NRI-NRT

మాటూరిపేటలో తానా భారీ సేవా శిబిరం!

మాటూరిపేటలో తానా భారీ సేవా శిబిరం!

తానా ఫౌండేషన్ ట్రస్టీ, ప్రముఖ ప్రవాసాంధ్రుడు సామినేని రవి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మాటూరిపేటలో సోమవారం నాడు భారీ సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన 120 మందికి వినికిడి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి పరికరాలను ఆపరేషన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని సామినేని రవి తెలిపారు. తానా ఫౌండేషన్ తో పాటు సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలో ఉన్న మూడు పాఠశాలలకు టీవీలను, 50 సోలార్ లాంతర్లను అందజేశారు. విద్యార్ధులకు “స్పెల్ బీ”లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. నిరుపేదలకు 100 రగ్గులను, ఒక వికలాంగుడికి మూడు చక్రాల స్కూటర్ ను ఒక పేద మహిళకు ఫ్లౌర్ మిల్లును విరాళంగా అందజేశారు. పాఠశాల విద్యార్ధులకు గుండె జబ్బులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సీపీఆర్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తానా ఫౌండేషన్ చైర్మన్ వై వి రమణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. సామినేని ట్రస్ట్ చైర్మన్ సామినేని నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.