NRI-NRT

హన్మకొండలో ఆటా “ఆర్ట్” సంగీత కార్యక్రమం

హన్మకొండలో ఆటా “ఆర్ట్” సంగీత కార్యక్రమం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో సోమవారం నాడు హన్మకొండలోని అంబేద్కర్ భవన్ ఆడితోరియంలో అన్నమయ్య , రామదాసు , త్యాగరాజుల (ఆర్ట్) ది జర్నీ టు ది మ్యూజికల్ సోల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రెసిడెంట్ భువనేశ్ బూజల, ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా సేవ డేస్ అండ్ ఆటా వేడుకలు చైర్ మధు బొమ్మినేని, ఆటా వేడుకలు కోచైర్స్ , పాలకమండలి సభ్యులు అనిల్ బొద్ది రెడ్డి , శరత్ వేముల మరియు శారద సింగిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డి , పాలకమండలి సభ్యులు సుధీర్ బండారు, కాశి కొత్త , సాయి సుదిని, వేణు పిస్కె, తిరుపతి రెడ్డి ఎర్రం రెడ్డి , ఆటా మహాసభల సలహాదారు గౌతమ్ గోలి, ఆటా కార్యవర్గ బృందం శ్రీనివాస్ ఏ, సూర్య చంద్రా రెడ్డి, జ్యోత్స్న బొబ్బాల, భద్రకాళి దేవాలయం చైర్మన్ శేషు, రామభద్ర క్షేత్రం స్థాపకులు సంతోష్ పండరి తదితరులు పాల్గొన్నారు. కృష్ణవేణి మల్లావజ్జల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నిహాల్ కొండూరి, లాయక్ అహ్మద్ మొహమ్మద్ అన్నమయ్య ,రామదాస, త్యాగరాజ ముగ్గురు వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళన ఉత్సవాన్ని శిష్య బృందంతో కలిసి నిర్వహించారు. కే.ప్రణతి , వినయ్ ,కార్తికేయ,శృతిక,నీలేష్, లాస్యప్రియ.ఎమ్ అభిజ్ఞ,వి.నికిత, శహబాజ్ మొహమ్మద్ , హర్షిత్, వి.ప్రణవిలు ఆలపించారు. తితిదే పవన్ కుమార్ వాయిద్య బృంద సహకారం అందించింది. రావుల సాయి సంజన రెడ్డి అన్నమయ్య కీర్తనపై నృత్యం చేశారు. ములుగు ఎం.ఎల్ .ఏ సీతక్క తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నవారిని అభినందించారు.