులతో దూకుడు పెంచింది. వందల కోట్ల రూపాయల స్కామ్‌ చేసిందెవరు? వాళ్ల వెనుక ఉన్నదెవరు? ఇదే ఇప్పుడు మెయిన్‌ పాయింట్‌గా మారింది. దీంతో, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అసలు సూత్రధారులెవరో? ఎవరెవరు ఎంతంత నొక్కేశారో తేల్చే పనిలో పడింది సీఐడీ. మొత్తం 26మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సీఐడీ ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకుంది.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్ పేరుతో పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది అభియోగం. షెల్‌ కంపెనీల పేరుతో 241కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ కేసు లింకులు అనేకచోట్ల ఉండటంతో కీలక ఆధారాలు సేకరిస్తోంది. ఏకకాలంతో ముంబై, పుణె, ఢిల్లీ, హైదరాబాద్‌, విజయవాడతోపాటు పలు నగరాల్లో మొత్తం 8 టీమ్స్ దర్యాప్తు చేపట్టాయి.ఆ6 సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఆ8 డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వేల్కర్, ఆ10 సిల్వర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముకుల్‌ అగర్వాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆరోగ్య కారణాలతో ముకుల్‌ అగర్వాల్‌ను మచిలీపట్నం జైలుకు తరలించగా, మిగతా ఇద్దరు నిందితులను విజయవాడ జైలుకు షిఫ్ట్ చేశారు. ముకుల్‌ అగర్వాల్‌ కోవిడ్ రిపోర్ట్‌ రాగానే అతడిని కూడా విజయవాడ జైలుకు తరలించనున్నారు. అయితే, ఆ1 మాజీ స్పెషల్ సెక్రటరీ ఘంటా సుబ్బారావును అదుపులోకి తీసుకున్న సీఐడీ… ఆయనను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. ఈ స్కామ్‌లో ఆ2గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈయన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా పనిచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. దాంతో, ఈ కేసులో అత్యంత కీలకంగా మారారు లక్ష్మీనారాయణ.ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ ఫిర్యాదుతో ఈ స్కామ్‌ తెరపైకి వచ్చింది. ఇందులో గత ప్రభుత్వ పెద్ద తలకాయల పాత్ర ఉందనేది ఆరోపణ. అందుకే, ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుంది సర్కార్.