WorldWonders

వామ్మో….ఈ సముద్ర దోసకాయ ధర అంతా?

This protein rich sea cucumber price crosses more than 2lakhs

సాదారణంగా మన ఊరిలో దోసకాయ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే రూ.50 – రూ.100 మధ్య ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దోసకాయ ఖరీదు ఎంతో తెలిస్తే!.. షాక్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సముద్ర దోసకాయ ఖరీదు అక్షరాల రూ.2 లక్షల పైనే ఉంటుంది. మరి, ఇవి ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?. ఈ సముద్ర దోసకాయలు ఎక్కువగా దొరకవు. వీటిని పట్టుకోవడం కోసం కొన్ని సార్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే, ఈ సముద్ర దోసకాయలు చాలా ప్రత్యేకమైన జీవులు. వీటికి ఎలాంటి అవయవాలు ఉండవు. కేవలం, నోరు మాత్రమే ఉంటుంది. ఈ జీవులకు కొన్ని శతాబ్దాలుగా ఆసియాలో మంచి గిరాకీ ఉంటుంది. ఎక్కువ సంపన్న వర్గ కుటుంబాలు వీటిని ఆహారంగ స్వీకరిస్తారు. ప్రపంచంలోని 1,250 విభిన్న జాతుల సముద్ర దోసకాయలో జపనీస్ సముద్ర దోసకాయ చాలా ప్రత్యేకమైనది. గోల్డెన్ శాండ్ ఫిష్, డ్రాగన్ ఫిష్, కర్రీ ఫిష్ వంటి ఇతర రకాలతో పోలిస్తే ఇవీ అధిక శాతం ప్రోటీన్స్ కలిగి ఉంటాయి.ఈ సముద్ర దోసకాయల చర్మంలో ఫ్యూకోసిలేటెడ్ గ్లైకోసామినోగ్లైకాన్ అనే రసాయనం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ రసాయనంను ఆసియాలోని ప్రజలు కొన్ని శతాబ్దాలుగా బాధపడుతున్న ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు.