Editorials

పంజాబ్ సరిహద్దుల్లో S-400 క్షిపణుల మొహరింపు

పంజాబ్ సరిహద్దుల్లో S-400 క్షిపణుల మొహరింపు

భారత వాయుసేన అమ్ముల పొదిలోకి రష్యాకు చెందిన అత్యాధునిక ఎస్-400 మిస్సైల్స్‌ వచ్చిచేరిన సంగతి తెలిసిందే. భారత్​, రష్యా మధ్య గతంలో జరిగిన ఒప్పందం మేరకు వీటిని రష్యా భారత్​కి పంపించింది. ఇప్పుడు భారత వైమానిక దళం ఎస్-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను తాజాగా పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ బోర్డర్ వెంట మోహరించింది. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యాదునిక ఏరియల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఇది. డ్రోన్స్‌ నుంచి బాలిస్టిస్‌ మిస్సైల్స్‌ వరకు దేన్నైనా ఎదుర్కొనగల సామర్ధ్యం దీని సొంతం. ఎస్‌-400 ట్రైంఫ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌లో మొదటిదాన్ని భారత్‌ ఇక్కడ మోహరించింది.

పాకిస్తాన్, చైనా దేశాల నుంచి ఎదురయ్యే గగనతల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ గగనతలం శత్రుదుర్భేద్యంగా మార్చడంలో ఈ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత తూర్పు సరిహద్దులో భారత వాయుసేన ఈ ఎస్‌-400 ట్రైంఫ్‌ మిస్సైల్‌ మోహరించే అవకాశం ఉంది. ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయాణించే మిస్సైల్‌ వ్యవస్థయే ఎస్- 400 మిస్సైల్‌. దీనిని ఎస్ఏ-21 గ్రోలర్‌ అని నాటో పిలుస్తుంది. ఇది అత్యంత సమర్థవంతంగైన మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ అని దీన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌, యూఏవీలు, క్రూయిజ్‌ మిస్సైల్స్‌తోనూ ఉపయోగించవచ్చు.