Politics

వైకాపా సిట్టింగుల్లో సగం మంది పక్కకే!

వైకాపా సిట్టింగుల్లో సగం మంది పక్కకే!

సిట్టింగుల్లో సగం మంది పక్కకే… వైసీపీలో మారుతున్న లెక్కలు…!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో లెక్కలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు మహా కూటమి ఏర్పాటు తథ్యమన్న సంకేతాలు వస్తున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ-బీఎస్పీలు కూటమిగా ఏర్పాటు కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటిని దీటుగా ఎదుర్కొనాలంటే.. ఏం చేయా లనే అంతర్మథనం వైసీపీలోనూ సాగుతోంది.

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగు వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందిని పక్కన పెట్టాలని ఒక ఆలోచన పార్టీలో హల్చల్ చేస్తోంది. దీంతో ఏం జరుగుతుందో అనే చర్చ కింది స్థాయి నేతల్లో బాగానే సాగుతుండడం గమనార్హం.

ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉందనే విషయాన్ని పార్టీ అధిష్టానం ఇప్పటికే తెప్పించుకుందని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.

వీరిలో సీనియర్లు జూని యర్లు అనే తేడా లేకుండా.. ప్రజాభిప్రాయానికే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అంటే.. ప్రజలకు ఎవరు చేరువగా ఉన్నారు? ఎవరు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు? ప్రభుత్వ పథకాలను ఎవరు ప్రజలకు చేరువ చేస్తున్నారు? అందరినీ కలుపుకొని పోయే అవకాశం ఉన్న నాయకులు ఎంత మంది? వంటి అన్ని వివరాలను కూడా పార్టీ సేకరించింది.

దీనిని బట్టి.. ప్రజల్లో లేని నాయకులు వ్యాపారాలే పరమావధిగా ఉన్న నేతలను ఏరేయడం ఖాయమని అంటున్నారు. ఈ విషయంలో జగన్ బంధువులే అయినా.. లెక్కచేసేది లేదని స్పష్టంగా చెబుతున్నారు.

అంటే.. దీనిని బట్టి మచ్చలేని నాయకులకు మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారనేది వాస్తవమనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఉ న్న వారిలో ఇలాంటి వారిని ఏరడం చాలా కష్టమని.. కాబట్టి ఈ ప్రయోగం విఫలమవుతుందని.. కొందరు చెబుతున్నారు.

అయితే.. అదేసమయంలో కొత్త ముఖాలకు.. అవకాశం ఇస్తారని అంటున్నారు. ముఖ్యంగా స్థానికంగా పట్టున్న మహిళలకు సామాజిక వర్గాల వారీగా..ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని.. ఈ విషయంలో ఎక్కడా రాజీపడే దోరణి ఉండబోదని పెద్దలు చెబుతున్నారు. మరిఇప్పటికైనా.. ఎమ్మెల్యేలు జాగ్రత్త పడతారో.. లేదో .. చూడాలి