NRI-NRT

GHHF ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు

GHHF ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు

గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(GHHF) ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నం, హైదరాబాద్, ఏలూరుపాలెం(ప్రకాశం జిల్లా)లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులకు అన్నదానం, చిన్నారులకు భగవద్గీత పుస్తకాలు, తినుబండారాలు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులను అందజేశారు. విశాఖపట్నంలో భగవద్గీత శ్లోకాలపై పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులను అందజేసినట్లు GHHF వ్యవస్థాపకులు డా.వెలగపూడి ప్రకాశరావు ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నారుల్లో సనాతన సాంప్రదాయల పట్ల మక్కువ, అవగాహన పెంపొందించడంతో పాటు జీవితాన్ని ఆస్వాదించడం, కష్టాలను ఎదుర్కొనడం వంటి ఎన్నో అంశాలను ఎలా పరిష్కరించుకోవాలో భగవద్గీత బోధిస్తుందని, భావితరానికి దీన్ని చేరువ చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Whats-App-Image-2021-12-15-at-5-43-51-PM-3
Whats-App-Image-2021-12-15-at-5-43-51-PM-2
Whats-App-Image-2021-12-15-at-5-43-51-PM-1
Whats-App-Image-2021-12-15-at-5-43-50-PM