NRI-NRT

గృహహింస బాధితులకు సాయపడే సంస్థకు టాంటెక్స్ విరాళం

గృహహింస బాధితులకు సాయపడే సంస్థకు టాంటెక్స్ విరాళం

డాలస్‌కు చెందిన గృహహింస బాధితులకు తోడ్పడే సేవా సంస్థ The Family Place Trustకు స్థానిక తెలుగు సంఘం టాంటెక్స్ ₹1205 డాలర్లు విరాళంగా అందజేసింది. ఈ చెక్కును నిర్వాహకులకు టాంటెక్స్ అధ్యక్షురాలు పాలేటి లక్ష్మీ అన్నపూర్ణ చేతుల మీదుగా అందజేశారు. దాతలకు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టాంటెక్స్ ప్రతినిధులు కృష్ణారెడ్డి కోడూరు, స్రవంతి ఎర్రమనేని, వెంకట్ ములుకుట్ల, శ్రీకాంత్ పోలవరపు తదితరులు పాల్గొన్నారు.