NRI-NRT

పెనమలూరులో తానా నేత్రవైద్య శిబిరం విజయవంతం

TANA Rotary Hospital VIjayawada Eye Medical Camp In Penamaluru

కృష్ణా జిల్లా పెనమలూరులో తానా-రోటరీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన వారికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. తానా మీడియా విభాగ సమన్వయకర్త మల్లినేని ఠాగూర్ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు గ్రామ సర్పంచ్ లింగాల భాస్కర్, సుధీర్ పాలడుగు, కంచర్ల సుధీర్, మోర్ల నరేంద్రబాబు, మరీదు వరప్రసాద్, కిలారు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.